STOCKS

News


అవెన్యూస్‌ పేమెంట్స్‌లో వాటా కొనుగోలు చేసిన ఐసీఐసీఐ

Saturday 22nd September 2018
news_main1537611136.png-20482

ముంబై:- ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు ఈ-కామర్స్‌ సంస్థ అవెన్యూస్‌ పేమెంట్స్‌లో వాటా కొనుగోలుకు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా బీ2బీ, బీ2సీ చెల్లింపుల మార్కెట్‌లో సేవలు అందిస్తున్న అవెన్యూస్‌ పేమెంట్స్‌లో 8.9శాతం వాటాను రూ.10కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు శుక్రవారం ఐసీఐసీఐ బ్యాంకు రెగ్యూలేటరీకి సమాచారం ఇచ్చింది. ఈ వాటా కొనుగోలు ప్రక్రియను అక్టోబర్‌ చివరినాటికి పూర్తి చేస్తామని ఐసీఐసీఐ తెలిపింది. వాటా కొనుగోలు 10శాతానికి తక్కువ ఉన్నందున్న రెగ్యూలేటరీల అనుమతి అవసరం లేదని, కేవలం కొనుగోలు సమాచారాన్ని మాత్రమే తెలియజేస్తున్నట్లు ఐసీఐసీఐ పేర్కోంది. వార్షికంగా రూ.12 మిలియన్లు టర్నోవర్‌ను కలిగి ఉన్న అవెన్యూస్‌ పేమెంట్స్‌ 2012 జనవరి నుంచి ఇండియా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా దేశాల్లో తన కార్యకలాపాలను కొనసాగిస్తుంది.



You may be interested

అర్డినరీ షేర్లు vs డీవీఆర్‌ షేర్లు

Saturday 22nd September 2018

మొట్టమొదటి సారిగా టాటా మోటార్స్‌ 2008లో డిఫరెన్షియల్‌ ఓటింగ్‌ రైట్స్‌ (డీవీఆర్‌) షేర్లను జారీ చేసినప్పుడు వాటిపై చాలా హైప్‌ క్రియేట్‌ అయ్యింది. తర్వాత గుజరాత్‌ ఎన్‌ఆర్‌ఈ కోక్‌, ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌, జైన్‌ ఇరిగేషన్‌ వంటి పలు కంపెనీలు డీవీఆర్‌ షేర్లను జారీ చేశాయి. సాధారణంగా డివిడెండ్‌ ఎక్కువగా ఉండటం కారణంగా ఇన్వెస్టర్లు వీటికి ఆకర్షితులౌతారు. అయితే డీవీఆర్‌ షేర్లకు తక్కువ ఓటింగ్‌ రైట్స్‌ ఉంటాయి. భారత్‌లోని వ్యక్తిగత ఇన్వెస్టర్లు

ఇలాంటప్పుడు డిఫెన్సివ్‌ స్టాకులతోనే రక్షణ!

Saturday 22nd September 2018

పతనం ఇస్తున్న సంకేతాలు గతంలో నిఫ్టీ పలుమార్లు భారీ పతనాలను చవిచూసిందని, అందువల్ల శుక్రవారం సడన్‌ పతనానికి కారణాలు అన్వేషించడం మాని తర్వాత ఏమి చేయాలో ఆలోచించుకోవాలని మార్కెట్‌ నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇలాంటి పతనాల నుంచి పాఠాలు నేర్చుకోవాలన్నారు. ఇక మీదట పోర్టుఫోలియోలో డిఫెన్సివ్‌ స్టాక్స్‌ను పెంచువాలని ఈ అనూహ్య పతనం సంకేతాలు ఇస్తోందన్నారు. జీడీపీ నెంబర్లు ప్రకటించినప్పటినుంచి సూచీలు బలహీనంగా కొనసాగిస్తున్నాయి. ‘రూమర్లున్నప్పుడు కొనండి.. వార్తలను బట్టి అమ్మండి’’అనే

Most from this category