STOCKS

News


ఆస్ట్రేలియా వర్సిటీ ఫీజులు ఐసీఐసీఐలో చెల్లించొచ్చు!

Tuesday 10th July 2018
news_main1531238991.png-18178

న్యూఢిల్లీ: భారతీయ విద్యార్థులు ఆస్ట్రేలియా వర్సిటీలకు ఆన్‌లైన్లో ఫీజులను చెల్లించే సదుపాయాన్ని ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం ఆస్ట్రేలియాకి చెందిన వెస్ట్‌ప్యాక్‌ బ్యాంకింగ్ కార్పొరేషన్‌తో (వెస్ట్‌ప్యాక్) ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఆన్‌లైన్ ఫీజుల చెల్లింపు సదుపాయం ముందుగా ‘లా ట్రోబ్’ యూనివర్సిటీలో అందుబాటులో ఉంటుందని, తర్వాత మిగతా వర్సిటీలు, కాలేజీలు కూడా అందుబాటులోకి వస్తాయని ఐసీఐసీఐ బ్యాంక్ ఈడీ విజయ్ చందోక్ తెలిపారు. ప్రత్యేక చార్జీలేమీ లేకుండా నిర్దిష్ట ఎక్స్చేంజీ రేటుకు ఫీజును చెల్లించవచ్చని, పూర్తి మొత్తాన్ని సదరు కళాశాల ఖాతాలో జమ చేయడం జరుగుతుందని ఆయన వివరించారు. 



You may be interested

ఐడీబీఐ బ్యాంకులో వాటా వద్దు

Tuesday 10th July 2018

న్యూఢిల్లీ: ఆర్థిక సమస్యల్లో ఉన్న ప్రభుత్వరంగ ఐడీబీఐ బ్యాంకులో 51 శాతం వాటా కొనుగోలుకు ఎల్‌ఐసీ తీసుకున్న నిర్ణయాన్ని ఆ సంస్థ ఉద్యోగులు వ్యతిరేకించారు. ఇది పాలసీదారుల ప్రయోజనాలను దెబ్బతీస్తుందని ఎల్‌ఐసీ ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో గతంలో ఎల్‌ఐసీ పెట్టుబడుల పనితీరును ఉదహరిస్తూ... ఈ బ్యాంకుల విలువ చెప్పుకోతగ్గ స్థాయిలో తుడిచిపెట్టుకు పోయిందని, అది తమ లాభాలపైనా ప్రభావం చూపుతుందని ఎల్‌ఐసీ క్లాస్‌-1

మెరుపు తగ్గిన గోల్డ్‌ ఈటీఎఫ్‌లు!

Tuesday 10th July 2018

న్యూఢిల్లీ: బంగారం ధరలు పెద్దగా పెరగకపోవటంతో గోల్డ్‌ ఎక్సేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌లో (ఈటీఎఫ్‌) అమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికంలో రూ.146 కోట్ల మేర బంగారం ఈటీఎఫ్‌ల నుంచి ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్ని వెనక్కి తీసుకున్నారు. దీంతో బంగారం ఫండ్స్‌ నిర్వహణలోని ఆస్తుల విలువ 12 శాతం క్షీణించి రూ.4,567 కోట్లకు తగ్గింది. ఇది అంతకు ముందు ఏడాది జూన్‌ నాటికి రూ.5,174 కోట్లుగా

Most from this category