STOCKS

News


ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌పై అధ్యయానికి ఐసీఏఐ కమిటీ

Friday 12th October 2018
news_main1539318795.png-21075

న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ను కేంద్రం చక్కదిద్దే ప్రయత్నాల్లో ఉన్న నేపథ్యంలో.. దీనికి దారి తీసిన వ్యవస్థాగత అంశాలను అధ్యయనం చేయాలని ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్‌ (ఐసీఏఐ) నిర్ణయించింది. ఇందుకోసం తొమ్మిది మంది సభ్యులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. ఐఎల్‌అ౾ండ్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభంలో వ్యవస్థాగత అంశాలను అధ్యయనం చేసి, వాటిని సరిదిద్దేందుకు.. వ్యవస్థను చక్కబెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలను ఈ కమిటీ సిఫార్సు చేయనుందని ఐసీఏఐ పేర్కొంది. గత కొన్నేళ్లుగా ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ ఖాతాలు ఆడిటింగ్ చేస్తున్న ఆడిట్ సంస్థలు వివరణనివ్వాలంటూ ఐసీఏఐ ఇప్పటికే ఆదేశించింది. అలాగే, ఈ సంక్షోభానికి సంబంధించిన వివరాలు ఇవ్వాల్సిందిగా రిజర్వ్ బ్యాంక్‌, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్‌ (ఎస్‌ఎఫ్‌ఐవో)లను కూడా కోరింది. ఎస్‌బీ జవారే సారథ్యంలోని ఈ కమిటీలో ఐసీఏఐ మాజీ ప్రెసిడెంట్స్‌ వేద్ జైన్‌, నీలేష్ శివ్‌జీ వికమ్‌సే కూడా సభ్యులుగా ఉంటారు. 2008లో సత్యం కంప్యూటర్‌ సర్వీసెస్ కుంభకోణం బైటపడినప్పుడు వేద్ జైన్‌.. ఐసీఏఐ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. 

నేడు ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ బోర్డు సమావేశం
కొత్తగా ఏర్పాటైన ఐఎల్‌అ౾ండ్‌ఎఫ్‌ఎస్‌ బోర్డు శుక్రవారం (నేడు) భేటీ కానుంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన కంపెనీని గట్టెక్కించడానికి అనుసరించాల్సిన భవిష్యత్ ప్రణాళికను ఇందులో ఖరారు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తొలిసారిగా అక్టోబర్ 4న సమావేశమైన ఆరుగురు సభ్యుల బోర్డు.. ప్రాథమిక పరిస్థితులను పరిశీలించింది. తదుపరి శుక్రవారం జరిగే రెండో సమావేశంలో నిధుల సమీకరణ సహా వివిధ అంశాల గురించి చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. గ్రూప్‌నకు తక్షణం రూ. 3,000 కోట్ల నిధులు అవసరం. ఇందుకోసం రూ. 4,500 కోట్ల రైట్స్ ఇష్యూ కూడా చేపట్టాలని సంస్థ భావిస్తోంది. దాదాపు రూ. 91,000 కోట్ల రుణభారం ఉన్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌.. పలు రుణాలను చెల్లించడంలో డిఫాల్ట్ కావడం, ఈ ప్రభావాలతో స్టాక్‌మార్కెట్లు కకావికలం అయిన సంగతి తెలిసిందే.You may be interested

ఆధార్‌ బయటపెడితే నష్టమేం లేదు: ఆర్‌ఎస్‌ శర్మ

Friday 12th October 2018

న్యూఢిల్లీ: ట్రాయ్‌ చైర్మన్‌ ఆర్‌ఎస్‌ శర్మ మరోసారి ఆధార్‌ గోప్యతపై తన అభిప్రాయాలను గట్టిగా వినిపించారు. ఆధార్‌ నంబర్‌ను బయటపెట్టడం వల్ల డిజిటల్‌ పరంగా వచ్చే ముప్పేదీ లేదన్నారు. తన ఆధార్‌ నంబర్‌ ప్రకటించి, దీన్ని ఎలా దుర్వినియోగం చేస్తారో చూపించండంటూ శర్మ గతంలో సవాల్‌ విసిరి వార్తల్లో నిలిచిన విషయం గమనార్హం. ఆధార్‌ గోప్యత అనే అంశం చుట్టూ ఇంత కాలం జరిగిన చర్చలకు, ఎన్నో ప్రశ్నలకు ఇటీవలి

భారత్‌లో నాలుగో పారిశ్రామిక విప్లవ కేంద్రం

Friday 12th October 2018

న్యూఢిల్లీ: భారత్‌ను నాలుగో పారిశ్రామిక విప్లవ కేంద్రానికి వేదికగా ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) ఎంచుకుంది. ఈ కేంద్రాన్ని ప్రధాని మోదీ గురువారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆవిష్కరించారు. ప్రభుత్వం, వ్యాపార సంస్థలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి నూతన టెక్నాలజీ విధానాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ కేంద్రం పనిచేయనుంది. ఈ కేంద్రం మహారాష్ట్రలో ఏర్పాటు కానుంది. డ్రోన్లు, కృత్రిమ మేథ (ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌), బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీలను తొలి మూడు

Most from this category