STOCKS

News


ఐబీఎం​ చేతికి రెడ్‌ హ్యాట్‌

Tuesday 30th October 2018
Markets_main1540879332.png-21578

రెడ్‌ హ్యాట్‌ను కొనుగోలు చేసిన ఐబీఎమ్‌

  • డీల్‌ విలువ 3,400 కోట్ల డాలర్లు

శాన్‌ఫ్రాన్సి‍స్కో: ఓపెన్‌ సోర్స్‌ సొల్యూషన్స్‌ లీడర్‌ రెడ్‌ హ్యాట్‌ కంపెనీని టెక్నాలజీ దిగ్గజం ఐబీఎమ్‌ కొనుగోలు చేసింది. రెడ్‌ హ్యాట్‌ కొనుగోలుతో లక్ష కోట్ల డాలర్ల హైబ్రిడ్‌ క్లౌడ్‌ మార్కెట్‌లో ఆధిపత్యం కోసం ఐబీఎమ్‌ మరో అడుగు ముందుకేసింది. ఈ డీల్‌ విలువ 3,400 కోట్ల డాలర్లు.

ఐబీఎమ్‌ ఇప్పటి వరకూ ఎన్నో కంపెనీలను కొనుగోలు చేసింది. ఈ కొనుగోళ్ల లావాదేవీల్లో ఇదే అది పెద్దది. రెడ్‌ హ్యాట్‌ను కొనుగోలు చేయడం క్లౌడ్‌ మార్కెట్లో పెను మార్పుకు దారి తీయనున్నదని ఐబీఎమ్‌ చైర్మన్‌, ప్రెసిడెంట్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌​ ఆఫీసర్‌ గిన్ని రొమెట్టీ వ్యాఖ్యానించారు. హైబ్రిడ్‌ క్లౌడ్‌ సేవలందించే అతి పెద్ద ప్రపంచ సంస్థగా ఐబీఎమ్‌ అవతరించనున్నదని ఆమె పేర్కొన్నారు. ఈ డీల్‌లో భాగంగా ఒక్కొక్క రెడ్‌హ్యాట్‌ షేర్‌ను 190 డాలర్లకు ఐబీఎమ్‌ కొనుగోలు చేయనున్నది.

క్లౌడ్‌ మార్కెట్లో ఐబీఎమ్‌ కంపెనీ. అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌, మైక్రోసాప్ట్‌, గూగుల్‌ల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటోంది. రెడ్‌ హ్యాట్‌ను కొనుగోలు చేయడం వల్ల క్లౌడ్‌ డెవలప్‌మెంట్‌ ప్లాట్‌ఫార్మ్స్‌ మార్కెట్లో ఐబీఎమ్‌ పటిష్ట కంపెనీగా అవతరించగలదని నిపుణులు భావిస్తున్నారు.



You may be interested

ఎన్‌పీఏల సమస్యలను అధిగమించే స్థాయికి బ్యాంకులు

Tuesday 30th October 2018

- తిరిగి లాభాల్లోకి వస్తున్నాయి - ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ వ్యాఖ్య న్యూయార్క్‌: భారత బ్యాంకులు మొండి బకాయిల (ఎన్‌పీఏలు) సమస్యను అధిగమించే స్థాయికి వచ్చేశాయని ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ చెప్పారు. సెప్టెంబర్‌ త్రైమాసికంలో వస్తున్న ఫలితాలను బట్టి బ్యాంకులు తిరిగి లాభాల్లోకి వస్తున్నట్టు అర్థమవుతోందన్నారు. గతేడాది బ్యాంకులు భారీ స్థాయిలో ఎన్‌పీఏల పెరుగుదల సమస్యను ఎదుర్కొన్నట్టు చెప్పారు. ఎక్కువగా స్టీల్‌, విద్యుత్‌ రంగాలకు ఇచ్చిన రుణాల రూపంలో ఇది

ఇన్వెస్ట్‌మెంట్‌ మనోళ్లకు మహా ఇష్టం

Tuesday 30th October 2018

- ఆసియాలో అధిక చైతన్యం భారత్‌లోనే - వెల్లడించిన స్టాండర్డ్‌ చార్టర్డ్‌ అధ్యయనం - దీర్ఘకాలిక లక్ష్యాల కోసం పొదుపు బాట - పిల్లల చదువులే మొదటి ప్రాధాన్యం - సామాజిక చైనత్యం కూడా ఎక్కువే ఆసియాలో పెట్టుబడుల విషయంలో అధిక చైతన్యం కలిగింది భారత దేశమేనని ‘స్టాండర్డ్‌ చార్టర్డ్‌’ సంస్థ నిర్వహించిన అధ్యయనం తేల్చింది. ఎమర్జింగ్‌ అఫ్లూయంట్‌ స్డడీ 2018’ పేరుతో ఈ సంస్థ ఆసియా, ఆఫ్రికా, మిడిల్‌ఈస్ట్‌ ప్రాంతాల్లో సంపన్న వినియోగదారులు 11,000 మంది

Most from this category