STOCKS

News


హైదరాబాద్‌ నుంచే రాకెట్ల ప్రయోగం

Friday 26th April 2019
news_main1556253958.png-25360

  • 2021లో స్కైరూట్‌ ఎయిరోస్పేస్‌ ప్రయోగం

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్‌ ‘స్కైరూట్‌ ఎయిరోస్పేస్‌’ అంతరిక్షంలోకి రాకెట్లను ప్రయోగించనుంది. 2021 ద్వితీయార్థంలో విక్రం సిరీస్‌తో రాకెట్లను పంపించనుంది. ఇండియన్‌ స్పేస్‌ అండ్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో) మాజీ శాస్త్రవేత్తలు పవన్‌కుమార్‌ చందన, నాగ భరత్‌ దాకలు స్కైరూట్‌ ఎయిరోస్పేస్‌ ప్రమోటర్లుగా ఉన్నారు. శాటిలైట్‌ డిజైన్, టెస్టింగ్‌ లెవల్స్‌ పూర్తయ్యాయని.. ఆ తర్వాతి అవసరాల కోసం పెట్టుబడులు అవసరమని, అందుకే రెండో రౌండ్‌ నిధుల సమీకరణ కోసం పలువురు ఇన్వెస్టర్లతో చర్చలు జరుగుతున్నాయని ప్రమోటర్లు తెలిపారు. తొలి రౌండ్‌లో ముకేష్‌ భన్సల్, అంకిత్‌ నగోరీలు స్కైరూట్‌లో పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుతం కేబినెట్‌లో ఉన్న స్పేస్‌ యాక్టివిటీ బిల్లు–2017 ఆమోదం పొందితే ప్రైవేట్‌ కంపెనీలు కూడా స్పేస్‌కు సంబంధించిన కార్యకలాపాలు నిర్వహించే వీలుంటుంది. వచ్చే పదేళ్లలో దేశంలో 7 వేల శాటిలైట్స్‌ లాంచింగ్‌ అవుతాయని తెలిపారు. 



You may be interested

హెచ్‌డీఎఫ్‌సీ ఖాతాదారులకు మ్యాక్స్‌బూపా డిజిటల్‌ ఉత్పత్తులు

Friday 26th April 2019

న్యూఢిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఖాతాదారులకు మ్యాక్స్‌బూపా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ సమగ్రమైన, ప్రత్యేకమైన వైద్య బీమా ఉత్పత్తులను అందించనుంది. ఏనీటైమ్‌ హెల్త్‌ మెషిన్‌ పేరుతో డిజిటల్‌ టచ్‌ పాయింట్లు, హెచ్‌డీఎఫ్‌సీ నెట్‌బ్యాంకింగ్‌, డిజిటల్‌ సెల్లర్‌ యాప్‌ ఇన్‌స్టాఇన్‌ష్యూర్‌ రూపంలో ఈ సేవలను ఆఫర్‌ చేయనుంది. ఈ మేరకు మ్యాక్స్‌బూపా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మధ్య కార్పొరేట్‌ ఏజెన్సీ ఒప్పందం కుదిరింది.

ఉబెర్‌ ప్లాట్‌ఫామ్‌పై ఎంఅండ్‌ఎం ఇ- వాహనాలు

Friday 26th April 2019

హైదరాబాద్‌, సాక్షి బిజినెస్‌: నగరంలో ఉబెర్‌ ప్లాట్‌ఫామ్‌పై తమ ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రవేశపెడుతున్నట్లు మహీంద్రా అండ్‌ మహీంద్రా వెల్లడించింది. దేశంలో తొలిసారి ఇ-వాహనాలను ఉబెర్‌ ప్లాట్‌ఫామ్‌పై ప్రవేశపెట్టామని, వివిధ నగరాల్లో ఉబెర్‌యాప్‌లో తమ ఇ- వాహనాలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ముందుగా హైదరాబాద్‌లో 50 ఇ- వెరిటో సెడాన్‌లను అందుబాటులోకి తెచ్చామని, క్రమంగా ఇ2ఓప్లస్‌ హ్యాచ్‌బ్యాక్‌తో పాటు మరిన్ని వాహనాలను తీసుకువస్తామని తెలిపింది. దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాలకు సంబంధించి తాము

Most from this category