STOCKS

News


షిర్డీ-హైదరాబాద్‌ మధ్య స్పైస్‌జెట్‌ విమానం

Saturday 20th October 2018
news_main1540009379.png-21298

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:
విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ నవంబరు 3 నుంచి షిర్డీ-హైదరాబాద్‌ మధ్య ప్రతిరోజు డైరెక్ట్‌ సర్వీసు నడుపనుంది. ఉదయం 9.35కు హైదరాబాద్‌లో బయల్దేరే విమానం షిర్డీలో 11 గంటలకు దిగుతుంది. తిరుగు ప్రయాణంలో 11.20కి ప్రారంభమై 12.40కి హైదరాబాద్‌ చేరుకుంటుంది. ఇందుకోసం బాంబార్డియర్‌ క్యూ400 రకం విమానాన్ని కేటాయించామని స్పైస్‌జెట్‌ చీఫ్‌ సేల్స్‌, రెవెన్యూ ఆఫీసర్‌ శిల్పా భాటియా తెలిపారు. టికెట్‌ ధర షిర్డీకి రూ.3,999, తిరుగు ప్రయాణానికి రూ.3,900లు ఉంది. ప్రస్తుతం ఢిల్లీ నుంచి షిర్డీకి డైరెక్ట్‌ ఫ్లయిట్‌ను సంస్థ నడుపుతోంది.



You may be interested

మ్యాక్స్‌క్యూర్‌ హాస్పిటల్స్‌ విస్తరణ

Saturday 20th October 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: వైద్య సేవల రంగంలో ఉన్న మ్యాక్స్‌క్యూర్‌ హాస్పిటల్స్‌ విస్తరణ చర్యలు చేపట్టింది. మహారాష్ట్రలోని నాసిక్‌లో 11వ ఆసుపత్రిని 350 పడకల సామర్థ్యంతో నెలకొల్పింది. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ దీన్ని ఈ నెల 24న ఆరంభిస్తారు. అశోక గ్రూప్‌తో కలిసి ఈ సెంటర్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు మ్యాక్స్‌క్యూర్‌ ఎండీ జి.అనిల్‌ కృష్ణ ‘సాక్షి’ బిజినెస్‌ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. మెడికవర్‌ బ్రాండ్‌తో రానున్న ఈ ఆసుపత్రికి స్థలం,

సీఈఎస్‌సీ డీమెర్జర్‌తో ఇన్వెస్టర్‌కు లాభమెంత?

Friday 19th October 2018

సీఈఎస్‌సీ డీమెర్జర్‌ ఎట్టకేలకు తుది అంకానికి చేరింది. పలు అంశాల కారణంగా ఏడాదికిపైగా ఇది జాప్యం అవుతూ వచ్చింది. అక్టోబర్‌ 31 తేదీని డీమెర్జర్‌కు రికార్డు తేదీగా కంపెనీ ఖరారు చేసింది. అంటే ఆ రోజు నాటికి డీమ్యాట్‌ అకౌంట్లో షేర్లు కలిగిన వారికి కంపెనీ నుంచి డీమెర్జ్‌ చేసి లిస్ట్‌ చేసే కొత్త కంపెనీల షేర్లు లభిస్తాయి. తొలుత ప్రస్తుత కంపెనీని నాలుగు వ్యాపారాలుగా వేరు చేసి లిస్ట్‌

Most from this category