News


యూఎస్‌లో మేకర్స్‌ ఆఫ్‌ మిల్క్‌షేక్స్‌

Wednesday 21st November 2018
news_main1542775281.png-22240

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మిల్క్‌షేక్స్‌ తయారీలో ఉన్న హైదరాబాద్‌ ఫుడ్‌ స్టార్టప్‌ ‘మేకర్స్‌ ఆఫ్‌ మిల్క్‌షేక్స్‌’ యూఎస్‌లో అడుగుపెట్టింది. కాలిఫోర్నియాలో తొలి స్టోర్‌ను తెరిచింది. కెనడా, దుబాయి, సింగపూర్, ఆస్ట్రేలియా నుంచి ఫ్రాంచైజీల కోసం ఎంక్వైరీలు వస్తున్నాయని మేకర్స్‌ ఆఫ్‌ మిల్క్‌షేక్స్‌ ఫౌండర్‌ రాహుల్‌ తిరుమలప్రగడ మంగళవారం చెప్పారు. ‘‘ఆయా దేశాల్లో మార్చికల్లా ఔట్‌లెట్లను తెరుస్తాం. హైదరాబాద్‌ సహా దక్షిణాదిన మొత్తం 80 స్టోర్లున్నాయి. 2019 చివరినాటికి దేశవ్యాప్తంగా 200 ఔట్‌లెట్లను ఏర్పాటు చేయాలన్నది మా లక్ష్యం. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.40 కోట్ల టర్నోవర్‌ ఆశిస్తున్నాం’ అని పేర్కొన్నారు. కంపెనీ 2017–18లో రూ.25 కోట్ల టర్నోవర్‌ నమోదు చేసింది. సంస్థలో 300 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 



You may be interested

షావోమీ గిన్నిస్ రికార్డు

Wednesday 21st November 2018

న్యూఢిల్లీ: చైనా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం షావోమీ ఒకే రోజున 500 రిటైల్ స్టోర్స్‌ను ప్రారంభించి గిన్నిస్ రికార్డు సొంతం చేసుకుంది. భారత గ్రామీణ ప్రాంతాల్లో 'మి స్టోర్స్స్‌’ పేరిట అక్టోబర్ 29న వీటిని ప్రారంభించామని షావోమీ గ్లోబల్ వైస్‌ ప్రెసిడెంట్ మను కుమార్ జైన్ తెలిపారు. ప్రస్తుతం మెట్రో నగరాల్లో ఉన్న పెద్ద స్థాయి "మి హోమ్‌" స్టోర్స్‌ తరహాలోనే ఇవి కూడా ఉంటాయని తెలియజేశారు. 2019 ఆఖరు నాటికి

డిసెంబరు 2 నుంచి ఇండియా జాయ్‌

Wednesday 21st November 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: గేమింగ్‌, డిజిటల్‌ మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ కంటెంట్‌ రంగంలో ఆసియాలో భారీ ప్రదర్శన, సదస్సుకు హైదరాబాద్‌ వేదికవుతోంది. ఇండియా జాయ్‌ పేరుతో తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ వీఎఫ్‌ఎక్స్‌, యానిమేషన్‌, గేమింగ్‌ అసోసియేషన్‌ (త్వాగా) సహకారంతో డిసెంబరు 2 నుంచి 6 వరకు హెచ్‌ఐసీసీ, హైటెక్స్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. ఇన్వెస్టర్లు, కార్పొరేట్‌ సంస్థలు,  స్టూడియోలు, కంటెంట్‌ డెవలపర్స్‌, హార్డ్‌వేర్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌, కస్టమర్లు, విద్యార్థులు దీనికి హాజరవుతారని త్వాగా

Most from this category