News


హెచ్‌యూఎల్‌ ఫలితాలపై బ్రోకరేజ్‌ల అంచనాలు

Thursday 17th January 2019
news_main1547701105.png-23630

ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హెచ్‌యూఎల్‌ గురువారం క్యు3 ఫలితాలు ప్రకటించనుంది. వాల్యూం గ్రోత్‌, ఉత్పత్తుల ధరల పెంపుదలతో ఈ దఫా కంపెనీ మంచి ఫలితాలు ప్రకటించవచ్చని బ్రోకరేజ్‌లు భావిస్తున్నాయి. లాభాలు, రెవెన్యూ రెండంకెల వృద్ధి నమోదు చేయవచ్చని భావిస్తున్నాయి. క్యు3లో లాభాలు 6- 10 శాతం, రెవెన్యూ 10- 13 శాతం, లాభాల వృద్ధి 12- 20 శాతం పెరుగుదల చూపుతాయని అంచనా. వాల్యూంల్లో 10 శాతం, విక్రయాల్లో 12.5 శాతం వృద్ధి ఉంటుందని బ్రోకరింగ్‌ సంస్థల అభిప్రాయం. పండుగ సీజన్‌, రూరల్‌ డిమాండ్‌లో పెరుగుదల, సంస్థాగత రంగానికి చెందిన ఉత్పత్తులవైపు వినియోగదారుల మొగ్గు పెరగడం తదితర అంశాలు కంపెనీ ఫలితాలపై బలమైన పాజిటివ్‌ ప్రభావం చూపుతాయి. అందువల్ల ఈ దఫా ఎబిటా 10- 23 శాతం వృద్ధి చెందుతుందని, మార్జిన్లలో 100- 200 బీపీఎస్‌ మెరుగుదల ఉండొచ్చని అనలిస్టుల సగటు అంచనా. 
ఏం చూడాలి?
- వాల్యూంగ్రోత్‌, కన్జూమర్‌ డిమాండ్‌పై కామెంటరీ
- రూరల్‌ రికవరీలో వేగం
- లీవర్‌ ఆయుష్‌, డబ్ల్యఐఎంఐ వృద్ధి.

 



You may be interested

స్టార్టప్‌లకు ఉపశమనం

Thursday 17th January 2019

- ఏంజెల్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై పన్ను మినహాయింపు? - ప్రక్రియను సరళతరం చేయనున్న ప్రభుత్వం - 45 రోజుల్లో క్లెయిమ్‌లపై నిర్ణయం తీసుకోవాలని డెడ్‌లైన్‌ న్యూఢిల్లీ: పన్నుకు సంబంధించి స్టార్టప్‌ సంస్థల్లో నెలకొన్న భయాందోళనలు కాస్త ఉపశమించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏంజెల్‌ ఫండ్స్‌ వెచ్చించే పెట్టుబడులపై స్టార్టప్స్‌ పన్ను మినహాయింపులను కోరేందుకు సబంధించిన ప్రక్రియను సరళతరం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు బుధవారం వెల్లడించాయి. ఏంజెల్‌ ఫండ్స్‌ ద్వారా తాము సమీకరించిన నిధులపై పన్నులు

దక్షిణాదిన సూపర్‌ ప్లాస్ట్రానిక్స్‌ ప్లాంటు

Thursday 17th January 2019

- పరిశీలనలో తెలంగాణ, ఏపీ - కంపెనీ సీఈవో అవనీత్‌ సింగ్‌ హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: భారత్‌లో కొడాక్‌, థామ్సన్‌ బ్రాండ్ల టీవీల తయారీ లైసెన్సున్న ‘సూపర్‌ ప్లాస్ట్రానిక్స్‌’... మరో ప్లాంటు ఏర్పాటు చేయనుంది. ఉత్తరాదిన మూడు ప్లాంట్లున్న ఈ కంపెనీ నాల్గవ యూనిట్‌ను దక్షిణాదిన ఏర్పాటు చేస్తామని తెలియజేసింది. ఇందుకోసం ఏపీ, తెలంగాణ, తమిళనాడు పరిశీలనలో ఉ‍న్నాయని సూపర్‌ ప్లాస్ట్రానిక్స్‌ సీఈవో అవనీత్‌ సింగ్‌ మార్వా బుధవారమిక్కడ మీడియాకు చెప్పారు. ‘కొత్త

Most from this category