STOCKS

News


హెచ్‌యూఎల్‌ చేతికి ‘ఆదిత్య మిల్క్‌’

Tuesday 7th August 2018
news_main1533618103.png-18988

న్యూఢిల్లీ: ‘ఆదిత్య మిల్క్‌’ బ్రాండ్‌ను ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజం హిందుస్తాన్‌ యూనిలివర్‌ కొనుగోలు చేయనున్నది. ఈ మేరకు ఆదిత్య మిల్క్‌ బ్రాండ్‌ ఐస్‌క్రీమ్‌, ఫ్రోజెన్‌ డిజర్ట్‌లను తయారు చేసే ఈ బ్రాండ్‌ యాజమాన్య సంస్థ, విజయకాంత్‌ డైరీ అండ్‌ ఫుడ్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నామని హెచ్‌యూఎల్‌ తెలిపింది. భారత్‌లో వేగంగా వృద్ధి చెందుతున్న ఐస్‌క్రీమ్‌, ఫ్రోజెన్‌ డిస్సర్ట్‌ మార్కెట్‌లో తమ స్థానాన్ని మరింతగా పటిష్టం చేసుకునే వ్యూహంలో భాగంగా ఈ బ్రాండ్‌ను కొనుగోలు చేయనున్నామని హెచ్‌యూఎల్‌ సీఎమ్‌డీ, సంజీవ్‌ మెహతా తెలిపారు. 



You may be interested

ఉజ్జీవన్ ఫైనాన్షియల్ నికర లాభం రూ.45 కోట్లు

Tuesday 7th August 2018

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికం (క్యూ1)లో ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌ ఆశాజనక ఫలితాలను ప్రకటించింది. నిర్వాహణ ఆదాయం పెరిగిన కారణంగా నికర లాభం రూ.45 కోట్లుగా నమోదైనట్లు ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.74.90 కోట్ల నికర నష్టాన్ని నమోదుచేసింది. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌ కాలానికి ఆదాయం రూ.460 కోట్లకు చేరుకోగా.. అంతకుముందు ఇదేకాలంతో పోల్చితే 28.4 శాతం వృద్ధిచెందినట్లు తెలిపింది. నికర వడ్డీ

రూపాయి డౌన్‌..

Tuesday 7th August 2018

మంగళవారం 68.91 వద్ద ప్రారంభం మునపటి ముగింపు 68.89తో పోలిస్తే 0.05 శాతం క్షీణత ఇండియన్‌ రూపాయి మంగళవారం అమెరికా డాలర్‌తో పోలిస్తే క్షీణించింది. వాణిజ్య ఉద్రిక్తతల భయాల కొనసాగింపు, యూకేలోని రాజకీయ అస్థిరత పరిస్థితులు ఇందుకు ప్రధాన కారణం. ఉదయం 9:10 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 68.92 వద్ద ట్రేడ్‌ అవుతోంది. తన మునపటి ముగింపు 68.89తో పోలిస్తే 0.05 శాతం క్షీణించింది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి

Most from this category