News


హెచ్‌యూఎల్‌ లాభం రూ.1,444 కోట్లు

Friday 18th January 2019
news_main1547788437.png-23650

  • నికర అమ్మకాలు 12 శాతం అప్‌
  • 22  శాతం వృద్ధితో రూ.2,046 కోట్లకు ఎబిటా
  • ఐదో క్వార్టర్‌లోనూ రెండంకెల అమ్మకాల వృద్ధి

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజం హిందుస్తాన్‌ యూనిలీవర్‌ (హెచ్‌యూఎల్‌) ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.1,444 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.1,326 కోట్ల నికర లాభం వచ్చిందని, 9 శాతం వృద్ది సాధించామని హెచ్‌యూఎల్‌ తెలిపింది. అమ్మకాలు జోరుగా ఉండటం, మార్జిన్లు మెరుగుపడటంతో ఈ స్థాయి నికర లాభం సాధించామని హెచ్‌యూఎల్‌ సీఎమ్‌డీ సంజీవ్‌ మెహతా తెలిపారు. గత క్యూ3లో రూ.8,323 కోట్లుగా ఉన్న నికర అమ్మకాలు ఈ క్యూ3లో 12 శాతం వృద్ధితో రూ.9,357 కోట్లకు ఎగిశాయన్నారు. గత క్యూ3లో రూ.7,036 కోట్లుగా ఉన్న మొత్తం వ్యయాలు ఈ క్యూ3లో 9 శాతం పెరిగి రూ.7,652 కోట్లకు పెరిగాయని తెలిపారు.
మెరుగుపడిన మార్జిన్లు...
అమ్మకాల్లో రెండంకెల వృద్ధి సాధించామని, ఎబిటా మార్జిన్‌ 1.7 శాతం పెరిగిందని, స్థూల లాభం 17 శాతం వృద్ధి చెందిందని మెహతా వివరించారు. ఎబిటా 22 శాతం పెరిగి రూ.2,046 కోట్లకు పెరిగిందని, ఈ క్యూ3లో మంచి ఫలితాలు సాధించామని సంతృప్తి వ్యక్తం చేశారు. కీలకమైన వ్యాపారాలపై దృష్టిని కేంద్రీకరించడంతో పాటు మార్కెట్‌  ట్రెండ్స్‌కు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం మంచి ఫలితాలను ఇచ్చిందన్నారు. ముడి చమురు, కరెన్సీల్లో ఒడిదుడుకులు చోటు చేసుకున్నా, పటిష్టమైన నిర్వహణ పద్ధతుల కారణంగా మార్జిన్‌ మెరుగుపడిందని పేర్కొన్నారు.
నిలకడగానే డిమాండ్‌...
సమీప భవిష్యత్తులో డిమాండ్‌ నిలకడగానే ఉండే అవకాశాలున్నాయని మెహతా చెప్పారు. సుస్థిరమైన, లాభదాయకమైన, బాధ్యతాయుత వృద్ధి సాధనపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తున్నామని వివరించారు. గ్లాక్సోస్మిత్‌లైన్‌ కన్సూమర్‌ హెల్త్‌కేర్‌ విలీనానికి కావలసిన అనుమతుల పొందే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. మార్కెట్‌ ముగిసిన తర్వాత హెచ్‌యూఎల్‌ ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాలపై అనిశ్చితితో ఈ షేర్‌ ఒడిదుడుకులకు గురైంది.
ఎఫ్‌ఎమ్‌సీజీలో టాప్‌ పిక్‌ ఇదే
అమ్మకాలు రెండంకెల వృద్ధి సాధించడం ఇది వరుసగా ఐదో క్వార్టర్‌ అని షేర్‌ఖాన్‌/బీఎన్‌పీ పారిబా విశ్లేషకుడు కస్తుర్బా పవస్‌కర్‌ వ్యాఖ్యానించారు. ఎఫ్‌ఎమ్‌సీజీ సెగ్మెంట్‌లో తమ టాప్‌ పిక్‌ ఇదేనని పేర్కొన్నారు.



You may be interested

యూఎస్‌ కంపెనీతో అరబిందో రూ.2,100 కోట్ల డీల్‌

Friday 18th January 2019

ఏడు ఆంకాలజీ ఉత్పాదనల కొనుగోలు హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఔషధ కంపెనీ అరబిందో ఫార్మా యూఎస్‌కు చెందిన స్పెక్ట్రమ్‌ ఫార్మాస్యూటికల్స్‌ నుంచి ఏడు బ్రాండెడ్‌ ఆంకాలజీ ఇంజక్టబుల్‌ ఉత్పాదనలను కొనుగోలు చేయనుంది. ఈ మేరకు స్పెక్ట్రమ్‌ ఫార్మాతో అరబిందో అనుబంధ కంపెనీ అక్రోటెక్‌ బయోఫార్మా ఎల్‌ఎల్‌సీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్‌ విలువ రూ.2,100 కోట్లపైమాటే. వ్యూహంలో భాగంగా యూఎస్‌ మార్కెట్లో బ్రాండెడ్‌ ఆంకాలజీ విభాగంలో అరబిందో ప్రవేశం, విస్తరణకు

ఫ్రాఫిట్‌ 10వేల కోట్లు

Friday 18th January 2019

క్యూ3లో రిలయన్స్‌ లాభం రూ.10,251 కోట్లు ఒక క్వార్టర్‌లో ఈ స్థాయి లాభం ఇదే తొలిసారి తొలి భారతీయ ప్రయివేట్‌ కంపెనీ కూడా ఇదే లాభంలో వృద్ధి 8.8 శాతం; ఆదాయం 56 శాతం అప్‌ పెట్రో, రిటైల్‌, టెలికం విభాగాల ఊతం తగ్గిన రిఫైనింగ్ మార్జిన్లు న్యూఢిల్లీ: దేశీ వ్యాపార దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అంచనాలు మించిన లాభాలతో అదరగొట్టింది. రిఫైనరీ మార్జిన్లు తగ్గినా.. పెట్రోకెమికల్, రిటైల్, టెలికం రంగాల

Most from this category