STOCKS

News


హువావే స్మార్ట్‌వాచ్‌ @ రూ.15990

Wednesday 13th March 2019
Markets_main1552460219.png-24579

న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ డివైజెస్‌ తయారీ సంస్థ హువావే.. మూడేళ్ల విరామం తరువాత స్మార్ట్‌వాచ్‌ విభాగంలోకి మళ్లీ ప్రవేశించింది. ఇతర కంపెనీల కంటే తక్కువ ధరలతో క్లాసిక్‌, స్పోర్ట్స్‌ ఎడిషన్‌ వాచీలను మంగళవారం భారత మార్కెట్లో విడుదలచేసింది. ‘జీటీ’ పేరుతో విడుదలైన వాచ్‌ ధరల శ్రేణి రూ.15,990 నుంచి రూ.16,990 వద్ద నిర్ణయించింది. 2016లో విడుదలైన రూ.22,999 స్మార్ట్‌వాచ్‌ ఫీచర్లు వీటిలో ఉన్నట్లు తెలిపింది. గుండె కొట్టుకునే రేటు పర్యవేక్షణ వంటి ఫీచర్లు నూతన వాచ్‌లో ఉన్నట్లు తెలిపింది. ఈ నెల 19 నుంచి అమెజాన్‌లో విక్రయాలు ప్రారంభంకానున్నాయి. ఆ తరువాత నుంచి రిటైల్‌ అవుట్‌లెట్స్‌లో అందుబాటులోకి రానున్నట్లు సంస్థ తెలిపింది.



You may be interested

ఈ నెల 18 నుంచి తొలి రీట్‌

Wednesday 13th March 2019

- ఆఫర్‌ చేస్తున్న ఎంబసీ ఆఫీస్‌ పార్క్స్‌ - ప్రైస్‌బ్యాండ్‌ రూ.299- 300 న్యూఢిల్లీ: భారత్‌లో తొలి రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ (రీట్‌) ఈ నెల 18 నుంచి ఆరంభం కానున్నది. ఈ నెల 20న ముగిసే ఈ రీట్‌ ఆఫర్‌కు రూ.299- 300 ధరల శ్రేణిని కంపెనీ నిర్ణయించింది. గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌​కంపెనీ బ్లాక్‌స్టోన్‌, రియల్టీ కంపెనీ ఎంబసీల జాయింట్‌ వెంచర్‌, ఎంబసీ ఆఫీస్‌ పార్క్స్‌ ఈ రీట్‌ను ఆఫర్‌ చేస్తోంది.

టాప్‌ బ్రోకరేజ్‌ల రికమండేషన్లు

Wednesday 13th March 2019

మిడ్‌టర్మ్‌ కోసం ప్రముఖ బ్రోకరేజ్‌లు కొన్ని రికమండేషన్లు అందిస్తున్నాయి. 1. మారుతీ సుజుకీ: సిటీ గ్రూప్‌ సిఫార్సు. కొనొచ్చు. టార్గెట్‌ రూ. 8300కు పెంచింది. ఎన్నికల తర్వాత వాల్యూంల్లో పెరుగుదల ఉంటుందని, పండుగ సీజన్‌ కల్లా షేరు జోరందుకుంటుందని అంచనా. అయితే ఈపీఎస్‌ అంచనాలను మాత్రం 5-7 శాతం మేర తగ్గించింది. 2. నెస్లెఇండియా: సీఎల్‌ఎస్‌ఏ, మాక్క్వైరీ సిఫార్సు. కొనొచ్చు. టార్గెట్‌ రూ. 11750, రూ. 12994. పదిహేనళ్ల కాలంలో ఎన్నడూ లేనంతగా

Most from this category