STOCKS

News


హెచ్‌టీసీ వైల్డ్‌ఫైర్‌ ఎక్స్‌ ఆవిష్కరణ

Thursday 15th August 2019
news_main1565852961.png-27785

  • ట్రిపుల్‌ కెమెరా ఫోన్‌

హైదరాబాద్‌: హెచ్‌టీసీ నుంచి మరో స్మార్ట్‌ఫోన్‌ దేశీయ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. వైల్డ్‌ఫైర్‌ ఎక్స్‌ స్మార్ట్‌ ఫోన్‌ను హెచ్‌టీసీ బ్రాండ్‌ లైసెన్స్‌ కలిగిన ‘ఇన్‌వన్‌ స్మార్ట్‌ టెక్నాలజీ’ తీసుకొచ్చింది. రెండు వేరియంట్లలో ఇది లభిస్తుంది. 3జీబీ ర్యామ్‌/32 జీబీ రామ్‌ ధర రూ.9,999. 4జీబీ ర్యామ్‌/64జీబీ రామ్‌ ఫోన్‌ ధర రూ.12,999. ఈ రెండూ శాఫైర్‌ బ్లూ కలర్‌ ఆప్షన్లో మాత్రమే లభిస్తాయి. ఫ్లిప్‌కార్ట్‌ పోర్టల్‌లో ఈ నెల 22 నుంచి విక్రయాలు ఆరంభమవుతాయి. వొడాఫోన్‌ ఐడియా కస్టమర్లు ఈ ఫోన్‌ కొనుగోలుపై తమ ప్లాన్‌లో భాగంగా 18 నెలల పాటు ప్రతీ రోజూ 500 ఎంబీ అదనపు డేటా పొందొచ్చు. అలాగే, 255 రీచార్జ్‌పై తగ్గింపు వర్తించే రూ.75 కూపన్లు 50 కూడా లభిస్తాయి. ఆండ్రాయిడ్‌ 9 పై ఓఎస్‌పై పనిచేస్తుంది. 6.22 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ ఐపీఎస్‌ డిస్‌ప్లే, వాటర్‌డ్రాప్‌ నాచ్‌, హీలియో పీ22 ప్రాసెసర్‌తోపాటు వెనుక భాగంలో 12/8/5 మెగాపిక్సల్‌తో కూడిన ట్రిపుల్‌ కెమెరా సెటప్‌, 8ఎక్స్‌ హైబ్రిడ్‌ జూమ్‌ ఆప్షన్‌తో ఉంటుంది. ముందు భాగంలో 8 మెగాపిక్సల్‌ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్‌తో పాటు మైబుడ్డీ యాసెసరీ అనే ఓ ప్రత్యేక ఆకర్షణ కూడా అందుకోవచ్చు. ఫోన్‌ను ఎవరైనా కొట్టేసినా, మర్చిపోయినా పెద్ద అలారమ్‌ మోగడంతోపాటు, లైవ్‌ లొకేషన్‌ ద్వారా ఎక్కడుందో స్నేహితులకు, బంధువులకు చెబుతుంది. 



You may be interested

ఐకియా సభ్యులకు..స్వీడన్‌ ఆఫర్‌

Thursday 15th August 2019

సాక్షి, హైదరాబాద్‌:- ప్రముఖ గృహోపకరణాల సంస్థ ఐకియా  ఈ నెల 18లోగా ఫ్యామిలీ మెంబర్‌షిప్‌ కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకుని స్టోర్‌లో కొనుగోలు చేసిన కస్టమర్లకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది.మెంబర్‌షిప్‌ కార్డు తీసుకుని ఆపై తమ అనుభూతులను ఐకియా ఫ్యామిలీ పేజీలో పంచుకున్న వారి నుండి టాప్‌ 20 కథనాలను ఎంపిక చేసి వెబ్‌సైట్‌లో ఓటింగ్‌ పెడతామని, సెప్టెంబర్‌ 9 నుండి 20వ తేదీ వరకు సాగే ఓటింగ్‌లో విజేతలుగా నిలిచిన

మార్కెట్లోకి ‘టియాగో జేటీపీ, టిగోర్‌ జేటీపీ’

Thursday 15th August 2019

న్యూఢిల్లీ: దేశీ ప్రముఖ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్‌, కోయంబత్తూరుకు చెందిన జయం ఆటోమోటివ్స్‌ భాగస్వామ్యంలో టియాగో జేటీపీ, టిగోర్‌ జేటీపీ నూతన వెర్షన్‌ కార్లు మార్కెట్లోకి విడుదలయ్యాయి. ఇరు సంస్థల జాయింట్‌ వెంచర్‌ జేటీ స్పెషల్‌ వెహికల్స్‌ (జేటీఎస్‌వీ) ఈ కార్లను బుధవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. వీటి ధరల శ్రేణి రూ.6.69 లక్షల నుంచి రూ.7.59 లక్షలుగా ప్రకటించింది. ఈ అధునాత వెర్షన్లలో ఆటో-ఫోల్డ్‌ వెలుపల అద్దాలు,

Most from this category