STOCKS

News


హెచ్‌పీసీఎల్‌ లాభం 86 శాతం అప్‌

Thursday 9th August 2018
news_main1533792133.png-19073

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ హిందుస్తాన్‌ పెట్రోలియమ్‌ కార్పొ(హెచ్‌పీసీఎల్‌) నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో 86 శాతం ఎగసింది. గత క్యూ1లో రూ.925 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.1,719 కోట్లకు పెరిగిందని హెచ్‌పీసీఎల్‌ తెలియజేసింది. అధిక రిఫైనింగ్‌ మార్జిన్ల కారణంగా ఈ క్యూ1లో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని హెచ్‌పీసీఎల్‌ సీఎమ్‌డీ ముకేష్‌ కె. సురానా తెలిపారు.  నికర లాభం ఒక్కో షేర్‌కు రూ.11.28 గా ఉందన్నారు. మొత్తం ఆదాయం రూ.59,891 కోట్ల నుంచి రూ.72,923 కోట్లకు పెరిగింది. ఈ క్యూ1లో 9.63 మిలియన్‌ టన్నుల ఇంధన విక్రయాలు జరిపామని, ఇది కంపెనీ చరిత్రలోనే అత్యధిక త్రైమాసిక అమ్మకాలని సురానా పేర్కొన్నారు. కంపెనీ ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. ఈ కంపెనీ రూ.1,435 కోట్ల నికర లాభం సాధించగలదని విశ్లేషకులు అంచనా వేశారు. 
పెరిగిన ఇన్వెంటరీ లాభాలు..
ఒక్కో బ్యారెల్‌ ముడి చమురును ఇంధనంగా మార్చినందుకు ఈ క్యూ1లో 7.15 డాలర్ల రిఫైనింగ్‌ మార్జిన్‌ సాధించామని సురానా తెలిపారు. గత క్యూ1లో ఈ మార్జిన్‌ 5.86 డాలర్లుగా ఉంది. గత క్యూ1లో ఒక్కో బ్యారెల్‌ ముడి చమురుకు 2.86 డాలర్ల ఇన్వెంటరీ నష్టాలు వచ్చాయని, ఈ క్యూ1లో మాత్రం 3.43 డాలర్ల ఇన్వెంటరీ లాభాలు వచ్చాయని తెలియజేశారు. రూపాయిల పరంగా చూస్తే, గత క్యూ1లో రూ.1,575 కోట్ల ఇన్వెంటరీ నష్టాలు రాగా ఈ క్యూ1లో రూ.1,900 కోట్ల ఇన్వెంటరీ లాభాలు వచ్చాయి. ఈ క్యూ1లో బ్యారెల్‌ ముడిచమురు ధరలు 50 డాలర్ల నుంచి 73 డాలర్లకు ఎగిశాయని, ఫలితంగా స్థూల రిఫైనరీ మార్జిన్లు పెరిగాయని పేర్కొన్నారు. ఈ క్యూ1లో కొత్తగా 65 పెట్రోల్‌ బంక్‌లను ప్రారంభించామని, దీంతో మొత్తం రిటైల్‌ అవుట్‌లెట్‌ల సంఖ్య 15,127కు పెరిగిందని పేర్కొన్నారు. అలాగే కొత్తగా 141 ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్లు జతయ్యారని, దీంతో మొత్తం గ్యాస్‌ డిస్ట్రిబ్యూటర్ల సంఖ్య 4,990కు పెరిగిందని వివరించారు. 
ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.8,400 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నట్లు సురానా తెలిపారు. వివిధ రిఫైనరీలు, పెట్రో కెమికల్స్‌, మార్కెటింగ్‌, పైప్‌లైన్‌లు, నేచురల్‌ గ్యాస్‌ తదితర విభాగాల్లో ఈ పెట్టుబడులను వినియోగించనున్నామని చెప్పారు. మార్కెట్‌ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో హెచ్‌పీసీఎల్‌ షేర్‌  2.1 శాతం నష్టంతో రూ.282 వద్ద ముగిసింది.You may be interested

‘పార్శ్వనాథ్‌’ ఖాతాల ఫోరెన్సిక్ ఆడిట్!

Thursday 9th August 2018

 న్యూఢిల్లీ: భారీగా 'డొల్ల కంపెనీలు'న్నట్టుగా అనుమానిస్తున్న సంస్థల జాబితాలో ఉన్న పార్శ్వనాథ్‌ డెవలపర్స్‌ ఖాతాలను ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలంటూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆదేశించింది. కొన్ని వ్యాపార లావాదేవీల్లో కంపెనీ తీరు సందేహాస్పదంగా ఉన్నట్లు తేలడంతో ఈ మేరకు సెబీ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 2009-10 నుంచి 2011-12 మధ్య కాలానికి సంబంధించిన కాంట్రాక్టులు/ సబ్ కాంట్రాక్టులకు మాత్రమే ఈ విచారణ పరిమితమని పేర్కొంది. వ్యాపార, ఆర్థిక

అతి తెలివి వద్దు... మీకూ ఇళ్లు లేకుండా చేస్తాం!

Thursday 9th August 2018

న్యూఢిల్లీ: గృహ కొనుగోలుదారుల ప్రయోజనాలకు భంగం కలిగిస్తూ, ప్రాజెక్టులను ఆలస్యం చేస్తున్న రియల్టీ సంస్థ ఆమ్రపాలి గ్రూప్‌ డైరెక్టర్లకు అత్యున్నత న్యాయస్థానం తీవ్ర హెచ్చరికలు చేసింది. అతితెలివి ప్రదర్శించవద్దని, గృహ కొనుగోలుదారుల ప్రయోజనాలను పట్టించుకోకుండా ఆటలాడవద్దని స్పష్టంచేసింది. అలా చేస్తే డైరెక్టర్లకూ ఇళ్లు లేకుండా చేస్తామని హెచ్చరించింది. గ్రూప్‌ పెండింగ్‌ రియల్టీ ప్రాజెక్టులకు సంబంధించి గృహ కొనుగోలుదారుల ప్రయోజనాల పరిరక్షణకు మేనేజింగ్‌ డైరెక్టర్లు, డైరెక్లర్ల ప్రతి ఒక్క ఆస్తినీ అమ్ముతామని,

Most from this category