STOCKS

News


మీ ఎస్‌బీఐ యావరేజ్‌ బ్యాలన్స్‌ చెక్‌ చేసుకోవచ్చు ఇలా...

Monday 17th September 2018
news_main1537123863.png-20299

బ్యాంకు సేవింగ్స్‌ ఖాతాదారులు అందరూ తమ ఖాతాల్లో నెలవారీ సగటు బ్యాలన్స్‌ (ఎంఏబీ) నిర్వహించడం తప్పనిసరి. ఎస్‌బీఐ ఖాతాదారుల విషయంలో ఈ ఎంఏబీ అన్నది వారి బ్యాంకు శాఖ నగరంలోనా లేదా పట్టణం లేదా గ్రామీణ ప్రాంతంలో ఉందా అన్నదాన్ని బట్టి మారిపోతుంది. నెలవారీ సగటు బ్యాలన్స్‌ నిర్వహణలో విఫలం అయితే, ఖాతాదారుల నుంచి బ్యాంకులు చార్జీలు రాబట్టుకుంటాయి. ఓ నివేదిక ప్రకారం 21 ప్రభుత్వరంగ బ్యాంకులు, 3 ప్రైవేటు రంగ బ్యాంకులు గత ఆర్థిక సంవత్సరం 2017-18లో ఎంఏబీ నిర్వహించనందుకు ఖాతాదారుల నుంచి రూ.5,000 కోట్లను చార్జీల రూపంలో రాబట్టుకున్నాయి. ఇందులో అధిక భాగం ఎస్‌బీఐదే కావడం గమనార్హం. రూ.5,000 కోట్లలో సగం మేర ఎస్‌బీఐకే వెళ్లింది. అందుకే ఖాతాదారులు కనీస బ్యాలన్స్‌ను ఎప్పుడూ ఉంచడం మంచిది. ఒకవేళ ఏదైనా నెలలో ఎంఏబీ అస్థిరతలకు గురైతే, తెలుసుకుని చార్జీల భారం పడకుండా చూసుకునేందుకు ఎస్‌బీఐ ఖాతాదారులకు అవకాశం ఉంది. అంటే, మీ సేవింగ్స్‌ ఖాతాకు సంబంధించి ఎంఏబీ ఎంతన్నది నెట్‌ బ్యాంకింగ్‌లో తెలుసుకునే ఆప్షన్‌ ఉంది.

 

  • ముందుగా ఆన్‌లైన్‌ఎస్‌బీఐ డాట్‌ కామ్‌లో లాగిన్‌ అవ్వాలి
  • లాగిన్‌ అయిన వెంటనే ‘క్లిక్‌ హియర్‌ ఫర్‌ లాస్ట్‌ 10 ట్రాన్సాక్షన్స్‌’ (చివరి 10 లావాదేవీల కోసం ఇక్కడ క్లిక్‌ చేయడం) అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దాన్ని క్లిక్‌ చేయాలి. ఒకటికి మించి ఖాతాలు కలిగిన వారు లాగిన్‌ అయిన తర్వాత కనిపిస్తున్న అకౌంట్లలో తెలుసుకోవాలనుకుంటున్న ఖాతాను సెలక్ట్‌ చేసుకోవాలి
  • దాంతో మరో పేజీకి వెళతారు. అక్కడ అకౌంట్‌ నంబర్‌, డిస్క్రిప్షన్‌, అవైలబుల్‌ బ్యాలన్స్‌, అన్‌క్లియర్డ్‌ బ్యాలన్స్‌, ఎంఓడీ బ్యాలన్స్‌, మంత్లీ యావరేజ్‌ బ్యాలన్స్‌ ఆప్షన్లు వరుసగా కనిపిస్తాయి.
  • మంత్లీ యావరేజ్‌ బ్యాలన్స్‌ ఆప్షన్‌ పక్కన... క్లిక్‌ హియర్‌ ఫర్‌ ఎంఏబీ అని ఉంటుంది. దాన్ని క్లిక్‌ చేయాలి. 
  • దీంతో గత నెల ఎంఏబీ ఎంత?, ప్రస్తుత నెలలో ఎంతుందీ అనేది కనిపిస్తుంది.
  • ప్రస్తుతానికి ఈ సదుపాయం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంల మధ్యే అందుబాటులో ఉంది.



You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ డౌన్‌

Monday 17th September 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో సోమవారం నష్టాలతో ట్రేడవుతోంది. ఉదయం 8:50 సమయంలో సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 54 పాయింట్ల నష్టంతో 11,493 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 11,547 పాయింట్లతో పోలిస్తే 54 పాయింట్లు లాభంతో ఉందని గమనించాలి. దీంతో నిప్టీ సోమవారం నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఒక్క జపాన్‌ మినహా మిగతా ఆసియా ప్రధాన

మధ్య కాలానికి మూడు స్టాక్‌ రికమండేషన్స్‌

Monday 17th September 2018

గత వారంలో మొదటి రెండు సెషన్లలో మార్కెట్లు 1,000 పాయింట్ల వరకు పడిపోయి ఆ తర్వాత వేగంగా రికవరీ అయ్యాయి. అయితే, మొత్తం మీద వారంలో మార్కెట్లు స్వల్పంగా నష్టపోయాయి. గత వారం మార్కెట్ల కనిష్ట స్థాయి మద్దతుగాను, గరిష్ట స్థాయి నిరోధంగాను పనిచేస్తాయని, వచ్చే పక్షం రోజుల పాటు ఈ శ్రేణిలో ట్రేడ్‌ కావచ్చని  ‘ఈక్విటీ99’ వ్యవస్థాపకుడు సుమిత్‌ బిల్గియాన్‌ తెలిపారు. మన మార్కెట్లు అధిక విలువకు చేరడం,

Most from this category