STOCKS

News


ఎఫ్‌బీ, వాట్సాప్‌ బ్లాక్‌పై అభిప్రాయాలు చెప్పండి

Tuesday 7th August 2018
news_main1533619545.png-19001

న్యూఢిల్లీ: ప్రత్యేక సందర్భాలైన జాతీయ భద్రత, ప్రజా జీవనం ప్రమాదంలో పడినప్పుడు ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, టెలిగ్రామ్‌ తరహా యాప్స్‌ను బ్లాక్‌ చేసేందుకు అనుసరించాల్సిన సాంకేతిక చర్యల విషయమై పరిశ్రమ అభిప్రాయాల్ని టెలికం శాఖ కోరింది. టెలికం ఆపరేటర్లు, ఇంటర్నెట్‌ సర్వీసు ప్రొడైవర్ల అసోసియేషన్‌ (ఐఎస్‌పీఏఐ), సీవోఏఐలకు టెలికం శాఖ జూలై 18నే లేఖలు రాసింది. ఐటీ చట్టంలోని సెక్షన్‌ 69ఏ కింద మొబైల్‌ అప్లికేషన్లను బ్లాక్‌ చేయడంపై తమ అభిప్రాయాలు తెలియజేయాలని కోరింది. కంప్యూటర్‌ ద్వారా ఏ సమాచారాన్ని కూడా పొందకుండా నిరోధించేందుకు ఉపయోగించతగిన అధికారాలను ఐటీ చట్టంలోని సెక్షన్‌ 69ఏ తెలియజేస్తోంది. వాట్సాప్‌లో వచ్చిన వదంతుల ఆధారంగా ఇటీవలి కాలంలో అల్లరి మూకలు కొందరిపై దాడులకు దిగడం, కొట్టి చంపండం వంటి ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ తాజా చర్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఐటీ శాఖ అధికారి ఒకరు దీనిపై మాట్లాడుతూ... ‘‘సదరు సందేశాలు ఎలా వచ్చాయన్నది తనవంతుగా గుర్తించేందుకు వాట్సాప్‌ కట్టుబడి లేదు. ప్రభుత్వ డిమాండ్లలో ఇది కూడా ఒకటి. దుర్వినియోగానికి అవకాశాలు ఇప్పటికీ ఉన్నాయి’’ అని పేర్కొన్నారు. నకిలీ వార్తలకు చెక్‌ పెట్టేందుకు వాట్సాప్‌ తీసుకున్న చర్యల విషయమై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేసింది. తన ప్లాట్‌ ఫామ్‌ను దుర్వినియోగం చేస్తున్న వారిని, సందేశాలతో రెచ్చగొడుతున్న వారిని గుర్తించే విషయమై బాధ్యతను విస్తరించజాలదని ఐటీ శాఖ స్పష్టం చేసింది. అలాగే, తగిన చర్యలు తీసుకోకపోతే వదంతుల వ్యాప్తి, ప్రోత్సాహక ప్లాట్‌ఫామ్‌గా ఫేస్‌బుక్‌ను గుర్తించాలంటూ ఆ శాఖకు పంపిన రెండో నోటీసులో హెచ్చరించింది.You may be interested

దేనా బ్యాంక్‌ నష్టాలు రూ.722 కోట్లు

Tuesday 7th August 2018

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దేనా బ్యాంక్‌ నష్టాలు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో మరింతగా పెరిగాయి.గత క్యూ1లో రూ.133 కోట్లుగా ఉన్న నికర నష్టాలు ఈ క్యూ1లో రూ.722 కోట్లకు పెరిగాయని దేనా బ్యాంక్‌ తెలిపింది. మొండి బకాయిలు చెప్పుకోదగ్గ స్థాయిలో పెరగడంతో ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయని వివరించింది. గత క్యూ1లో రూ.2,620 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో 8 శాతం తగ్గి

విదేశాల్లో భారత ‘వంటిల్లు’!

Tuesday 7th August 2018

 భారత రెస్టారెంట్లకు విదేశాల్లో ఎర్ర తివాచీ...  త్వరలోనే లండన్‌, న్యూయార్క్‌లలో సంజీవ్‌ కపూర్‌ హోటళ్లు  అమెరికాలో లైట్ బైట్ పంజాబీ రుచులు న్యూఢిల్లీ: పంజాబీ చికెన్‌ టిక్కా... రాజస్థానీ థాలీ... మహారాష్ట్ర వడాపావ్‌... తమిళనాడు సాంబార్‌ ఇడ్లీ... హైదరాబాద్‌ బిర్యానీ... చెబుతుంటేనే నోరూరుతోంది కదా..!! ఇప్పుడు ఈ భారతీయుల వంటకాల ఘుమఝుమలు విదేశీయులనూ ఆవురావురుమనేలా చేస్తున్నాయి. అదిరిపోయే భరతీయ వంటలతో మనోళ్లు ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతున్నారు. మన నలభీములకు విదేశీయులు ఎర్ర తివాచీ పరుస్తుండడంతో

Most from this category