STOCKS

News


హోమ్‌ డెకరేషన్‌లోకి హౌజ్‌జాయ్‌!

Saturday 23rd February 2019
Markets_main1550902283.png-24291

– సర్వీసెస్‌ నుంచి నిర్మాణం, నిర్వహణ రంగంలోకి
– ప్రస్తుతం బెంగళూరులో సేవలు.. త్వరలోనే హైదరాబాద్‌లో..
– 20 లక్షల మంది కస్టమర్లు; నగరం వాటా 20 శాతం
– ఇప్పటికే రూ.215 కోట్ల నిధుల సమీకరణ పూర్తి
– ‘స్టార్టప్‌ డైరీ’తో సీఈఓ శరన్‌ చటర్జీ

ప్లంబింగ్, ఎలక్ట్రిషన్, లాండ్రీ వంటి హోమ్‌ సర్వీసెస్‌ రంగంలో ఉన్న హౌజ్‌ జాయ్‌.. గృహ నిర్మాణ, నిర్వహణ, అలంకరణ రంగంలోకి దిగనుంది. ప్రస్తుతం బెంగళూరులో అందుబాటులో ఉన్న ఈ సేవలను త్వరలోనే హైదరాబాద్‌లో ప్రారంభించనున్నట్లు కంపెనీ సీఈఓ శరన్‌ చటర్జీ ‘స్టార్టప్‌ డైరీ’తో చెప్పారు. కన్‌స్ట్రక్షన్, డెకరేషన్‌ విభాగాల్లో హైదరాబాద్‌ అతిపెద్ద మార్కెట్‌ అని.. 20 శాతం వరకూ మార్జిన్లుంటాయని అందుకే ఎంట్రీ ఇచ్చామని తెలిపారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే..


గృహ సేవల రంగంలో ప్రధాన సవాళ్లు.. కార్మికుల లభ్యత, విశ్వసనీయత, పనిలో నాణ్యత! కారణం.. ఈ సేవలన్నీ అసంఘటిత రంగంలో ఉండటమే. టెక్నాలజీ సహాయంతో కార్మికులను, నాణ్యమైన సేవలను ఒకే వేదిక మీదికి తీసుకొస్తే అనే సందేహం నుంచే ‘హౌజ్‌జాయ్‌’ పుట్టింది. అర్జున్‌ కుమార్, సునీల్‌ గోయెల్‌లు 2015 జనవరిలో బెంగళూరు కేంద్రంగా ఆన్‌లైన్‌ హోమ్‌ సర్వీసెస్‌ స్టార్టప్‌ హౌజ్‌జాయ్‌ను ప్రారంభించారు.


గృహ సేవలన్నీ ఒక్క చోటే..
ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, సూరత్, ఢిల్లీ, కోయంబత్తూరు, పుణె, ముంబై, గుర్గావ్‌ నగరాల్లో సేవలందిస్తున్నాం. క్లీనింగ్, హోమ్‌ రిపేర్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్‌ సర్వీసెస్, లాండ్రీ, కంప్యూటర్‌ రిపేర్, ప్యాకర్స్‌ అండ్‌ మూవర్స్, బ్యూటీ, పెస్ట్‌ కంట్రోల్, పెయింటింగ్, గృహోపకరణాల రిపేర్లు వంటి 14 విభాగాల్లో సేవలను అందిస్తున్నాం. ఆయా విభాగాల్లో 65 వేల మంది కార్మికులు నమోదయ్యారు. ఆయా విభాగంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వాళ్లను నిపుణులు, వాళ్ల వ్యక్తిగత వివరాలు, పూర్వాపరాలు, క్రిమినల్‌ రికార్డులు అన్నీ క్షుణ్నంగా పరిశీలించాకే రిజిస్టర్‌ చేసుకుంటాం. హౌజ్‌జాయ్‌ అగ్రిగేట్‌ మోడలే. కానీ, 100 శాతం నిర్వహణ బాధ్యత కంపెనీదే.


నగరం వాటా 20 శాతం..
ఇప్పటివరకు 20 లక్షల మంది కస్టమర్లు మా సేవలను వినియోగించుకున్నారు. హైదరాబాద్‌ వాటా 20 శాతం వరకుంటుంది. ప్రస్తుతం రోజుకు లక్షకు పైగా ఆర్డర్లు వస్తున్నాయి. పనికి సంబంధించి 30 రోజుల పాటు గ్యారంటీ, అన్ని ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల మీద రూ.10 వేల బీమా కూడా ఉంటుంది. ప్రస్తుతం మా కంపెనీలో 350కి పైగా ఉద్యోగులున్నారు. ఇప్పటివరకు ల్యాండ్రీ స్టార్టప్‌ మైవాష్, ఫిట్‌నెస్‌ స్టార్టప్‌ ఓరోబిండ్‌లను కొనుగోలు చేశాం.


నిర్మాణం, అలంకరణలోకి..
గృహ సేవల విభాగం నుంచి తాజాగా గృహ మరమ్మతులు, అలంకరణ, నిర్మాణం, నిర్వహణ విభాగంలోకి ఎంట్రీ ఇచ్చాం. ప్రస్తుతం బెంగళూరులో సేవలందిస్తున్నాం. గృహ రెనోవేషన్‌ ప్రారంభం ధరలు రూ.1–1.5 లక్షలు, ఇంటీరియర్‌ డిజైన్‌ రూ.3.5 లక్షలు, ఇంటి నిర్మాణం చ.అ.కు రూ.1,600లుగా ఉంటాయి. ధరలు నగరం, ప్రాజెక్ట్‌ విస్తీర్ణాలను బట్టి మారుతుంటాయి. ఇప్పటికే 25–30 భారీ ప్రాజెక్ట్‌ ఆర్డర్లు వచ్చాయి. ఆయా విభాగాల్లో సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ హోదాలో ఉద్యోగులను తీసుకోనున్నాం.


300 శాతం ఆదాయ వృద్ధి..
ఇప్పటివరకు రెండు రౌండ్లలో కలిపి రూ.215 కోట్ల నిధులను సమీకరించాం. అమెజాన్, మ్యాట్రిక్స్‌ పార్టనర్స్‌ ఇండియా, సామా ఫ్యామిలీ ట్రస్ట్, వెర్టెక్స్‌ వెంచర్స్, క్వాల్కమ్‌ ఏషియా పసిఫిక్, రు–నెట్‌ సౌత్‌ ఏషియా ఈ పెట్టుబడులు పెట్టాయి. 2017 ఆర్థిక సంవత్సరంలో రూ.31.79 కోట్లుగా ఉన్న ఆదాయం.. 2018 నాటికి 19 శాతం వృద్ధితో రూ.37.85 కోట్లకు చేరింది. వచ్చే ఆర్ధిక సంవత్సరంలో 300 శాతం వృద్ధిని లక్ష్యించామని’’ శరన్‌ వివరించారు.
హౌజ్‌జాయ్‌ టీం..
అర్జున్, సునీల్, శరన్‌You may be interested

రూ.2,952 కోట్ల డివిడెండ్‌ చెల్లించిన ఎన్‌టీపీసీ

Saturday 23rd February 2019

వరుసగా 26వ ఏడాదీ డివిడెండ్‌ చెల్లింపు  న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విద్యుదుత్పత్తి సంస్థ, ఎన్‌టీపీసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.2,952 కోట్ల మధ్యంతర డివిడెండ్‌ను చెల్లించింది. కంపెనీ చెల్లించిన మూలధనంలో ఇది 35.8 శాతానికి సమానమని ఎన్‌టీపీసీ తెలిపింది. కంపెనీలో ప్రభుత్వానికి 58.93 శాతం వాటా ఉండటంతో రూ.1,740 కోట్ల డివిడెండ్‌ను అందించామని ఎన్‌టీపీసీ సీఎమ్‌డీ గుర్దీప్‌ సింగ్‌ పేర్కొన్నారు. ఇలా డివిడెండ్‌ను చెల్లించడం ఇది వరుసగా 26వ సంవత్సరమని వివరించారు.

వ్యవస్థల కంటే దేశమే ముఖ్యం

Saturday 23rd February 2019

న్యూఢిల్లీ: లిక్విడిటీ పెంచడం, వడ్డీ రేట్లు సహా ప్రభుత్వం నుంచి ఆర్‌బీఐకి పలు డిమాండ్లు చేయడాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ సమర్థించుకున్నారు. వ్యవస్థల కంటే దేశమే ఎంతో ముఖ్యమన్న విషయాన్ని గుర్తు చేశారు. ఢిల్లీలో శుక్రవారం జరిగిన అంతర్జాతీయ వ్యాపార సదస్సులో పాల్గొన్న సందర్భంగా జైట్లీ మాట్లాడారు. రానున్న సాధారణ ఎన్నికల్లో ప్రభుత్వం పూర్తి మెజారిటీతో ఎన్నిక కావాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. అప్పుడే ఆర్థిక రంగానికి స్థిరత్వం ఏర్పడుతుందని,

Most from this category