STOCKS

News


మార్కెట్లోకి హోండా సీబీ300 ఆర్‌

Saturday 9th February 2019
news_main1549695534.png-24101

  • మధ్య స్థాయి ప్రీమియం బైక్‌ విడుదల
  • ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.2.41 లక్షలు

న్యూఢిల్లీ: జపాన్‌కు చెందిన ఆటోమొబైల్‌ కంపెనీ హోండా మధ్యస్థాయి ప్రీమియం విభాగంలో సీబీ300ఆర్‌ ద్విచక్ర వాహనాన్ని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.2.41 లక్షలు. ఈ బైక్‌ 286సీసీ సామర్థ్యంతో ఉంటుంది. హోండా ప్రీమియం విభాగంలో సీబీ1000ఆర్‌ను ఇప్పటికే విక్రయిస్తుండగా, తాజాగా విడుదల చేసినది మధ్యస్థాయి ప్రీమియం విభాగం (300-600సీసీ) కిందకు వస్తుంది. ఇదే విభాగంలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బలంగా ఉంది. ఏటా 2 లక్షల వాహనాలు విక్రయిస్తోంది. సిల్వర్‌వింగ్‌ మార్క్‌ చానల్‌ కింద మధ్య స్థాయి ప్రీమియం విభాగంలో తన స్థానాన్ని పటిష్టం చేసుకోవాలని భావిస్తున్నట్టు హోండా మోటార్‌సైకిల్‌ స్కూటర్స్‌ ఇండియా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ యద్‌వీందర్‌ సింగ్‌ గులేరియా తెలిపారు. సీబీ300ఆర్‌ వాహనాల డెలివరీ మార్చి నుంచి ఉంటుందన్నారు. ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రవేశపెట్టే ప్రణాళికలపై ఎదురైన ప్రశ్నకు స్పందిస్తూ.. అంతర్జాతీయంగా 20 ఏళ్ల నుంచి ఎలక్ట్రిక్‌ వాహనాలను అభివృద్ధి చేస్తు‍న్నామని, వీటి ధరలు ఎక్కువగా ఉండడం ముఖ్యమైన విషయంగా పేర్కొన్నారు. కస్టమర్ల అవసరాలకు తగ్గట్టు ఓ ఉత్పత్తిని తీసుకొస్తామన్నారు.



You may be interested

ఇళ్లపై తగ్గనున్న జీఎస్టీ భారం

Saturday 9th February 2019

రేట్ల తగ్గింపునకు మంత్రుల బృందం సానుకూలత వచ్చే వారం కౌన్సిల్‌ భేటీలో దీనిపై నిర్ణయం న్యూఢిల్లీ: నివాసిత గృహాలపై జీఎస్టీ రేటును 12 శాతం నుంచి 5 శాతానికి, అందుబాటు ధరల ఇళ్ల ప్రాజెక్టులపై జీఎస్టీని 8 శాతం నుంచి 3 శాతానికి తగ్గించేందుకు మంత్రుల బృందం తొలి భేటీలోనే సానుకూలత వ్యక్తం చేసింది. గుజరాత్‌ ఉప ముఖ్యమంత్రి నితిన్‌ పటేల్‌ అధ్యక్షతన మంత్రుల బృందాన్ని జీఎస్టీ కౌన్సిల్‌ గత నెలలో ఏర్పాటు

మహీంద్రా లాభం 11శాతం డౌన్‌

Saturday 9th February 2019

అధిక వ్యయాలతో తగ్గిన నికర లాభం 15 శాతం వృద్ధితో రూ.13,411 కోట్లకు మొత్తం ఆదాయం వచ్చే క్వార్టర్లో కూడా నిరాశ ఫలితాలే కంపెనీ ఎమ్‌డీ పవన్‌ గోయెంకా వెల్లడి న్యూఢిల్లీ: దేశీయ వాహన దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీంద్రా కంపెనీ నికర లాభం(స్డాండోలోన్‌) ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ త్రైమాసికంలో 11 శాతం తగ్గింది. గత క్యూ3లో రూ.1,216 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.1,077 కోట్లకు తగ్గిందని మహీంద్రా అండ్‌

Most from this category