STOCKS

News


కార్ల ధరలను పెంచనున్న హోండా

Friday 18th January 2019
Markets_main1547790082.png-23656

- రూ.10,000 వరకు పెంపు
- వచ్చే నెల నుంచి అమలు

 న్యూఢిల్లీ: హోండా కార్స్‌ ఇండియా లిమిటెడ్‌ (హెచ్‌సీఐఎల్‌)... తాను ఉత్పత్తి చేస్తున్న అన్ని మోడళ్ల ధరలను పెంచాలని నిర్ణయించింది. మోడల్‌ ఆధారంగా ఈ పెంపు రూ.7,000 నుంచి రూ.10,000 వరకు ఉంటుంది. పెరిగిన ఉత్పత్తి వ్యయాన్ని కస్టమర్లకు బదిలీ చేయడంలో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు గురువారం ప్రకటించింది. ఈ అంశంపై వివరణ ఇచ్చిన కంపెనీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, డైరెక్టర్‌ (సేల్స్‌, మార్కెటింగ్‌) రాజేష్ గోయల్.. ‘ముడి పదార్థాల ధరల పెరుగుదల, విదేశీ మారక ద్రవ్యం ఒత్తిడి సంస్థపై కొనసాగుతున్నాయి. అయినప్పటికీ, ధరలను పెంచకుండా ఉండేందుకు చాలా ప్రయత్నించాం. తప్పనిసరి కావడంతో ఫిబ్రవరి ఒకటి నుంచి ధరలను పెంచనున్నాం.’ అని వెల్లడించారు. ప్రీమియం ఎస్‌యూవీ సీఆర్‌-వీ ధర రూ.10,000 పెంచనుండగా.. ఇతర మోడళ్లపై రూ.7,000 పెరగనున్నట్లు కంపెనీ వెల్లడించింది. టయోటా కిర్లోస్కర్ మోటార్, ఇసుజు మోటార్స్ ఇండియా సైతం పెంపు నిర్ణయాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే.



You may be interested

ఫెడరల్‌ బ్యాంక్‌ లాభం రూ.333

Friday 18th January 2019

28 శాతం వృద్ధి ఇతర ఆదాయం దన్ను ముంబై: ప్రైవేట్‌ రంగ ఫెడరల్‌ బ్యాంక్‌ ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ క్వార్టర్లో రూ.334 కోట్ల నికర లాభాన్ని సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం రూ.260 కోట్లతో పోలిస్తే 28 శాతం వృద్ధి సాధించామని బ్యాంక్‌ తెలిపింది. ఇతర ఆదాయం బాగా పెరగడంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని ఫెడరల్‌ బ్యాంక్‌ ఎమ్‌డీ, సీఈఓ శ్యామ్‌

భవిష్యత్తు ఏఐ ప్రకటనలదే

Friday 18th January 2019

వీక్షకుల మూడ్‌ను బట్టి యాడ్స్‌ రూ.61 వేల కోట్లను దాటిన అడ్వర్టయిజింగ్‌ పరిశ్రమ ఐఏఏ చైర్మన్, వరల్డ్‌ ప్రెసిడెంట్‌ శ్రీనివాసన్‌ స్వామి   హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వార్తా పత్రికలు, రేడియో, టెలివిజన్, ఇంటర్నెట్, మొబైల్స్‌.. ఇదీ సింపుల్‌గా అడ్వర్టయిజింగ్‌ మాధ్యమాల వరుస క్రమం! కానీ ఇపుడు ఈ జాబితాలో ఆర్టిఫిషల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) చేరుతోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ బ్రాండ్లు ఏఐ ఆధారిత ప్రకటనలపై పరిశోధన చేస్తున్నాయని, కొన్ని సంస్థలు త్వరలోనే దేశంలో

Most from this category