STOCKS

News


మేలో నియామకాల వృద్ధి 11 శాతం

Tuesday 18th June 2019
news_main1560840038.png-26379

  •  ఐటీలో పెరిగిన ఉద్యోగాలు

న్యూఢిల్లీ: దేశీయంగా గతనెల్లో ఉద్యోగుల నియామకాలు 11 శాతం వృద్ధి చెందినట్టు నౌకరీ డాట్‌ కామ్‌ వెల్లడించింది. ఈ సంస్థ నిర్వహించే నౌకరీ జాబ్‌స్పీక్‌ ఇండెక్స్‌.. మే నెల్లో 2,346 వద్దకు చేరుకుంది. గతేడాది ఇదేకాలంలో 2,106 ఉండగా.. ఏడాది ప్రాతిపదికన పదకొండు శాతం వృద్ధిని నమోదుచేసింది. ఐటి-సాఫ్ట్‌వేర్ రంగంలో పెరిగిన ఉద్యోగాలు ఈ సూచీని ఇంతటి స్థాయికి చేర్చినట్లు వెల్లడించింది. ఈ రంగంతో పాటు బీపీఓ, ఐటి-హార్డ్‌వేర్, విద్య రంగాలు 11 శాతం వృద్ధిని సాధించగా.. ఎఫ్‌ఎంసీజీ 4 శాతం, కనస్ట్రక్షన్‌ అండ్‌ ఇంజనీరింగ్ ఒక శాతం వృద్ధి నమోదుచేశాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్‌ఎస్‌ఐ) నియామకాల వృద్ధి రేటు నిలిచిపోగా.. ఆటోమొబైల్‌తో పాటు ఈ రంగానికి అనుబంధంగా ఉన్న రంగాలు ఉద్యోగుల నియామకాల్లో 16 శాతం క్షీణతను, ఫార్మా 6 శాతం తగ్గుదలను నమోదుచేశాయి. ఇక ఎంట్రీ లెవెల్‌ ఉద్యోగాలు (3 ఏళ్లలోపు అనుభవం కలిగిన వ్యక్తులు) 13 శాతం పెరగ్గా.. మధ్యస్థాయి (4 నుంచి 7 ఏళ్ల అనుభవం) ఉద్యోగాలు 14 శాతం పెరిగాయి. 8 నుంచి 12 ఏళ్ల అనుభవం ఉన్న మిడ్‌ మేనేజ్‌మెంట్‌ ఉద్యోగాలు 8 శాతం పెరిగినట్లు నివేదిక పేర్కొంది. 13 నుంచి 16 ఏళ్ల అనుభవం కలిగిన సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ రోల్స్‌, 16 ఏళ్లు అనుభవం ఉన్న ఉద్యోగుల నియామకాలు ఫ్లాట్‌గా ఉన్నాయి. ప్రాంతాలవారీగా బెంగళూరు, హైదరాబాద్, పూణేలు వరుసగా 20, 19, 10 శాతం వృద్ధిని నమోదుచేశాయి.
ఐటీదే హవా: షైన్‌డాట్‌కామ్‌
మేనెల్లో ఐటి, సాఫ్ట్‌వేర్ రంగాలు ఉద్యోగ నియామకాల్లో ప్రథమ స్థానంలో ఉన్నట్లు షైన్‌డాట్‌కామ్‌ తన తాజా నివేదికలో పేర్కొంది. గతేడాది ఇదేకాలంలో టాప్‌ వన్‌లో ఉన్న వినియోగదారుల సేవారంగం ఈసారి 5వ స్థానానికి పడిపోయినట్లు తెలిపింది. 
ఉత్పత్తి, ఇన్‌ఫ్రా రంగంలో 58,200 ఉద్యోగాలు...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-సెప్టెంబర్‌ కాలంలో తయారీ, ఇంజినీరింగ్, మౌలిక సదుపాయాల రంగాలు 58,200 ఉద్యోగాలను కల్పిస్తాయని  టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ తన నివేదికలో పేర్కొంది. నికరంగా ఈ రంగాలు ఉద్యోగుల నియామకాల్లో 2 శాతం వృద్ధిని నమోదుచేయనున్నట్లు విశ్లేషించింది. 2018-19 ద్వితీర్థంలో 6.42 కోట్ల మందికి ఈ రంగాల్లో ఉద్యోగ కల్పన జరిగినట్లు తెలిపింది. 



You may be interested

అజయ్‌ పిరమళ్‌ చేయి వేస్తే...,

Tuesday 18th June 2019

2013లో  10 శాతం వాటా కొనుగోలు  రూ.1,652 కోట్లకు కొన్న అజయ్‌ పిరమళ్‌  ఇప్పుడు దీనిని రూ.2,305 కోట్లకు విక్రయం  ఆరేళ్లలో రూ.  653 కోట్ల లాభం... 40 శాతం రాబడులు  ముంబై: అజయ్‌ పిరమల్‌కు... పెట్టుబడులపై భారీ లాభాలు ఆర్జిస్తారనే పేరు ఉంది. దీనిని ఆయన మరోసారి నిజం చేశారు. ఆరేళ్ల క్రితం (2013లో) ఆయన శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌ కంపెనీలో 9.96 శాతం వాటాను రూ.1,652 కోట్లకు కొనుగోలు చేశారు. ఇప్పుడు ఈ

ఇండిగో విమానాలకు సీఎఫ్‌ఎం ఇంజిన్లు

Tuesday 18th June 2019

20 బిలియన్ డాలర్ల విలువ చేసే ఆర్డరు న్యూఢిల్లీ: చౌక చార్జీల విమానయాన సంస్థ ఇండిగో కొత్తగా కొనుగోలు చేస్తున్న 280 విమానాలకు సంబంధించి లీప్‌-1ఏ ఇంజిన్లను వినియోగించాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా ఆ ఇంజిన్లను తయారు చేసే సీఎఫ్‌ఎం ఇంటర్నేషనల్ సంస్థకు 20 బిలియన్ డాలర్ల ఆర్డరిచ్చింది. ప్రస్తుతం ఇండిగో నిర్వహిస్తున్న ఏ320నియో రకం విమానాలు చాలా మటుకు  ప్రాట్‌ అండ్ విట్నీ ఇంజిన్లతో నడుస్తున్నాయి. అయితే కొన్నాళ్లుగా

Most from this category