STOCKS

News


హిందుస్తాన్‌ జింక్‌ వెయ్యి శాతం స్పెషల్‌ డివిడెండ్‌

Tuesday 23rd October 2018
news_main1540270276.png-21382

న్యూఢిల్లీ: వేదాంత గ్రూప్‌నకు చెందిన హిందుస్తాన్‌ జింక్‌ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 30 శాతం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.2,584 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.1,815 కోట్లకు తగ్గిందని హిందుస్తాన్‌  జింక్‌ తెలిపింది. ఆదాయం తక్కువగా ఉండటం, ఇతర వ్యయాలు పెరగడంతో నికర లాభం ఈ స్థాయిలో తగ్గిందని కంపెనీ చైర్మన్‌ అగ్నివేశ్‌ అగర్వాల్‌ చెప్పారు. తరుగుదల అధికంగా ఉండటం, ఎబిటా తగ్గడం వల్ల కూడా నికర లాభం తగ్గిందని, అయితే పన్ను రేటు తగ్గడం కొంత ఊరటనిచ్చిందని వివరించారు. మొత్తం ఆదాయం రూ.5,779 కోట్ల నుంచి రూ.5,171 కోట్లకు తగ్గింది. మొత్తం వ్యయాలు రూ.2,694 కోట్ల నుంచి రూ.2,897 కోట్లకు పెరిగాయి. ఎబిటా 23 శాతం తగ్గి రూ.2,334 కోట్లకు చేరిందని, ఎబిటా మార్జిన్‌ 48.9 శాతానికి తగ్గిందని అగర్వాల్‌ వివరించారు.
వెయ్యి శాతం స్పెషల్‌ డివిడెండ్‌....
ఒక్కో ఈక్విటీ షేర్‌కు వెయ్యి శాతం ప్రత్యేక మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వడానికి డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపిందని అగర్వాల్‌ వెల్లడించారు. అంటే రూ.2 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.20 (వెయ్యి శాతం) ప్రత్యేక మధ్యంతర డివిడెండ్‌ను చెల్లిస్తారు. దీనికి రికార్డ్‌ తేదీ ఈ నెల 31. మొత్తం డివిడెండ్‌ రూపంలో రూ.10,168 కోట్లు చెల్లించనున్నట్లు అగర్వాల్‌ తెలియజేశారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 నాటికి కంపెనీ వద్ద  నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.23,304 కోట్లు ఉన్నాయని తెలిపారు. జింక్‌ ఉత్పత్తి 16 శాతం (సీక్వెన్షియల్‌గా చూస్తే 5 శాతం) క్షీణించి 1.62 లక్షల టన్నులు తగ్గిందని అగర్వాల్‌ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగంలో జింక్‌ ఉత్పత్తి చెప్పుకోదగిన స్థాయిలో పెరగగలదన్న ఆశాభావాన్ని వ్యక్తంచేవారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో హిందుస్తాన్‌ జింక్‌ షేర్‌ 1.1 శాతం నష్టంతో రూ.283 వద్ద ముగిసింది. 
    
 



You may be interested

ఐనాక్స్‌ లీజర్‌ మొత్తం ఆదాయం రూ.369 కోట్లు

Tuesday 23rd October 2018

న్యూఢిల్లీ: మల్టీప్లెక్స్‌ల నిర్వహణ కంపెనీ ఐనాక్స్‌ లీజర్‌ మొత్తం ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో రూ.369 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.314 కోట్ల మొత్తం ఆదాయం వచ్చిందని, 17 శాతం వృద్ధి సాధించామని ఐనాక్స్‌ లీజర్‌ తెలిపింది. నికర లాభం రూ.11.68 కోట్ల నంచి 2 శాతం వృద్ధితో రూ.11.97 కోట్లకు పెరిగిందని పేర్కొంది. మొత్తం వ్యయాలు రూ.296 కోట్ల నుంచి

జుబిలంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ లాభం 67 శాతం అప్‌

Tuesday 23rd October 2018

న్యూఢిల్లీ: జుబిలంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 67 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.125 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.210 కోట్లకు పెరిగిందని జుబిలంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ తెలిపింది. స్పెషాల్టీ ఫార్మాస్యూటికల్స్‌ విభాగం వృద్ధి జోరుగా ఉండటం, జనరిక్స్‌, ఏపీఐ వ్యాపారాలు పుంజుకోవడం వల్ల లాభం ఈ స్థాయిలో పెరిగిందని కంపెనీ

Most from this category