News


హిండాల్కో లాభంలో 18 శాతం క్షీణత

Thursday 16th May 2019
news_main1557999636.png-25780

మార్చి త్రైమాసికానికి హిండాల్కో ఇండస్ట్రీస్‌ నికర లాభం 17.9 శాతం క్షీణించి రూ. 506 కోట్లకు చేరింది. గతేడాది ఇదే కాలంలో కంపెనీ 616 కోట్ల రూపాయల లాభం నమోదు చేసింది.  ఉత్కల్‌ ఆపరేషన్లను మినహాయించి లెక్కిస్తే స్టాండలోన్‌ నికరలాభం 37.4 శాతం పతనమై రూ. 377 కోట్ల నుంచి రూ. 236 కోట్లను చేరింది.  సమీక్షా కాలంలో రెవెన్యూ రూ. 11687 కోట్ల నుంచి రూ. 12455 కోట్లకు పెరిగింది. స్టాండలోన్‌ రెవెన్యూ 6 శాతం పెరిగి రూ. 12373 కోట్లను చేరింది. స్టాండలోన్‌ ఎబిటా 13.7 శాతం క్షీణించి రూ. 1263 కోట్లను చేరింది. మార్జిన్లు 230 బీపీఎస్‌ పతనంతో 10.2 శాతానికి చేరాయి. ఉత్కల్‌ను కలిపి లెక్కిస్తే ఎబిటా 4 శాతం పతనమై రూ. 1733 కోట్లకు, మార్జిన్లు 13.9 శాతానికి పడిపోయాయి. రూపీ బలపడడం, ఆస్తుల విక్రయాల ద్వారా అనుకున్నంత సొమ్ము రాకపోవడంతో ఎబిటా పతనమైంది. భారత్‌లో డిస్ట్రిబ్యూషన్‌పై ఎక్కువ ఫోకస్‌పెట్టడంతో మంచి ఫలితాలు సాధిస్తున్నామని, రికార్డు వాల్యూంలు నమోదు చేసామని కంపెనీ ఎండీ సతీష్‌ పాయ్‌ చెప్పారు. అల్యూమినియం, కాపర్‌ ఉత్పత్తుల విక్రయాలు బాగున్నాయని ముఖ్యంగా వాల్యూయాడెడ్‌ ఉత్పత్తుల వాల్యూంలు మెరుగ్గా ఉన్నాయని చెప్పారు. అల్యూమినియం, కాపర్‌ దిగుమతులు పెరగడం కంపెనీకి రిస్కుగా మారవచ్చన్నారు. ఒక్కో షేరుపై రూ. 1.2 డివిడెండ్‌ను బోర్డు ప్రకటించింది. 
 



You may be interested

11250పాయింట్లపై ముగిసిన నిఫ్టీ

Thursday 16th May 2019

278 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్‌  కలిసొచ్చిన చివరిగంట కొనుగోళ్లు  ఒకరోజు నష్టాల ముగింపు తరువాత చివరి గంట కొనుగోళ్లతో మార్కెట్‌ మళ్లీ లాభాల బాట పట్టింది. సెన్సెక్స్‌ 278 పాయింట్లు లాభపడి 37,393 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 100 పాయింట్లు లాభపడి 11250పై 11,257ల వద్ద ముగిసింది. బ్యాంకు నిఫ్టీ 289 పాయింట్లు లాభపడి 28,855.30 వద్ద స్థిరపడింది. ఒక్క ఫార్మా తప్ప మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లు లాభాలతో ముగిశాయి.

మరో రూ.50వేల కోట్లు కేటాయించండి

Thursday 16th May 2019

ప్రభుత్వరంగ బ్యాంకులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగానూ రూ.50,000 కోట్ల మూలధనాన్ని కేటాయించాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పుకొచ్చాయి. ఈ మేరకు ఎకనామిక్స్‌ టైమ్స్‌ ఒక కథనాన్ని ప్రచురించింది. అధిక రీక్యాపిటలైజేషన్‌ కేటాయింపుతో బ్యాంకుల రుణ వృద్ధిని మరింత పెంచుకోవడంతో పాటు ద్రవ్య కొరత సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని పీఎస్‌యూ బ్యాంకులు భావిస్తున్నాయి. ఈ ప్రతిపాదినపై ఆర్థిక మంత్రిత్వశాఖ మరింత లోతుగా అధ్యయనం చేస్తుందని సంబంధింత వర్గాలు

Most from this category