రెట్టింపైన హిందాల్కో లాభం
By Sakshi

న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రధాన కంపెనీ హిందాల్కో... స్టాండ్ అలోన్ ప్రాతిపదికన ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.734 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం, రూ.364 కోట్లుగా కోట్లతో పోల్చితే 102 శాతం వృద్ధి సాధించామని హిందాల్కో తెలిపింది. ఇబిటా అధికంగా ఉండటం, తక్కువ వడ్డీ వ్యయాల కారణంగా నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని పేర్కొంది. కంపెనీ భారత కార్యకలాపాల ఆదాయం రూ.10,670 కోట్లకు పెరిగింది. అల్యూమినియమ్ ఆదాయం రూ.5,667 కోట్లకు, రాగి విభాగం ఆదాయం రూ.5,006 కోట్లకు చేరాయి. ఇతర ఆదాయం రూ.256 కోట్ల నుంచి రూ.106 కోట్లకు తగ్గిందని కంపెనీ తెలిపింది.
ఇబిటా 17 శాతం అప్..
ఈ క్యూ1లో ఇబిటా 17 శాతం వృద్ధితో రూ.1,951 కోట్లకు పెరిగిందని, ఇదే తమ అత్యధిక త్రైమాసిక ఇబిటా అని హిందాల్కో పేర్కొంది. బొగ్గు, ఫర్నేస్ ఆయిల్ వంటి కీలకమైన ఉత్పత్తి వ్యయాలు పెరిగినా, మంచి ఇబిటా సాధించామని వివరించింది. ఇబిటా మార్జిన్ 11.8 శాతం నుంచి 12.5 శాతానికి పెరిగింది.
23 శాతం తగ్గిన వడ్డీ వ్యయాలు....
హిందాల్కో వడ్డీ వ్యయాలు 23 శాతం తగ్గి రూ.464 కోట్లకు చేరాయి. దీర్ఘకాల ప్రాజెక్ట్ రుణాలపై వడ్డీరేట్ల పునర్వ్యస్థీకరణ, కొన్ని రుణాలను తీర్చివేయడం వల్ల వడ్డీ భారం తగ్గిందని వివరించింది. మరోవైపు హిందాల్కో అమెరికా అనుబంధ సంస్థ, నొవాలిస్ నికర లాభం 10 శాతం వృద్ధితో 11.3 కోట్ల డాలర్లకు, నికర అమ్మకాలు 16 శాతం వృద్ధితో 310 కోట్ల డాలర్లకు చేరాయని తెలిపింది. షెడ్యూల్ ప్రకారమే ఉత్కళ్ అల్యూమినా ప్లాంట్ విస్తరణ కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఇవి 2020-21 కల్లా పూర్తవుతాయని వెల్లడించింది. అల్యుమినా ఉత్పత్తి స్వల్పంగా తగ్గి 695 కిలో టన్నులకు చేరిందని, అల్యూమినియమ్ వేల్యూ యాడెడ్ ఉత్పత్తులు 113 కిలో టన్నులుగా ఉన్నాయని వివరించింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో హిందాల్కో షేర్ 2.2 శాతం క్షీణించి రూ.222 వద్ద ముగిసింది.
You may be interested
గెయిల్ లాభం రూ.1,259 కోట్లు
Saturday 11th August 2018న్యూఢిల్లీ: నేచురల్ గ్యాస్‌ను మార్కెటింగ్ చేసే అతిపెద్ద దేశీ కంపెనీ గెయిల్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో 23 శాతం ఎగసింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.1,026 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.1,259 కోట్లకు పెరిగిందని గెయిల్ తెలిపింది. గ్యాస్ ట్రేడింగ్, పెట్రోకెమికల్స్ వ్యాపారాల్లో మంచి మార్జిన్లు సాధించడంతో ఈ క్యూ1లో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని
యూకో బ్యాంక్ నష్టాలు రూ.634 కోట్లు
Saturday 11th August 2018న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ యూకో బ్యాంక్‌కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.634 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. అయితే గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో వచ్చిన నష్టాలు రూ.663 కోట్లు, సీక్వెన్షియల్‌గా వచ్చిన నష్టాలు రూ.2,134 కోట్లతో పోలిస్తే ఈ క్యూ1లో నికర నష్టాలు తగ్గాయని యూకో బ్యాంక్ తెలిపింది. గత క్యూ1లో రూ.4,237 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో రూ.4,361 కోట్లకు