STOCKS

News


రెడీ అవుతున్న హెచ్‌ఎఫ్‌సీఎల్‌ హైదరాబాద్‌ ప్లాంటు

Thursday 11th July 2019
news_main1562824575.png-26975

  • నవంబరులో ప్రారంభానికి సన్నాహాలు
  • మొత్తం రూ.1,000 కోట్ల పెట్టుబడి

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఆప్టికల్‌ ఫైబర్‌ తయారీ సంస్థ హిమాచల్‌ ఫ్యూచరిస్టిక్‌ కమ్యూనికేషన్స్‌ (హెచ్‌ఎఫ్‌సీఎల్‌) హైదరాబాద్‌ వద్ద ఏర్పాటు చేస్తున్న ప్లాంటు రెడీ అవుతోంది. నవంబరులో తయారీ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని సంస్థ ఎండీ మహేంద్ర నెహతా వెల్లడించారు. ఫ్యాబ్‌ సిటీలో 20 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ తయారీ కేంద్రానికి కంపెనీ తొలి దశలో రూ.260 కోట్లు పెట్టుబడి పెడుతోంది. ఏటా 1.05 కోట్ల ఫైబర్‌ కిలోమీటర్ల తయారీ సామర్థ్యంతో ఇది రానుంది. ఇక్కడి ప్లాంటుకు మొత్తంగా రూ.1,000 కోట్లు ఖర్చు చేయాలన్నది సంస్థ ఆలోచన. మూడు దశలు పూర్తి అయితే 4,000 మందికి ఉద్యోగాకాశాలు లభిస్తాయి. భాగ్యనగరి ప్లాంటులో భారత్‌తోపాటు విదేశీ మార్కెట్ల కోసం 4జీ/5జీ టెలికమ్యూనికేషన్‌, బ్రాడ్‌బ్యాండ్‌ నెట్‌వర్క్‌లో ఉపయోగించే ఆప్టికల్‌ ఫైబర్‌ను తయారు చేస్తారు. ప్రస్తుతం కంపెనీకి గోవా, చెన్నై, హిమాచల్‌ ప్రదేశ్‌లోని సోలన్‌ వద్ద ప్లాంట్లు ఉన్నాయి. ఈ మూడు తయారీ కేంద్రాల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 80 లక్షల ఫైబర్‌ కిలోమీటర్లు. హెచ్‌ఎఫ్‌సీఎల్‌ ఇప్పటికే టెలికం, రైల్వేలు, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ రంగాలకు 25,000 పైచిలుకు 2జీ, 3జీ సెల్‌ సైట్లను, 1,00,000కుపైగా కిలోమీటర్ల ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ నెట్‌వర్క్‌ను అమలు చేసింది. కాగా, జూన్‌ త్రైమాసికం కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో కంపెనీ రూ.1,343 కోట్ల టర్నోవర్‌పై రూ.117 కోట్ల నికరలాభం ఆర్జించింది. 



You may be interested

పాలు, నిత్యావసరాలు @ స్విగ్గీ

Thursday 11th July 2019

డెలివరీ సేవల కోసం రూ.680 కోట్ల పెట్టుబడి 'సూపర్‌' సబ్‌స్క్రిప్షన్స్‌ను పెంచుకోవడంపై దృష్టి గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించే యోచన న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సేవలందించే స్విగ్గీ తాజాగా కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తోంది. గతేడాది కొనుగోలు చేసిన పాలు, నిత్యావసరాల డెలివరీ సంస్థ 'సూపర్‌'పై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా ఈ విభాగంపై దాదాపు రూ.680 కోట్లు ఇన్వెస్ట్‌ చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. స్విగ్గీ స్టోర్స్‌ పేరిట హైపర్‌ లోకల్‌ డెలివరీ

ఆదాయంలో ‘జియో’ అగ్రస్థానం

Thursday 11th July 2019

మార్చి త్రైమాసికంలో రూ.9,839 కోట్లు ఏజీఆర్‌ న్యూఢిల్లీ: ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో.. సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌) పరంగా టాప్‌ స్థానంలో నిలిచినట్లు ట్రాయ్‌ తాజా గణాంకాల ద్వారా వెల్లడైంది. టెలికం సబ్‌స్క్రైబర్ల సంఖ్యను గణనీయంగా పెంచుకుంటోన్న ఈ సంస్థ.. ఏజీఆర్‌ విషయంలోనూ ఇతర కంపెనీలను వెనక్కునెట్టి అగ్రస్థానానికి చేరింది. సంస్థకు మొబైల్ ఫోన్ సేవల నుంచి అందే ఆదాయం గత ఆర్థిక సంవత్సరం మార్చి

Most from this category