STOCKS

News


హెక్సాగాన్‌ ఇండియా విస్తరణ

Saturday 6th October 2018
news_main1538802172.png-20910

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: డిజిటల్‌ సొల్యూషన్స్‌ కంపెనీ హెక్సాగాన్‌ కెపాబిలిటీ సెంటర్‌ ఇండియాను (హెచ్‌సీసీఐ) విస్తరించింది. హైదరాబాద్‌లోని ఈ సెంటర్‌కు తాజాగా 300 సీట్ల సామర్థ్యాన్ని జోడించింది. దీంతో సిబ్బంది సంఖ్య 1,250కి చేరింది. మరో 300ల మంది ఉద్యోగులు కూర్చునేలా మరింత స్పేస్‌ను కైవసం చేసుకుంటామని హెక్సాగాన్‌ ఇండియా ప్రెసిడెంట్‌ ప్రమోద్‌ కౌశిక్‌ తెలిపారు. కస్టమర్‌ ఈవెంట్‌ సందర్భంగా  శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. పుణేలో 250 మంది నిపుణులతో కూడిన టెక్నాలజీ సెంటర్‌ను సైతం కంపెనీ ప్రారంభించింది. భారత్‌లో నూతన ఆవిష్కరణలను తీసుకొస్తున్న స్టార్టప్‌ కంపెనీలు పెద్ద ఎత్తున పుట్టుకొస్తున్నాయని హెక్సాగాన్‌ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ క్లాడియో సిమో తెలిపారు. ఇటువంటి కంపెనీలకు ఇంక్యుబేట్‌ చేస్తామని చెప్పారు. టీ-హబ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుని స్టార్టప్స్‌ను ప్రోత్సహిస్తామని హెచ్‌సీసీఐ వైస్‌ ప్రెసిడెంట్‌ నవనీత్‌ మిశ్రా అన్నారు.



You may be interested

ఎఫ్‌పీఐల ఆకర్షణకు వీఆర్‌ఆర్‌ మార్గం

Saturday 6th October 2018

విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులను (ఎఫ్‌పీఐ) ఆకర్షించేందుకు స్వచ్చంద ఉపసంహరణ మార్గాన్ని (వాలంటరీ రిటెన్షర్‌ రూట్‌/వీఆర్‌ఆర్‌) ఆర్‌బీఐ ప్రతిపాదించింది. ఈ విధానంలో విదేశీ ఇన్వెస్టర్లకు మరింత వెసులుబాటు ఉంటుందని తెలిపింది. డెట్‌లో ఎఫ్‌పీఐ పెట్టుబడులకు సంబంధించి ఇటీవలి ‍కాలంలో పలు చర్యలు తీసుకున్నట్టు పేర్కొంది. ‘‘దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టేలా ఎఫ్‌పీఐలను ప్రోత్సహించేందుకు వీఆర్‌ఆర్‌ అనే పత్ర్యేక మార్గాన్ని ప్రతిపాదించాం. ఈ మార్గంలో ఇనుస్ట్రుమెంట్ల ఎంపిక పరంగా ఎఫ్‌పీఐలకు మరింత వెసులుబాటు ఉంటుంది.

10 నుంచి క్లబ్‌ ఫ్యాక్టరీ దివాలీ సేల్‌

Saturday 6th October 2018

హైదరాబాద్‌: ప్రముఖ ఈ కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ ‘క్లబ్‌ ఫ్యాక్టరీ’ ఈ నెల 10 నుంచి 14వ తేదీ వరకు ‘క్లబ్‌ దివాలీ సేల్‌’ పేరుతో పండుగ విక్రయాలను నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. వినూత్నమైన వస్త్రశ్రేణి, జ్యుయలరీ, సౌందర్య ఉత్పత్తులు, హ్యాండ్‌బ్యాగ్‌లు, గ్యాడ్జెట్లు, గృహ అలకంరణ ఉత్పత్తులను భారీ తగ్గింపు ధరలతో అమ్మకాలు నిర్వహిస్తున్నట్టు తెలిపింది. రూ.99 నుంచి ధరలు ప్రారంభమవుతాయని... క్లబ్‌ ఫ్యాక్టరీ యాప్‌లో కొనుగోళ్లపై ప్రతీ రోజూ ఒక వినియోగదారునికి

Most from this category