STOCKS

News


హీరోమోటో కార్ప్‌ బ్రాండ్ అంబాసిడర్‌గా విరాట్ కోహ్లీ

Wednesday 12th September 2018
news_main1536729906.png-20189

న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన దిగ్గజ సంస్థ హీరోమోటో కార్ప్ ప్రచారకర్తగా భారత క్రికెట్‌ కెప్టెన్ విరాట్ కోహ్లీ నియమితులయ్యారు. ఎక్స్‌ట్రీమ్‌ 200ఆర్‌ ప్రీమియం మోటార్‌సైకిల్‌కు ప్రచారం చేయటంతో కోహ్లీ ఇన్నింగ్స్‌ ప్రారంభిస్తారని హీరో సీఈఓ పవన్ ముంజాల్ ప్రకటించారు. ‘విరాట్ కోహ్లీ ఈ తరం యువతకు ప్రతీక. భయం లేకుండా, లక్ష్యానికి చిహ్నంగా నిలుస్తున్న ఈయన హీరో సంస్థ ఆశయానికి సరిగ్గా సరిపోతారు.’ అన్నారాయన. కోహ్లీ మాట్లాడుతూ.. ‘యువత హీరో వాహనాలను విరివిగా వాడుతున్నారు. ఇటువంటి దిగ్గజ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండడం సంతోషంగా ఉంది’’ అన్నారు. బుధవారం 200ఆర్‌ విడుదలకానుండగా.. ఈ బైక్‌ ధర రూ.89,900 ఉండనుందని కంపెనీ ప్రకటించింది.



You may be interested

అతివిశ్వాసమే మొండిబాకీలకు కారణం

Wednesday 12th September 2018

న్యూఢిల్లీ: బ్యాంకర్లు అతినమ్మకంతో వ్యవహరించడం, ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే ప్రక్రియ మందగించడంతో పాటు ఆర్థిక వృద్ధి ఒక మోస్తరు స్థాయికి పరిమితం కావడమే మొండిబాకీలు (ఎన్‌పీఏ) పేరుకుపోవడానికి ప్రధాన కారణాలని రిజర్వ్‌ బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ పేర్కొన్నారు. మురళీ మనోహర్‌ జోషి సారథ్యంలోని పార్లమెంటరీ కమిటీకి పంపిన నోట్‌లో ఈ మేరకు వివరించారు. బొగ్గు గనుల కేటాయింపులు మొదలైన వాటిపై అనుమానాలు రేకెత్తడం, విచారణనెదుర్కొనాల్సి రావొచ్చన్న భయాల

ప్రపంచంలోనే అతిపెద్ద శాంసంగ్‌ మొబైల్ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్

Wednesday 12th September 2018

బెంగళూరు: దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజమైన శాంసంగ్ ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్‌ను మంగళవారం బెంగళూరులో ప్రారంభించింది. బ్రిటిష్ కాలం నాటి ఓపెరా హౌస్‌లో ఈ సెంటర్‌ ప్రారంభం కాగా, కస్టమర్లు కంపెనీకి చెందిన అన్ని రకాల ఉత్పత్తులను ఇక్కడ పరిశీలించవచ్చని కంపెనీ సౌత్ వెస్ట్ ఆసియా అధ్యక్షుడు సీఈఓ హెచ్‌ సీ హాంగ్ అన్నారు. టీవీలు, స్మార్ట్‌ఫోన్లు, ఫ్రిజ్‌లు, మొబైల్ యాక్సెసరీలను ఇక్కడ అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

Most from this category