STOCKS

News


హీరో మోటోకార్ప్‌ లాభం రూ.976 కోట్లు

Wednesday 17th October 2018
news_main1539750286.png-21225

న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహన కంపెనీ హీరో మోటోకార్ప్‌ సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఫలితాల పరంగా మెప్పించలేకపోయింది. కంపెనీ నికర లాభం 3.38 శాతం తగ్గి రూ.976.28 కోట్లకు పరిమితమైంది. ప్రధానంగా అధిక వ్యయాలు ఇందుకు కారణమయ్యాయి. అమ్మకాల ఆదాయం మాత్రం రూ.9,091 కోట్లకు పెరిగింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.1,010 కోట్లు, ఆదాయం రూ.8,371 కోట్లుగా ఉండడం గమనార్హం. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో వ్యయాలు రూ.7,053 కోట్లుగా ఉంటే, తాజా సమీక్షా త్రైమాసికంలో అవి రూ.7,866 కోట్లకు ఎగశాయి. 
వాహన విక్రయాలు
సెప్టెంబర్‌ త్రైమాసికంలో కంపెనీ మొత్తం 21,34,051 వాహనాలను విక్రయించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 20,22,805 యూనిట్లతో పోలిస్తే వృద్ధి చెందాయి. పనితీరుపై హీరోమోటోకార్ప్‌ చైర్మన్‌, ఎండీ, సీఈవో పవన్‌ ముంజాల్‌ మాట్లాడుతూ... హీరో మోటారు సైకిళ్లు, స్కూటర్లకు డిమాండ్‌ నిలకడగా ఉన్నట్టు చెప్పారు. దీంతో రెండో త్రైమాసికంలోనూ వృద్ధి నమోదు చేశామన్నారు. ఎక్స్‌ట్రీమ్‌ 200ఆర్‌ విడుదల ద్వారా ఖరీదైన మోటారు సైకిళ్ల విభాగంలోకి తిరిగి అడుగుపెట్టినట్టు చెప్పారు. రానున్న పండుగల సందర్భంగా ఎక్స్‌ట్రీమ్‌ 200ఆర్‌ తమ మార్కెట్‌ ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు సాయపడుతుందని పేర్కొన్నారు. ‘‘హీరో మోటోకార్ప్‌లో గట్టి ఆర్థిక నిర్మాణం, మా ఐకానిక్‌ బ్రాండ్లకు బలమైన డిమాండ్‌ నెలకొల్పాం. దీంతో ప్రతీ క్వార్టర్‌లోనూ వృద్ధి నమోదు చేస్తూ వస్తున్నాం. ఈ ఏడాది మిగిలిన కాలంలోనూ ఇది కొనసాగుతుంది. ధరల పరమైన సవాళ్లను అధిగమించి లాభదాయకమైన, స్థిరమైన వృద్ధి కొనసాగిస్తాం’’ అని పవన్‌ ముంజాల్‌ చెప్పారు. 



You may be interested

ఇంధన ధరల్లో ప్రభుత్వ జోక్యం లేదు

Wednesday 17th October 2018

న్యూఢిల్లీ: పెట్రోలియం ఉత్పత్తులపై నియంత్రణ ఎత్తివేసిన నేపథ్యంలో వాటి ధరల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోదని కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మే్ంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ విధానాలకు అనుగుణంగా రేట్లు నిర్ణయించుకునేందుకు ప్రభుత్వ రంగ చమురు రిటైల్ సంస్థలకు పూర్తి స్వేచ్ఛ ఉందని ఇండియా ఎనర్జీ ఫోరం సదస్సులో పాల్గొన్న సందర్భంగా విలేకరులకు ఆయన చెప్పారు.  ఇటీవలే పెట్రోల్‌, డీజిల్‌పై రూ.1.50 మేర ఎక్సయిజ్ సుంకాన్ని తగ్గించిన

కేబుల్ సంస్థల్లో వాటాలపై రిలయన్స్ దృష్టి

Wednesday 17th October 2018

న్యూఢిల్లీ: కేబుల్ టీవీ, హై స్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్ సేవలను పెద్ద యెత్తున విస్తరించే క్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌.. ఇప్పటికే ఆయా రంగాల్లో ఉన్న కంపెనీల్లో వాటాలు కొనుగోలు చేయడంపై దృష్టి పెట్టింది. డెన్‌ నెట్‌వర్క్స్‌, హాథ్‌వే కేబుల్‌ అండ్‌ డేటాకామ్ సంస్థల్లో గణనీయ వాటాలు కొనే దిశగా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇవి తుది దశల్లో ఉన్నాయని, బుధవారం ఈ డీల్స్‌పై ప్రకటన వెలువడొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. "హాథ్‌వే

Most from this category