STOCKS

News


హీరోమోటో కార్ప్‌ ప్రచారకర్తగా ఫెర్నాండో మినా

Tuesday 18th June 2019
news_main1560838693.png-26375

న్యూఢిల్లీ: ప్రముఖ కొలంబియా ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు ‘ఎర్రి ఫెర్నాండో మినా’ను తమ కంపెనీ నూతన బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకున్నట్లు హీరోమోటో కార్ప్‌ సోమవారం ప్రకటించింది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కొలంబియా ద్విచక్ర వాహన మార్కెట్‌లో పట్టుపెంచుకోవడంలో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కొత్త ప్రీమియం మోటార్ సైకిళ్ళు, హై-పవర్‌ స్కూటర్లు, అధునాతన సాంకేతిక ద్విచక్ర వాహనాలను అక్కడి మార్కెట్లో ప్రవేశపెడుతుండగా.. ఈ సమయంలో యువతను ఆకట్టుకోగలిగే విధంగా ఎర్రి మినా ఉన్నారని, ఈ క్రమంలోనే ఈయన ఎంపిక జరిగిందని వివరించింది. ఈ యువ క్రీడాకారుడు తమ కంపెనీకి నూతన ప్రచారకర్తగా ఉండడం వల్ల కొలంబియా మార్కెట్‌లో పట్టుపెరిగి.. బ్రాండ్‌కు మరింత విలువ పెరుగుతుందని భావిస్తున్నట్లు సంస్థ హెడ్ ఆఫ్ స్ట్రాటజీ, గ్లోబల్ బిజినెస్ రజత్ భార్గవ చెన్నారు. 



You may be interested

మన డేటా మన దగ్గరే ఉండాలి..

Tuesday 18th June 2019

దేశ ప్రయోజనాలకు ఉపయోగపడాలి విదేశాల్లో భద్రపర్చడం శ్రేయస్కరం కాదు కేంద్ర మంత్రితో భేటీలో ఈ కామర్స్ వర్గాలు న్యూఢిల్లీ: దేశీ యూజర్ల డేటా... మన దేశ ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగపడాలని, ఇతర దేశాల్లో దీన్ని భద్రపర్చడం శ్రేయస్కరం కాదని ఈ-కామర్స్ కంపెనీలు అభిప్రాయపడ్డాయి. ఈ-కామర్స్‌లో విదేశీ ప‍్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనల ఉల్లంఘనలు జరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశాయి. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్‌తో సోమవారం సమావేశమైన

సూక్ష్మ రుణాలపై బంధన్‌ బ్యాం‍క్‌ వడ్డీ తగ్గింపు

Tuesday 18th June 2019

కోల్‌కతా: సూక్ష్మ రుణాలపై బంధన్‌ బ్యాంక్‌ వడ్డీరేటు 70 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) తగ్గింది. దీనితో ఈ రేటు 17.95 శాతానికి చేరింది. బ్యాంక్‌ సోమవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ సవరించిన రేటు... మంగళవారం నుంచీ ‍ఇచ్చే కొత్త రుణ పంపిణీలకు వర్తిస్తుందని పేర్కొంది. అంతకుముందు కేవలం మైక్రోఫైనాన్స్‌ కంపెనీగా ఉన్న ఈ బ్యాంక్‌, గత నాలుగేళ్లుగా పూర్తి

Most from this category