STOCKS

News


రూ.160 కోట్లు సమీకరించిన హీరో ఎలక్ట్రిక్‌

Wednesday 12th December 2018
news_main1544592488.png-22857

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్‌ తాజాగా రూ.160 కోట్ల నిధులను సమీకరించింది. ముంబైకి చెందిన ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ అల్ఫా క్యాపిటల్‌ అడ్వైజరీ ఈ పెట్టుబడులు పెట్టిందని.. దీంతో హీరో ఎలక్ట్రిక్‌లో కొంత వాటా ఈ సంస్థకు దక్కుతుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త ఉత్పత్తులు, రీసెర్చ్, టెక్నాలజీ మీద ఈ నిధులను వెచ్చిస్తామని హీరో ఎలక్ట్రిక్‌ ఎండీ నవీన్‌ ముంజల్‌ తెలియజేశారు. గత పదేళ్లలో హీరో ఎలక్ట్రిక్‌ మన దేశంలో 15 ఎలక్ట్రిక్‌ వాహనాలను విడుదల చేసింది. ఎలక్ట్రిక్‌ వాహన పరిశ్రమలో దీనికి 45 శాతం మార్కెట్‌ వాటా ఉంది.
 



You may be interested

రూపాయికి జంట దెబ్బలు!

Wednesday 12th December 2018

నీరుకారుతున్న రికవరీ ఆశలు ఈ ఏడాది ఆసియాలో అత్యంత అధ్వాన్న కరెన్సీగా పేరు మూటగట్టుకొన్న రూపాయి కష్టాలు మళ్లీ మొదలయినట్లున్నాయి. ఇటీవల కాలంలో కాస్త రికవరీ చూపుతున్న రూపాయి తాజాగా మరోమారు పతనం దిశగా పరుగులు పెడుతోంది. దీంతో రూపీ రికవరీ ఆశలను బుల్స్‌ వదులకోకతప్పదని నిపుణులు సూచిస్తున్నారు. తాజాగా జరిగిన రెండు సంఘటనలు రూపాయికి జంట కష్టాలు తెచ్చాయని విశ్లేషిస్తున్నారు. ఒకపక్క అధికార బీజేపీ మూడు ప్రధార రాష్ట్రాల్లో ఓడిపోవడం,

నోకియా 8.1 స్మార్ట్‌ఫోన్‌ @ .26,999

Wednesday 12th December 2018

 హైదరాబాద్‌: హెచ్‌ఎమ్‌డీ గ్లోబల్‌ కంపెనీ నోకియా 8.1 స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ నెల 21 నుంచి ఈ ఫోన్ల విక్రయాలు ప్రారంభమవుతాయని, అమెజాన్‌, నోకియా ఇండియా వెబ్‌సైట్ల నుంచి కొనుగోలు చేయొచ్చని హెచ్‌ఎమ్‌డీ గ్లోబల్‌ పేర్కొంది. సోమవారం నుంచే వినియోగదారులు ఈ ఫోన్లను ఆర్డర్‌ చేయొచ్చు. దీని ధర రూ.26,999. ఆండ్రాయిడ్‌ 9.ఓ ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై పనిచేసే ఈ ఫోన్‌లో 6.18 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీప్లస్‌ డిస్‌ప్లే,

Most from this category