STOCKS

News


హెచ్‌డీఎఫ్‌సీకి ‘ఐపీఓ’ జోష్‌

Friday 2nd November 2018
news_main1541141687.png-21659

25 శాతం వృద్ధితో రూ.2,467 కోట్లకు నికర లాభం
-రూ.1,000 కోట్ల ఐపీఓ లాభమే దీనికి ప్రధాన కారణం
-18 శాతం వృద్ధితో రూ.11,257 కోట్లకు మొత్తం ఆదాయం

న్యూఢిల్లీ:- హెచ్‌డీఎఫ్‌సీ కంపెనీ నికర లాభం(స్డాండ్‌ అలోన్‌) ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో 25 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.1,978 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.2,467 కోట్లకు పెరిగిందని  హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ తెలిపింది. తమ మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ, హెచ్‌డీఎఫ్‌సీ ఏఎమ్‌సీ వాటా విక్రయం కారణంగా రూ.1,000 కోట్ల లాభం రావడం, 17 శాతం రుణ వృద్ధి  కారణంగా నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని వైస్‌ చైర్మన్‌ కేకీ మిస్త్రీ చెప్పారు. మొత్తం ఆదాయం రూ.9,007 కోట్ల నుంచి 18 శాతం వృద్ధితో రూ.11,257 కోట్లకు పెరగిందని పేర్కొన్నారు.  
రూ.2,649 కోట్ల నికర వడ్డీ ఆదాయం...
రుణాలు 17 శాతం వృద్ధితో రూ.3.79 లక్షల కోట్లకు ఎగిశాయని మిస్త్రీ చెప్పారు. ఫలితంగా నికర వడ్డీ ఆదాయం 16 శాతం పెరిగి రూ.2,649 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. వడ్డీ ఆదాయం 19 శాతం పెరిగి రూ.9,673 కోట్లకు పెరిగిందని తెలిపారు. నికర వడ్డీ మార్జిన్‌ ఎలాంటి మార్పు లేకుండా 3.5 శాతంగా నమోదైందని వివరించారు.
మెరుగుపడిన రుణ నాణ్యత...
రుణ నాణ్యత మెరుగుపడిందని మిస్త్రీ పేర్కొన్నారు.  స్థూల మొండి బకాయిలు 1.18 శాతం నుంచి 1.13 శాతానికి తగ్గాయని తెలిపారు. నికర మొండి బకాయిలు నిలకడగా 0.66 శాతంగా ఉన్నాయని వివరించారు. నిబంధనల ప్రకారం రూ.2,951 కోట్ల కేటాయింపులు జరపాల్సి ఉండగా, రూ.5,071 కోట్ల కేటాయింపులు జరిపామని చెప్పారు. చెల్లింపుల్లో డిఫాల్ట్‌ అయిన ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కు ఎలాంటి రుణాలివ్వలేదని మిస్త్రీ చెప్పారు. తమకు ఎలాంటి లిక్విడిటీ సమస్యలు లేవన్నారు.You may be interested

భారత్‌లో పసిడి ధగధగలు

Friday 2nd November 2018

సెప్టెంబర్‌ త్రైమాసికంలోడిమాండ్‌ 10 శాతం వృద్ధి డబ్ల్యూజీసీ నివేదిక పండుగల సీజన్‌ అవుట్‌లుక్‌ అంతంతే! ధరల పెరుగదల ప్రధాన కారణం ముంబై: దేశంలో సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో  బంగారానికి  పటిష్ట డిమాండ్‌ నమోదయ్యింది. ఈ కాలంలో 10 శాతం వృద్ధి నమోదయినట్లు (2017 ఇదే కాలంతో పోల్చి) వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ (డబ్ల్యూజీసీ) నివేదిక తెలిపింది. పరిమాణం రూపంలో 183.2 టన్నులు. అయితే ప్రస్తుత పండుగల సీజన్‌లో మాత్రం బంగారం డిమాండ్‌ అంతంతే

హెచ్‌పీసీఎల్‌ లాభం 37శాతం డౌన్‌

Friday 2nd November 2018

న్యూఢిల్లీ: హిందుస్తాన్‌ పెట్రోలియమ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(హెచ్‌పీసీఎల్‌) నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో 37 శాతం తగ్గింది. గత క్యూ2లో రూ.1,735 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.1,092 కోట్లకు తగ్గిందని హెచ్‌పీసీఎల్‌ తెలిపింది. ముడి చమురు ధరలు పెరగడం,  రిఫైనింగ్‌ మార్జిన్‌లు తక్కువగా ఉండడం, విదేశీ మారక ద్రవ్య నష్టాల వల్ల నికర లాభం 37 శాతం తగ్గిందని కంపెనీ సీఎమ్‌డీ ముకేశ్‌

Most from this category