STOCKS

News


హెచ్‌డీఎఫ్‌సీకి రూ.500 కోట్ల మసాలా బాండ్ల నిధులు

Wednesday 21st November 2018
news_main1542775603.png-22245

న్యూఢిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీ కంపెనీ మసాలా బాండ్ల జారీ ద్వారా రూ.500 కోట్లు సమీకరించింది. మీడియమ్‌ టర్మ్‌ నోట్‌ (ఎమ్‌టీఎన్‌) ప్రోగ్రామ్‌లో భాగంగా రూపీ డినామిటేడెడ్‌ బాండ్లను జారీ చేసి ఈ నిధులు సమీకరించింది. విదేశీ క్యాపిటల్‌ మార్కెట్లలో భారత కంపెనీలు జారీ చేసే ఈ బాండ్లలో స్థానిక కరెన్సీల్లో కాకుండా రూపాయల్లో మాత్రమే పెట్టుబడి పెట్టగలిగే అవకాశం ఉంటుంది. అందుకే వీటిని మసాలా బాండ్లుగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ నిధుల సమీకరణ సోమవారం ముగిసినట్లు హెచ్‌డీఎఫ్‌సీ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ బాండ్ల కాలపరిమితి 5 సంవత్సరాల 1 రోజని, కూపన్‌ రేటు​ 8.75 శాతమని, ఆరు నెలలకొకసారి వడ్డీ చెల్లిస్తామని వివరించింది. ఈ బాండ్లకు ఎలాంటి రేటింగ్‌ లేదని, వీటిని లండన్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ ఇంటర్నేషనల్‌ సెక్యూరిటీస్‌ మార్కెట్లో లిస్ట్‌ చేస్తామని పేర్కొంది. ఈ నిధుల సమీకరణ వార్తల నేపథ్యంలో బీఎస్‌ఈలో హెచ్‌డీఎఫ్‌సీ షేర్‌ 0.57 శాతం లాభపడి రూ. 1,898 వద్ద ముగిసింది. 



You may be interested

మహీంద్రా నుంచి ఎలక్ట్రిక్‌ కిక్‌ స్కూటర్లు !

Wednesday 21st November 2018

న్యూఢిల్లీ: వాతావరణ కాలుష్యం నివారణకు ఎలక్ట్రిక్‌ కిక్‌ స్కూటర్లు మంచి పరిష్కారమని మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా వ్యాఖ్యానించారు. భారత్‌లోని ఢిల్లీ తదితర పెద్ద నగరాల్లో కాలుష్యం సమస్య మరింత తీవ్రమవుతోందని, దీని నుంచి గట్టెక్కేందుకు భారత్‌లో ఎలక్ట్రిక్‌ కిక్‌ స్కూటర్లను అందించే విషయమై కసరత్తు చేస్తున్నామని వివరించారు. బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్‌ మోటార్‌తో పనిచేసే ఎలక్ట్రిక్‌ కిక్‌ స్కూటర్‌ గంటకు 25 కిమీ. దూరం గరిష్ట వేగంతో

టాలెంట్‌లో తగ్గిన భారత్‌

Wednesday 21st November 2018

న్యూఢిల్లీ: స్విట్జర్లాండ్‌కి చెందిన ఐఎండీ బిజినెస్ స్కూల్‌ వార్షిక టాలెంట్ ర్యాంకింగ్‌లో ఈసారి భారత్ రెండు స్థానాలు దిగజారి 53వ స్థానానికి పరిమితమైంది. అయిదోసారి కూడా స్విట్జర్లాండ్ అగ్రస్థానం దక్కించుకుంది. 63 దేశాలతో ఐఎండీ బిజినెస్ స్కూల్ మంగళవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌ జాబితాలో టాప్‌-5 స్థానాల్లో స్విట్జర్లాండ్‌ వెనుకన డెన్మార్క్‌, నార్వే, ఆస్ట్రియా, నెదర్లాండ్స్‌ ఉన్నాయి. ఆసియా దేశాల్లో మాత్రం సింగపూర్‌ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. గ్లోబల్‌ లిస్టులో మాత్రం

Most from this category