STOCKS

News


హెచ్‌డీఎఫ్‌సీ లాభం 27 శాతం అప్‌

Tuesday 14th May 2019
news_main1557813384.png-25722

మార్చి త్రైమాసికానికి హెచ్‌డీఎఫ్‌సీ నికరలాభం 27 శాతం పెరిగి రూ. 2861.6 కోట్లకు చేరింది. గతేడాది ఇదే కాలంలో కంపెనీ రూ. 2256.68 కోట్ల లాభం నమోదు చేసింది. సమీక్షా కాలంలో కంపెనీ రెవెన్యూ రూ. 11586 కోట్లను చేరింది. కంపెనీ కొత్త అకౌంటింగ్‌ ప్రమాణాలకు మారినందున ఈ ఫలితాలను గత ఫలితాలతో పోల్చలేము. కంపెనీ స్థూల ఎన్‌పీఏలు 1.22 శాతం నుంచి 1.18 శాతానికి దిగివచ్చాయి. క్యు4లో కంపెనీ ఎన్‌ఐఐ 6 శాతం పెరిగి రూ. 3183. 3 కోట్లకు చేరింది. లోన్‌గ్రోత్‌ 13.8 శాతం వృద్ధి సాధించింది. నికర వడ్డీ మార్జిన్లు మాత్రం 3.5 శాతం నుంచి 3.3 శాతానికి తగ్గాయి. ఒక్కో షేరుపై కంపెనీ రూ. 17.50 అంతిమ డివిడెండ్‌ను ప్రకటించింది. మధ్యాహ్న సమయానికి కంపెనీ షేరు 1.5 శాతం లాభంతో 1961 రూపాయల వద్ద ట్రేడవుతోంది. 



You may be interested

ఐటీసీ లాభంలో 19 శాతం వృద్ధి

Tuesday 14th May 2019

రూ.3,482 కోట్లు నమోదు 2018-19లో లాభం రూ.12,824 కోట్లు  పేపర్‌బోర్డ్స్‌, ఎఫ్‌ఎంసీజీల మెరుగైన పనితీరు ఒక్కో షేరుకు రూ.5.75 డివిడెండ్‌ న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్‌ కంపెనీ ఐటీసీ మార్చి త్రైమాసికానికి రూ.3,482 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో లాభం రూ.2,932 కోట్లతో పోలిస్తే 19 శాతం పెరిగింది. ఇక ఆదాయం రూ.11,329 కోట్ల నుంచి 14 శాతం పెరిగి రూ.12,933 కోట్లకు చేరింది. పేపర్‌ బోర్డ్స్‌, పేపర్‌, ప్యాకేజింగ్‌, హోటల్స్‌,

హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్‌ ఏఎంసీలకు సెబి నోటీసులు

Tuesday 14th May 2019

ఎస్సెల్‌ గ్రూప్‌లో పెట్టుబడులకు సంబంధించి హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌కు సెబి షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. రుణాలు చెల్లించేందుకు ఎస్సెల్‌గ్రూప్‌నకు సెప్టెంబర్‌ దాకా గడువునిచ్చేలా ఎంఎఫ్‌లు కుదుర్చుకున్న ఒప్పంద చట్టబద్ధతను సెబి ప్రశ్నించింది. ఇలాంటి ఒప్పందాల కారణంగా ఈ ఎంఎఫ్‌ల్లో పెట్టుబడులు పెట్టిన మదుపరులు తమ పథకం మెచ్యూర్‌ అయినా పూర్తి మొత్తం పొందలేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎస్సెల్‌గ్రూప్‌ డెట్‌ సెక్యూరిటీస్‌లో ఈ ఎంఎఫ్‌లకు సంబంధించిన అన్ని

Most from this category