STOCKS

News


మళ్లీ అగ్రస్థానానికి హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌

Friday 4th January 2019
news_main1546575407.png-23400

నిర్వహణ ఆస్తుల్లో ఈ కంపెనీదే పైచేయి
-వెల్లడించిన ఆంఫి

న్యూఢిల్లీ: అతి పెద్ద మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీగా హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ నిలిచింది. నిర్వహణ ఆస్తుల పరంగా ఇప్పటివరకూ అగ్రస్థానంలో ఉన్న ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ను తోసిరాజని హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ ఈ స్థానానికి దూసుకువచ్చింది. దాదాపు రెండేళ్ల అనంతరం ఈ కంపెనీ ఈ ఘనతను సాధించింది. ఆంఫి (అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా) వెల్లడించిన వివరాల ప్రకారం..,
-గత నెల చివరినాటికి హెచ్‌డీఎఫ్‌సీ ఎమ్‌ఎఫ్‌ నిర్వహణ ఆస్తులు రూ.3.35 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇదే కాలానికి ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఎమ్‌ఎఫ్‌ ఆస్తులు రూ.3.08 లక్షల కోట్లు.
-గత ఏడాది అక్టోబర్‌-డిసెంబర్‌ క్వార్టర్‌కు హెచ్‌డీఎఫ్‌సీ ఎమ్‌ఎఫ్‌ ఆస్తులు 9 శాతం వృద్ధి చెందగా, ఐసీఐసీఐ ప్రు. ఎమ్‌ఎఫ్‌ ఆస్తులు 0.6 శాతం తగ్గాయి.
-2011 నుంచి 2016 వరకూ  అగ్రస్థానంలో హెచ్‌డీఎఫ్‌సీ ఎమ్‌ఎఫ్‌ కొనసాగింది. ఆ తర్వాత ఐసీఐసీఐ ప్రడెన్షియల్‌ ఎమ్‌ఎఫ్‌ ఈ స్థానాన్ని చేజిక్కించుకుంది.
-రూ.2.64 లక్షల కోట్ల నిర్వహణ ఆస్తులతో ఎస్‌బీఐ ఎమ్‌ఎఫ్‌ మూడో స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ ఎమ్‌ఎఫ్‌(రూ.2.42 లక్షల కోట్లు), రిలయన్స్‌ ఎమ్‌ఎఫ్‌(రూ.2.36 లక్షల కోట్లు)లు ఉన్నాయి.
-మొత్తం మీద అన్ని మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థల నిర్వహణ ఆస్తులు రూ.23.61 లక్షల కోట్లుగా ఉన్నాయి.
-సెబీ తీసుకుంటున్న వివిధ చర్యల కారణంగా మ్యూచువల్‌ఫండ్‌ పరిశ్రమ ఈ ఏడాది మరింత జోరుగా వృద్ధి సాధిస్తుందన్న అంచనాలు ఉన్నాయి.



You may be interested

జీఎస్‌టీ ఐటీసీ ప్రయోజనానికి గడువు పొడిగింపు

Friday 4th January 2019

న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)  ప్రారంభమైన మొదటి ఆర్థిక సంవత్సరానికి (2017-18) సంబంధించి  పరిశ్రమలు ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ క్లెయిమ్‌ (ఐటీసీ) చేసుకునేందుకు గడువును ఆర్థికశాఖ పొడిగించింది. ఈ గడువును ఈ ఏడాది మార్చి 2019 వరకూ పొడిగిస్తున్నట్లు ఒక ప్రకటన తెలిపింది. అయితే తమ సరఫరాదారు దాఖలు చేసిన రిటర్న్స్‌కు (జీఎస్‌టీఆర్‌-2ఏ- సరఫరాదారు దాఖలు చేసిన సేల్స్‌ రిటర్న్స్‌ ఆధారంగా సిస్టమ్స్‌ ఆటోమేటిక్‌గా సృష్టించేది)  సరిపోలితేనే ఐటీసీ

రూ.2000 నోటుకు కళ్లెం

Friday 4th January 2019

మనీ లాండరింగ్‌కి ఉపయోగపడుతోందన్న సందేహాలు చలామణీని క్రమంగా తగ్గించడమే ఆర్‌బీఐ ఉద్దేశం ముద్రణ కనిష్ట స్థాయికి తగ్గినట్లు ఆర్థిక శాఖ వెల్లడి న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు అనంతరం ప్రవేశపెట్టిన రూ. 2,000 నోట్ల ముద్రణను రిజర్వ్‌ బ్యాంక్‌ నిలిపివేసినట్లుగా తెలుస్తోంది. క్రమంగా ఈ నోట్ల చలామణీని తగ్గించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. పన్నులు ఎగవేసేందుకు, మనీలాండరింగ్‌కు ఈ పెద్ద నోట్లను కొన్ని వర్గాలు ఈ పెద్ద నోట్లను దుర్వినియోగం చేస్తున్నట్లు

Most from this category