హెచ్డీఎఫ్సీ లైఫ్ లాభంలో 20 శాతం వృద్ధి
By Sakshi

న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ బీమా సంస్థ హెచ్డీఎఫ్సీ స్టాండర్డ్ లైఫ్ సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.287 కోట్ల లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న నికర లాభం రూ.238.49 కోట్ల లాభంతో పోలిస్తే 20 శాతం పెరిగింది. స్థూల ప్రీమియం సైతం రూ.5,636 కోట్ల నుంచి రూ.6,840 కోట్లకు వృద్ధి చెందింది. నికర ప్రీమియం ఆదాయం రూ.5,389 కోట్ల నుంచి రూ.6,777 కోట్లకు పెరిగింది. కంపెనీ పేరును హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్‌గా మార్చే ప్రతిపాదనకు జూలై 20 నాటి బోర్డు సమావేశం ఆమోదం తెలుపగా, ఇది నియంత్రణ సంస్థల అనుమతులపై ఆధారపడి ఉంటుందని కంపెనీ తెలియజేసింది. కంపెనీ ఎండీ, సీఈవోగా విభాపడల్కర్ సెప్టెంబర్ 12న నియమితులయ్యారని, మరొకరిని భర్తీ చేసే వరకు కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గానూ కొనసాగుతారని పేర్కొంది. ‘‘పరిశ్రమ కంటే వేగవంతమైన వృద్ధిని నమోదు చేశాం. లాభాల విషయంలో మా ఆధిపత్యాన్ని కొసాగించాం. ఇదే విధానాన్ని కొనసాగిస్తూనే... భాగస్వాములు, కస్టమర్లు, వాటాదారులకు మంచి విలువను సమకూరుస్తాం’’ అని విభాపడల్కర్ తెలిపారు.
You may be interested
ఎన్బీసీసీ-హెచ్ఎస్ఎస్సీ డీల్‌కు సీసీఐ పచ్చజెండా
Wednesday 24th October 2018న్యూఢిల్లీ: కన్సల్టెన్సీ సంస్థ హెచ్‌ఎస్‌సీసీలో నూరు శాతం వాటా కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వరంగ నిర్మాణ సంస్థ ఎన్బీసీసీ ప్రతిపాదనకు కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అనుమతినిచ్చింది. అలాగే, హైదరాబాద్‌కు చెందిన జెమిని ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియాలో (జీఈఎఫ్ ఇండియా) 25 శాతం వాటా కొనుగోలు చేసేందుకు సింగపూర్‌కు చెందిన బ్లాక్ రివర్ ఫుడ్‌కు అనుమతి మంజూరు చేసింది. సీఎల్పీ ఇండియాలో వాటాలను సొంతం చేసుకునేందుకు సీడీపీక్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్
బజాజ్ ఫైనాన్స్‌కు లాభాల బూస్ట్
Wednesday 24th October 2018ముంబై: నిర్వహణలోని ఆస్తుల్లో చక్కని వృద్ధి సాధించటంతో బజాజ్ ఫైనాన్స్ కన్సాలిడేటెడ్ లాభం సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో ఏకంగా 54 శాతం పెరిగి రూ.923 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి వచ్చిన లాభం రూ.598 కోట్లు. కన్సాలిడేటెడ్ ఆదాయం సైతం 40 శాతం వృద్ధితో కిందటేడాది ఇదే కాలంలో ఉన్న రూ.3,066 కోట్ల నుంచి రూ.4,296 కోట్లకు వృద్ధి చెందింది. సబ్సిడరీ కంపెనీలైన బజాజ్