STOCKS

News


హెచ్‌డీఎఫ్‌సీ గ్రూపు @ రూ.10 లక్షల కోట్లు

Tuesday 10th July 2018
news_main1531239715.png-18184

న్యూఢిల్లీ: ఆర్థిక సేవల రంగంలోని ప్రముఖ కార్పొరేట్‌ గ్రూపు హెచ్‌డీఎఫ్‌సీ... మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ పరంగా రూ.10 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించింది. టాటా గ్రూపు తర్వాత రూ.10 లక్షల కోట్ల మార్కును చేరుకున్న రెండో గ్రూపు హెచ్‌డీఎఫ్‌సీ కావడం గమనార్హం. బ్యాంకింగ్‌, గృహరుణాలు, బీమా ఉత్పత్తులు, మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇలా భిన్న రకాల ఆర్థిక సేవల్లో హెచ్‌డీఎఫ్‌సీ గ్రూపు కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. గ్రూపులో భాగమైన హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్‌ లైఫ్‌, గృహ్‌ ఫైనాన్స్‌ స్టాక్‌ మార్కెట్లో లిస్టయి ఉన్నాయి. మరో సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ ఐపీవో త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ ఒక్క కంపెనీ మార్కెట్‌ విలువ రూ.30,000 కోట్లుగా ఉంటుందని విశ్లేషకుల అంచనా. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు టీసీఎస్‌, ఆర్‌ఐఎల్‌ తర్వాత దేశంలోనే అత్యంత విలువైన మూడో కంపెనీ. హెచ్‌డీఎఫ్‌సీ నాలుగు దశాబ్దాలుగా గృహ రుణ వ్యాపార కార్యకలాపాల్లో ఉంటే, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 25 ఏళ్లుగా పనిచేస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్‌ లైఫ్‌ 20 ఏళ్ల నుంచి, గృహ్‌ ఫైనాన్స్‌ 30 ఏళ్ల నుంచి వ్యాపారంలో ఉన్నవే. హెచ్‌డీఎఫ్‌సీ గ్రూపు కంపెనీలన్నింటికీ మాతృ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌. ఇందులో 76 శాతం వాటాదారులు ఎఫ్‌ఐఐలే కావడం గమనార్హం. 
 
కంపెనీల మార్కెట్‌ విలువ
కంపెనీ పేరు    మార్కెట్‌ క్యాప్‌ (రూ.కోట్లలో)
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు    5,59,633.53 
హెచ్‌డీఎఫ్‌సీ    3,26,776.81 
హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్‌లైఫ్‌    95,936.72
గృహ్‌ ఫైనాన్స్‌    24,967.71
మొత్తం    1007314.77



You may be interested

సిటీ గ్యాసు బిడ్లలో అదానీ ముందంజ

Tuesday 10th July 2018

న్యూఢిల్లీ: పట్టణాల్లో సహజవాయువు పంపిణీ ప్రాజెక్టులకు సంబంధించిన బిడ్లలో అదానీ గ్రూపు ముందంజలో నిలిచింది. 52 పట్టణాల్లో ఈ సంస్థ బిడ్లు వేసి టాప్‌ బిడ్డర్‌గా నిలిచింది. ప్రభుత్వరంగ గెయిల్‌ 30 పట్టణాల పట్ల ఆసక్తి చూపిస్తూ బిడ్లు వేసింది. ఇక, రిలయన్స్‌-బీపీ మాత్రం చివరి నిమిషంలో తప్పుకోవడం గమనార్హం. అదానీ గ్యాస్‌ లిమిటెడ్‌ 32 పట్టణాల్లో సొంతగాను, 20 పట్టణాల్లో ఐవోసీతో కలసి బిడ్లు వేసింది. దేశ వ్యాప్తంగా

రోడ్లపై కార్ల జోరు!

Tuesday 10th July 2018

 జూన్‌లో వాహన విక్రయాలు 38% జంప్‌  2,73,759 యూనిట్లుగా నమోదు  పదేళ్లలో ఇదే అత్యంత వేగవంతమైన నెలవారీ వృద్ధి  సియామ్‌ గణాంకాల్లో వెల్లడి న్యూఢిల్లీ: వాహన పరిశ్రమ జోరుమీదుంది. జూన్‌ నెలలో ప్యాసింజర్‌ వాహన అమ్మకాల్లో 38 శాతం వృద్ధి నమోదయ్యింది. అటుఇటుగా గత పదేళ్లలో ఇదే అత్యంత వేగవంతమైన నెలవారీ వృద్ధి. ఆటోమొబైల్‌ మ్యానుఫ్యాక్చరర్స్‌ సమాఖ్య (సియామ్‌) తాజా గణాంకాల ప్రకారం..  ♦ దేశీ ప్యాసింజర్‌ వాహన (పీవీ) అమ్మకాలు 1,99,036 యూనిట్ల నుంచి

Most from this category