STOCKS

News


హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క్యు2 ఫలితాలు... ఏం చూడాలి?

Saturday 20th October 2018
news_main1540031628.png-21325

శనివారం దేశీయ ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రెండో త్రైమాసిక ఫలితాలు ప్రకటించనుంది. ఈ దఫా బలమైన లోన్‌గ్రోత్‌ను బ్యాంకు నమోదు చేస్తుందని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. లాభాల్లో 17- 21 శాతం పెరుగుదల ఉండొచ్చని భావిస్తున్నారు. వడ్డీ వ్యయాల కారణంగా మార్జిన్లు కుంచించుకుపోవచ్చని, అయితే ఆస్తుల నాణ్యత మాత్రం స్థిరంగా ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. శుక్రవారం షేరు దాదాపు అరశాతం నష్టంతో క్లోజయింది. 
- మోతీలాల్‌ ఓస్వాల్‌: బ్యాంకు లోన్‌గ్రోత్‌ 20 శాతం ఉండొచ్చు. రిటైల్‌ రుణాల హవా కనిపిస్తుందని అంచనా. డిపాజిట్లలో 21 శాతం వృద్ది ఉండొచ్చు. మార్జిన్లు 4.1 శాతానికి పరిమితం కావచ్చు. ఎన్‌ఐఐలో 13 శాతం మెరుగుదల అంచనా వేస్తున్నాం. ఇతర ఆదాయంలో సైతం 11 శాతం వరకు పెరుగుదల ఉండవచ్చు. ఫీజుల ఆదాయం సైతం ఆరోగ్యవంతంగానే ఉండొచ్చు. స్థూల ఎన్‌పీఏలు 1.3 శాతానికి, నికరలాభం రూ. 4920 కోట్లకు పెరగవచ్చు. 
- ప్రభుదాస్‌ లీలాధర్‌: ఎర్నింగ్స్‌లో 20 శాతం, రుణాల్లో 24 శాతం వృద్ధి ఉండవచ్చని అంచనా. ఎన్‌ఐఎం తలనొప్పులు తీరనందున ఎన్‌ఐఐ వృద్ధి 18 శాతానికే పరిమితం కావచ్చు. రుణాల్లో మరింత మార్కెట్‌ వాటా సొంతం చేసుకుంటుందని అంచనా. రిటైల్‌, సాగు, వాణిజ్యవాహనాలు, నిర్మాణరంగ యంత్రాలు తదితర విభాగాల్లో మంచి మెరుగుదల సాధిస్తుంది. 
- కోటక్‌సెక్యూరిటీస్‌: ఎన్‌ఐఐ వృద్ధి లోన్‌గ్రోత్‌ కన్నా కాస్త తక్కువగా ఉండొచ్చు. ఈ దఫా కార్పొరేట్‌తో పాటు రిటైల్‌ రుణాల్లో కూడా మంచి మెరుగుదల ఉంటుంది. ఫీజు ఆదాయంలో 20 శాతం వృద్ధి ఉండొచ్చు. నికరలాభంలో 24.3 శాతం వృద్ది ఉంటుందని అంచనా.



You may be interested

రిలయన్స్‌ టార్గెట్‌ @ 1,303

Saturday 20th October 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తాజాగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరుపై ధీమాగానే ఉంది. ఎందుకో చూద్దాం.. బ్రోకరేజ్‌: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ స్టాక్‌: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రేటింగ్‌: కొనొచ్చు ఇండస్ట్రీ: ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ ప్రస్తుత ధర: రూ.1,101 టార్గెట్‌ ప్రైస్‌: రూ.1,303 హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌.. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌పై పాజిటివ్‌గా ఉంది. ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (క్యూ2, జూలై-సెప్టెంబర్‌) ప్రకటించిన ఎర్నింగ్స్‌ను గమనిస్తే.. తన నిర్వహణ సామర్థ్యాన్ని

ఎరిస్‌ లైఫ్‌సైన్సెస్‌కు ‘బై’ రేటింగ్‌

Saturday 20th October 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ ఆనంద్‌రాఠి తాజాగా ఎరిస్‌ లైఫ్‌సైన్సెస్‌ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. ఎందుకో చూద్దాం.. బ్రోకరేజ్‌: ఆనంద్‌రాఠి స్టాక్‌: ఎరిస్‌ లైఫ్‌సైన్సెస్‌ ఇండస్ట్రీ: హెల్త్‌కేర్‌ రేటింగ్‌: కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.718 టార్గెట్‌ ప్రైస్‌: రూ.879 ఆనంద్‌రాఠి.. ఎరిస్‌ లైఫ్‌సైన్సెస్‌పై బుల్లిష్‌గా ఉంది. ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. బై రేటింగ్‌ ఇచ్చింది. దేశీ ఫార్మాస్యూటికల్‌ కంపెనీ అయిన ఎరిస్‌ లైఫ్‌సైన్సెస్‌ ప్రధానంగా జీవనశైలి సంబంధిత రుగ్మతల చికిత్సలకు అవసరమైన ప్రొడక్టుల తయారీపై

Most from this category