STOCKS

News


కస్టమర్లకు వాట్సాప్‌లో నోటీసులు!!

Saturday 15th September 2018
news_main1536987063.png-20268

న్యూఢిల్లీ: నిబంధనలను ఉల్లంఘించే ఖాతాదారులకు సంబంధించి కేసులను సత్వరం పరిష్కరించుకునే క్రమంలో ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్.. వాట్సాప్, ఈమెయిల్స్ ద్వారా కూడా నోటీసులు పంపుతోంది. ఇప్పటిదాకా 250 పైచిలుకు సమన్లను వీటి ద్వారా పంపినట్లు బ్యాంకు అధికారి ఒకరు వెల్లడించారు. వీరిలో ఎక్కువమంది మహారాష్ట్ర, గుజరాత్‌, పశ్చిమ బెంగాల్‌, ఒడిశా, తమిళనాడు, ఉత్తర్‌ ప్రదేశ్‌లకు చెందినవారని చెప్పారు. పోస్ట్ ద్వారా నోటీసులు పంపుతున్నా చాలా మంది కస్టమర్లు తమకెలాంటి సమన్లు రాలేదని చెబుతున్న నేపథ్యంలో ఈ కొత్త మాధ్యమాలను ఎంచుకున్నట్లు ఆయన తెలియజేశారు. ఇళ్లు మారడం వల్ల కూడా కొన్నిసార్లు ఖాతాదారులకు నోటీసులు చేరకపోవచ్చని .. అయితే సాధారణంగా మొబైల్ ఫోన్ నంబరు, ఈమెయిల్ ఐడీలను ఎక్కువగా మార్చరు కాబట్టి సమాచారం అందించేందుకు వాట్సాప్‌, ఈ మెయిల్స్‌ మెరుగైన సాధనాలని చెప్పారాయన. దేశవ్యాప్తంగా దాదాపు 60 లక్షల చెక్ బౌన్స్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని.. సమన్ల జారీకి డిజిటల్ మాధ్యమాలను వినియోగించుకునేందుకు అనుమతినివ్వాలన్న తమ బ్యాంక్ అభ్యర్ధనకు కోర్టులు సానుకూలంగా స్పందించడంతో ఇది సాధ్యపడుతోందని ఆయన పేర్కొన్నారు.



You may be interested

గోద్రేజ్‌ ఆగ్రోవెట్‌లో అనుబంధ సంస్థ విలీనం

Saturday 15th September 2018

న్యూఢిల్లీ: గోద్రేజ్‌ ఆగ్రోవెట్‌లో ఆ కంపెనీ అనుబంధ సంస్థ, ఆస్టెక్‌ లైఫ్‌ సైన్సెస్‌ విలీనానికి డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపింది. శుక్రవారం సమావేశమైన డైరెక్టర్ల బోర్డ్‌ ఈ మేరకు ఆమోదం తెలిపిందని గోద్రేజ్‌ ఆగ్రోవెట్‌ పేర్కొంది. ఈ విలీన ప్రణాళికలో భాగంగా ప్రతి 10 ఆస్టెక్‌​ లైఫ్‌ సైన్సెస్‌ షేర్లకు 11 గోద్రేజ్‌ ఆగ్రోవెట్‌ షేర్లను జారీ చేస్తామని తెలిపింది.  ఈ విలీనానికి నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌, స్టాక్‌

సన్నీ వార్షిక ఎడిషన్ @ రూ.6.99 లక్షలు

Saturday 15th September 2018

న్యూఢిల్లీ: ప్రముఖ ఆటోమేకర్‌ నిస్సాన్ మిడ్‌-సైజ్‌ సెడాన్‌ సన్నీ వార్షికోత్సవ ఎడిషన్‌ను శుక్రవారం మార్కెట్‌లో విడుదలచేసింది. కారు సాంకేతిక వ్యవస్థ మొత్తాన్ని అనుసందానించే నిస్సాన్‌ కనెక్ట్‌తో కలిపి మొత్తం 50 అధునాతన సాంకేతిక ఫీచర్లు ఈ స్పెషల్‌ ఎడిషన్‌లో ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. పెట్రోల్‌, డీజిల్‌ ఇంజిన్‌ వేరియంట్లలో విడుదలైన ఈ కారు ధర 6.99 లక్షలు. ‘విశాలమైన ఇంటీరియర్స్, స్మార్ట్‌ టెక్నాలజీ అప్‌డేట్స్‌ కలిగిన సన్నీ వార్షిక ఎడిషన్‌

Most from this category