STOCKS

News


అంచనాలకు అనుగుణంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నికరలాభం

Saturday 20th October 2018
news_main1540034702.png-21329

రెండో త్రైమాసికంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నికరలాభం 20.6 శాతం పెరిగి 5,006 కోట్ల రూపాయలకు చేరింది. బ్యాంకు లాభం 5,033 కోట్లుండవచ్చని బ్లూమ్‌బర్గ్‌ అంచనా వేసింది. ఆస్తుల నాణ్యత బలంగా ఉండడం, ఆరోగ్యకరమైన ఫీజు ఆదాయాలు బ్యాంకు ఫలితాలను ఆదుకున్నాయి. 
ఫలితాల్లో ప్రధానాంశాలు..

  • బ్యాంకు నికర వడ్డీ ఆదాయం 20.6 శాతం పెరిగి 11,763.4 కోట్లకు చేరింది.  
  • నికర వడ్డీ మార్జిన్లు 10 బీపీఎస్‌ పెరిగి 4.3 శాతానికి చేరాయి. 
  • బ్యాంకు స్థూల ఎన్‌పీఏలు 1.33 శాతం వద్ద, నికర ఎన్‌పీఏలు 0.40 శాతం వద్ద స్థిరంగా ఉన్నాయి. 
  • రిటైల్‌ లోన్‌ పోర్టుఫోలియో 23.8 శాతం, మొత్తం డిపాజిట్లు 20.9 శాతం, కాసా 18.3 శాతం వృద్ది సాధించాయి. 
  • క్యాపిటల్‌ అడిక్వసీ నిష్పత్తి 17. 1 శాతంగా నమోదయింది. 
  • మొండి పద్దులకు కేటాయింపులు 1629 కోట్ల రూపాయల నుంచి 1820 కోట్లరూపాయలకు పెరిగాయి. 
  • ఫీజు ఆదాయం 3,295 కోట్ల రూపాయలుగా నమోదయింది. ఇతర ఆదాయాలు 4016 కోట్ల రూపాయలకు చేరాయి. 
  • బ్యాంకు బాలెన్స్‌ షీటు సైజు 11.69 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. 



You may be interested

సరైన రంగాన్ని ఎంచుకోవడమే కీలకం

Saturday 20th October 2018

ఎంఎఫ్‌ ఇన్వెస్టర్లకు నిపుణుల సూచన ఈక్విటీల్లో, ఈక్విటీ ఆధారిత మ్యూచువల్‌ ఫండ్స్‌లో మంచి రాబడులకు సరైన రంగాన్నిఎంచుకోవడమే కీలక సూత్రమని నిపుణుల అభిప్రాయం. మ్యూచువల్‌ ఫండ్‌ ఇన్వెస్టర్లకు ఈ రంగాలు సూటవుతాయో కొందరు నిపుణుల సూచనలు చూద్దాం.. - దీర్ఘకాల పెట్టుబడులకు వినిమయం, ఫైనాన్షియల్‌ రంగాలను ఎంచుకోవాలని కెనరా రెబెకో ఏఎంసీ చీఫ్‌ క్రిష్ణ సంఘ్వీ సూచించారు. ముఖ్యంగా ఆటుపోట్ల తరుణంలో కన్జూమర్‌ గూడ్స్‌ థీమ్‌ బాగా వర్కవుటవుతుందని ఆయన చెప్పారు. దేశ

గట్టి మద్దతు కోసం నిఫ్టీ యత్నాలు

Saturday 20th October 2018

వచ్చే వారం మార్కెట్లపై విశ్లేషణ గతవారం మార్కెట్లు ఆటుపోట్ల నడుమ ఊగిసలాడాయి. వారం ఆరంభంలో సాధించిన లాభాలన్నీ చివరకు వచ్చేసరికి ఆవిరయ్యాయి. అంతకుముందు భావించినట్లే నిఫ్టీ ఈ వారంలో 10700 పాయింట్ల వరకు పుల్‌బ్యాక్‌ చూపింది. అయితే వెనువెంటనే అక్కడనుంచి వేగంగా వెనక్కువచ్చింది. మొత్తం మీద నిఫ్టీ వారాన్ని దాదాపు 170 పాయింట్ల నష్టంతో ముగించింది. అయితే వారం చార్టుల్లో హయ్యర్‌ హై, హయ్యర్‌ లో ఏర్పరిచింది. కొత్తవారంలో నిఫ్టీ ఎక్స్‌పైనీ

Most from this category