STOCKS

News


హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రేట్ల పెంపు

Tuesday 7th August 2018
news_main1533618528.png-18993

న్యూఢిల్లీ: ప్రైవేటు రంగంలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను స్వల్పంగా పెంచింది. రిజర్వ్‌ బ్యాంకు ఎంపీసీ ఇటీవలే పావు శాతం మేర కీలక రేట్లను పెంచడంతో, హెచ్‌డీఎఫ్‌సీ సైతం ఈ దిశగా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 6 నెలల ఒక రోజు నుంచి 5 ఏళ్ల వరకు, పలు కాల వ్యవధుల డిపాజిట్లపై 0.6 శాతం వరకు పెంచింది. ఈ పెంచిన రేట్లు సోమవారం నుంచే అమల్లోకి వచ్చినట్టు బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్ల పెంపు, మరోవైపు రుణాలపై వడ్డీ రేట్ల పెంపునకూ దారితీయనుంది. 6-9 నెలలకు 0.40 శాతం పెంచి 6.75 శాతం చేసింది. 9 నెలల 3 రోజుల నుంచి ఏడాదిలోపు డిపాజిట్లపై 0.60 శాతం పెంచింది. ఏడాది కాల డిపాజిట్‌పై 0.40 శాతం పెరిగి 7.25 శాతానికి చేరుకుంది. 2 ఏళ్ల ఒక రోజు నుంచి 5 ఏళ్ల వరకు డిపాజిట్లపై కేవలం 0.10 శాతమే పెంపుదల ఉంది. 



You may be interested

పవన్‌ హన్స్ వాటా విక్రయానికి ఓకే

Tuesday 7th August 2018

న్యూఢిల్లీ: ప్రీమియర్ హెలీకాప్టర్ క్యారియర్ సంస్థ పవన్‌ హన్స్‌లో ఓఎన్‌జీసీకి ఉన్నటువంటి 49 శాతం వాటా విక్రయానికి కంపెనీ బోర్డ్‌ అంగీకారం తెలిపింది. కేంద్ర ప్రభుత్వానికి పవన్‌ హన్స్‌లో ఉన్న 51 శాతం వాటాతో కలిపి మొత్తం ఒకేసారి ఆఫర్‌ ఫర్‌ సేల్‌ రూపంలో ప్రైవేటు సంస్థకు అమ్మివేయడం ద్వారా పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని చేరుకోవాలన్న ప్రభుత్వ ఆలోచనకు మార్గం సుగమమైంది. గడిచిన పది నెలల్లో పవన్‌ హన్స్‌లో కేంద్ర

తెలంగాణలో బెనెల్లి బైక్స్‌ అసెంబ్లింగ్‌ ప్లాంట్‌

Tuesday 7th August 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఇటాలియన్‌ సూపర్‌ బైక్స్‌ బ్రాండ్‌ ‘బెనెల్లి’ భారత్‌లో తయారీకి ముందుకు వచ్చింది. ఇందుకు తెలంగాణ వేదిక అవుతోంది. సోమవారమిక్కడ తెలంగాణ ప్రభుత్వంతో ఈ మేరకు ఒక అవగాహన ఒప్పందం చేసుకుంది. తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు సమక్షంలో బెనెల్లి బోర్డ్‌ డైరెక్టర్‌ జార్జ్‌ వాంగ్‌, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. బెనెల్లి భారత భాగస్వామి

Most from this category