STOCKS

News


హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నికర లాభం 23శాతం అప్‌

Saturday 20th April 2019
news_main1555758186.png-25250

గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో  హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మార్కెట్‌ వర్గాల అంచనాలకు మించి ఫలితాలను నమోదు చేసింది. కంపెనీ మార్చి త్రైమాసికంలో రూ. 5,885.12 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. విశ్లేషకుల అంచనా రూ.5,805 కోట్ల కన్నా ఇది ఎక్కువ. అంతకు ముందు ఆర్ధిక సంవత్సరం క్యు4లో కంపెనీ ఆర్జించిన రూ.4,799.28 కోట్ల నికరలాభంతో పోలిస్తే ఇది 23శాతం అధికం. సగటు ఆస్తుల వృ‍ద్ధి 19.8శాతం పెరగగా, నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) 22.8శాతం దూసుకుపోయి రూ.13,089.50 కోట్లుగా నమోదైంది. నికర వడ్డీ మార్జిన్లు(ఎన్‌ఐఎం) సైతం 4.4శాతం పెరగాయి. ప్రొవిజన్లు అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో రూ.1,541.10 కోట్లుండగా, ఈ త్రైమాసికంలో రూ.1,889.20 కోట్లకు చేరాయి. స్థూల ఎన్‌సీఏ సైతం 1.36శాతానికి తగ్గగా, నికర ఎన్‌పీలు 0.4శాతం వద్ద నిలిచాయి. డిపాజిట్లలో 17 శాతం, కాసాలో 14 శాతం వృద్ధి నమోదయింది. రిటైల్‌ లోన్స్‌ 19 శాతం పెరిగాయి.
అంచనాలకు మించిన ఆర్థిక ఫలితాలు నమోదు కావడంతో బోర్డు మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. రూ.2లు ముఖవిలువ కలిగి ప్రతి షేరుకు రూ.15ల మధ్యంతర డివిడెండ్‌ను బోర్డు ప్రకటించింది.You may be interested

జెట్‌ ఉద్యోగులకు స్పైస్‌జెట్‌ ఆసరా

Saturday 20th April 2019

500మంది రిక్రూట్‌మెంట్‌ వంద మంది పైలట్లతో సహా 500మంది జెట్‌ ఎయిర్‌వేస్‌ ఉద్యోగులకు తమ కంపెనీలో ఉద్యోగాలు కల్పించినట్లు స్పైస్‌జెట్‌ ప్రకటించింది. అవసరాన్ని బట్టి మరింత మందిని తీసుకుంటామని భరోసా ఇచ్చింది. త్వరలో మరిన్ని రూట్లలో మరిన్ని విమానాలు నడిపేందుకు రెడీ అవుతున్నందున వీలయినంతమందిని తీసుకుంటామని తెలిపింది. జెట్‌ మూసివేతతో ఏర్పడ్డ కొరతను పూడ్చేందుకు స్పైస్‌జెట్‌ ఇప్పటికే 27 విమానాలను కొత్తగా ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో రిక్రూట్‌మెంట్‌లో భాగంగా జెట్‌ఎయిర్‌వేస్‌ ఉద్యోగులకు

మస్టేక్‌ షేరు కొనవచ్చు: ఆనంద్‌ రాఠి

Saturday 20th April 2019

ఐటీ రంగంలో సేవలు అందించే మధ్యస్థాయి కంపెనీ మస్టేక్‌ షేరును కొనవచ్చని ప్రముఖ బ్రోకరేజ్‌ సం‍స్థ ఆనంద్‌రాఠీ సిఫార్సు చేస్తుంది.  షేరు:- మస్టేక్‌  రేటింగ్‌:- బై టార్గెట్‌ ధర:- రూ.670లు విశ్లేషణ:- గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో కంపెనీ ఆదాయం క్వార్టర్‌ టు క్వార్టర్‌ 1.7శాతం పెరిగి రూ.262 కోట్లుగా నమోదైంది. ఎబిటా క్వార్టర్‌ టు క్వార్టర్‌ 13.2శాతం పెరిగింది. దీర్ఘకాలిక ప్రాజెక్టుల పూర్తి చేయడంలో విఫలమడంతో పాటు పాటు యూరోజోన్‌లో బ్రెగ్జిట్‌ అనిశ్చితి

Most from this category