STOCKS

News


హెచ్‌డీఎఫ్‌సీబ్యాంకు షేరుపై బ్రోకరేజ్‌లు బుల్లిష్‌

Monday 21st January 2019
news_main1548050839.png-23694

మూడో త్రైమాసికంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఫలితాలపై బ్రోకరేజ్‌ సంస్థలు సంతృప్తిని వ్యక్తం చేశాయి. అయితే ఆస్తుల నాణ్యత కొంత క్షీణించడంపై స్వల్ప ఆందోళన వ్యక్తం చేశాయి. పలు బ్రోకింగ్‌ సంస్థలు బ్యాంకు షేరుపై బుల్లిష్‌గా ఉన్నాయి.
1. సీఎల్‌ఎస్‌ఏ: కొనొచ్చు రేటింగ్‌. టార్గెట్‌ను రూ. 2670 నుంచి 2730 రూపాయలకు పెంచింది. లాభాలు అంచనాలకు తగినట్లే ఉన్నాయి. అయితే కాసా గ్రోత్‌ కొంత మందగించడంపై అసంతృప్తి. అసెట్‌ క్వాలిటీ కాస్త తగ్గినా ఒత్తిడిలో ఉన్న రుణాల వాటా ఇప్పటికీ మొత్తం బ్యాంకింగ్‌ రంగంతో పోలిస్తే కనిష్ఠంగానే ఉంది. రాబోయే సంవత్సరాల్లో లాభాల్లో 21 శాతం చక్రీయవార్షిక వృద్ది ఉండొచ్చు.
2. ఐడీబీఐ క్యాపిటల్‌: కొనొచ్చు రేటింగ్‌. టార్గెట్‌ను రూ. 2380 నుంచి రూ.2500కు పెంచింది. లోన్‌గ్రోత్‌ ఆరోగ్యవంతంగా ఉంది. ఎన్‌ఐఎంలు స్థిరంగా కొనసాగుతున్నాయి. స్లిపేజ్‌లు గతంతో పోలిస్తే స‍్వల్పంగా 0.3 శాతం పెరిగాయి. అయితే ఈ పెరుగుదల సాగు రంగ రుణాల వల్లనే వచ్చిఉండొచ్చు.
3. ప్రభుదాస్‌లీలాధర్‌: కొనొచ్చు రేటింగ్‌. టార్గెట్‌ రూ. 2371కు పెంచింది. పీపీఓపీలో బలమైన ప్రదర్శన చూపింది. ఎన్‌ఐఐ వృద్ధి బాగుంది. ఎర్నింగ్స్‌ అంచనాలకు తగినట్లే ఉన్నాయి. కాసా తగ్గడం గమనార్హం. ఎప్పటిలాగే సంస్థ బలమైన మార్జిన్లతో కూడిన ఎర్నింగ్స్‌ వృద్ధి సాధించింది. 
4. మోతీలాల్‌ఓస్వాల్‌: కొనొచ్చు రేటింగ్‌. టార్గెట్‌ రూ. 2500. ఇతర ఆదాయాలు పెరగడం, లోన్‌గ్రోత్‌లో వృద్ధి కారణంగా బలమైన ఫలితాలు వచ్చాయి. కోర్‌ ఫీ ఆదాయంలో మంచి వృద్ధి నమోదయింది. రాబోయే రోజుల్లో ఇదే ప్రదర్శన కొనసాగించగల సత్తా బ్యాంకుకు ఉంది. డిజిటల్‌ సేవల కారణంగా అనవసర వ్యయాలు తగ్గుతున్నాయి. You may be interested

సెన్సెక్స్‌ కీలకస్థాయి 36,470

Monday 21st January 2019

ఈ నెల తొలి రెండు వారాల్లో పరిమితశ్రేణిలో కదలిన ప్రపంచ ప్రధాన మార్కెట్లు...ముఖ్యంగా అమెరికా, యూరప్‌లు గతవారం బ్రేక్‌అవుట్‌ను సాధించి, ముందడుగు వేసాయి. ఇదేబాటలో భారత్‌ సూచీలు కొంత పెరిగినప్పటికీ, మూడు వారాల నిరోధాన్ని అధిగమించడంలో ఇబ్బంది పడుతున్నాయి.  అయితే ఇన్ఫోసిస్‌, ఐటీసీలకు తోడు ఇతర హెవీవెయిట్‌ షేర్లయిన టీసీఎస్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లు క్రితం వారం ర్యాలీ జరపడం ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చే అంశం. మరో వారం రోజుల్లో వెల్లడికానున్న కేంద్ర

ఇద్దరు పీఎన్‌బీ ఈడీలపై వేటు

Monday 21st January 2019

న్యూఢిల్లీ: నీరవ్ మోదీ కుంభకోణం ప్రభావంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)కి చెందిన మరో ఇద్దరు అధికారులపై వేటు పడింది. విధుల నిర్వహణలో వైఫల్యం ఆరోపణలతో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ (ఈడీ) కేవీ బ్రహ్మాజీ రావు, సంజీవ్ శరణ్‌లను పదవీ బాధ్యతల నుంచి తొలగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇది తక్షణమే అమల్లోకి వచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ప్రధాన బ్యాంకింగ్ వ్యవస్థను (సీబీఎస్‌), అంతర్జాతీయ లావాదేవీలకు ఉపయోగించే వ్యవస్థ

Most from this category