STOCKS

News


హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నికర లాభం 20% అప్‌

Monday 21st January 2019
news_main1548052195.png-23699

న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజమైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సర మూడో త్రైమాసికానికి ఆశాజనక ఫలితాలను ప్రకటించింది. ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌–డిసెంబర్‌)లో కంపెనీ నికర లాభం 20.3 శాతం వృద్ధి చెంది రూ.5,585.9 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికానికి రూ.4,642.6 కోట్ల నికర లాభాన్ని ఆర్జించించింది. ఈసారి లాభం గణనీయంగా పెరగడానికి.. అధిక నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) ప్రధాన కారణమని బ్యాంక్‌ ఒక ప్రకటనలో తెలియజేసింది. డిసెంబర్‌ త్రైమాసికానికి ఎన్‌ఐఐ రూ.12,577 కోట్లు కాగా, గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో నమోదైన రూ.10,314 కోట్లతో పోల్చితే.. 21.9 శాతం వృద్ధి నమోదైంది. అస్తుల వృద్ధి 23.7 శాతం, నికర వడ్డీ మార్జిన్‌ 4.3 శాతం పెరిగాయి. ఇక బ్యాంక్‌ క్యూ3 పూర్తి ఆదాయం రూ.30,811 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాదిలో ఇది రూ.24,450 కోట్లుగా ఉంది. ప్రొవిజన్స్‌ రూ.2,211,53 కోట్లుగా బ్యాంక్‌ తెలిపింది.

తగ్గిన నికర ఎన్‌పీఏలు..
గడిచిన త్రైమాసికంలో బ్యాంక్‌ నికర నిరర్థక ఆస్తులు 0.42 శాతంగా నిలిచాయి. 2017-18 క్యూ3లో ఇవి 0.44 శాతంగా ఉండగా.. ఈసారి స్వల్ప తగ్గుదల కనిపించింది. ఇక స్థూల ఎన్‌పీఏలు స్వల్పంగా పెరిగాయి. గతేడాది క్యూ3లో 1.29 శాతం కాగా, ఈసారి 1.38 శాతంగా నమోదయ్యాయి.



You may be interested

ఈ రెండు షేర్లూ కొనొచ్చు

Monday 21st January 2019

హిందుస్తాన్‌ యూనిలివర్‌    కొనచ్చు బ్రోకరేజ్‌ సంస్థ: మోతిలాల్‌ ఓస్వాల్‌ ప్రస్తుత ధర: రూ.1,744 టార్గెట్‌ ధర: రూ.2,120 ఎందుకంటే: హిందుస్తాన్‌ యూనిలివర్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ క్వార్టర్‌ ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. నికర అమ్మకాలు 11 శాతం పెరిగి రూ.9,560 కోట్లకు వృద్ధి చెందాయి. ఇబిటా 22 శాతం పెరిగి రూ.2,050 కోట్లకు, నికర లాభం 17 శాతం పెరిగి రూ.1,400 కోట్లకు చేరాయి. ఇక ఈ ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది

ఎండోమెంట్‌ ప్లాన్‌ల్లో 11 శాతం రాబడి వస్తుందా ?

Monday 21st January 2019

ప్ర: నా వయస్సు 35 సంవత్సరాలు. గత రెండున్నరేళ్ల నుంచి నేను సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) విధానంలో ఈక్విటీ మ్యూచువల్‌ఫండ్స్‌ల్లో  ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కనీసం 5-10 సంవత్సరాలు కొనసాగిద్దామనుకుంటున్నాను. నాకు ఇటీవలే ఇంక్రిమెంట్‌ వచ్చి జీతం పెరిగింది. దీంతో నా ఇన్వెస్ట్‌మెంట్స్‌ కూడా పెంచుదామనుకుంటున్నాను. ఏ కేటగిరీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయమంటారు ? -దీప్తి, హైదరాబాద్‌ జ: ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు గత రెండున్నరేళ్ల కాలం చాలా కీలకమైనది. మార్కెట్‌ 

Most from this category