STOCKS

News


హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుపై బ్రోకరేజ్‌లు బుల్లిష్‌

Monday 22nd October 2018
news_main1540187941.png-21355

క్యు2లో సంతృప్తికర ఫలితాలు ప్రకటించడంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేరుపై బ్రోకరేజ్‌లు బుల్లిష్‌గా మారాయి. సోమవారం ట్రేడింగ్‌లో షేరు 1.64 శాతం లాభంతో ట్రేడవుతోంది. 


షేరుపై వివిధ బ్రోకరేజ్‌ల అంచనాలు ఇలా ఉన్నాయి..


1. క్రెడిట్‌ సూసీ: అవుట్‌పెర్ఫామ్‌ రేటింగ్‌. టార్గెట్‌ రూ. 2500. మార్కెట్‌లో వాటా పెంచుకుంటూపోతుంది. వచ్చే ఏడాది ఆర్‌ఓఏ బలంగా 3.4 శాతానికి చేరవచ్చని అంచనా. అదేవిధంగా ఆర్‌ఓఈ 18 శాతానికి పెరగవచ్చు. ఇతర ప్రైవేట్‌ బ్యాంకులతో పోలిస్తే చాలా మెరుగ్గా ఉంది.
2. సిటి: కొనొచ్చు రేటింగ్‌. టార్గెట్‌ రూ. 2500. తాజాగా చేపట్టిన మూలధన సమీకరణ లోన్‌గ్రోత్‌కు కారకం కాగలదు. వ్యయ నియంత్రణ చర్యలు లాభాలను పెంచుతాయి. దీంతో అధిక వాల్యూషన్లకు న్యాయం జరిగేలా ఫలితాలుంటాయి.
3. మోర్గాన్‌స్టాన్లీ: ఓవర్‌ వెయిట్‌ రేటింగ్‌. టార్గెట్‌ రూ. 2550. ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. రెవెన్యూ వృద్ది బలంగా ఉండడంతో పీపీఓపీ వృద్ధి 28 శాతానికి చేరింది. ఆస్తుల నాణ్యత స్థిరంగా ఉంది.
4. ఐడీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌: అవుట్‌పెర్ఫామ్‌ రేటింగ్‌. టార్గెట్‌ రూ. 2515. ప్రస్తుత వాల్యూషన్ల వద్ద మంచి రిస్కురివార్డునందించనుంది. బలమైన లాభాలు, లిక్విడిటీల సమ్మేళనం.
5. జేపీ మోర్గాన్‌: ఓవర్‌వెయిట్‌ రేటింగ్‌. టార్గెట్‌ రూ. 2400. రెండో త్రైమాసిక ఫలితాలు అంచనాలకు తగ్గట్లుగా ఉన్నాయి. అసెట్స్‌, డిపాజిట్ల పరంగా మార్కెట్‌ వాటా మరింత పెంచుకుంటూనే ఉంది. లోన్‌గ్రోత్‌ సైతం అదరగొట్టే స్థాయిలో ఉంది. 
6. ఎడెల్‌వీజ్‌: కొనొచ్చు రేటింగ్‌. టార్గెట్‌ రూ. 2454. మౌలిక నిర్వహణా లాభదాయకత మెరుగుపడుతోంది. బ్యాంకు మూలాలు బలంగా ఉన్నాయి. ఆస్తుల నాణ్యతను స్థిరంగా కొనసాగిస్తోంది. 

 



You may be interested

రెడ్‌మి నోట్‌-6 ప్రో వచ్చేస్తోంది..

Monday 22nd October 2018

చైనాకు చెందిన దిగ్గజ మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ‘షావోమి’ మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లోకి తీసుకొచ్చేందుకు రెడీ అయ్యింది. ‘రెడ్‌మి నోట్‌-6 ప్రో’ను నవంబర్‌లో మార్కెట్‌లో ఆవిష్కరించనుంది. నవంబర్‌ 10-19 మధ్యలో మార్కెట్‌లోకి తీసుకురానుంది. దీని ధర సుమారు రూ.15,500గా ఉండొచ్చు. ప్రత్యేకతలు.. ఫ్లాగ్‌షిప్‌ కెమెరా కిల్లర్‌ ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయెల్‌ రియర్‌ కెమెరా (12 ఎంపీ+ 5 ఎంపీ), డ్యూయెల్‌ ఫ్రంట్‌ కెమెరా (20 ఎంపీ+2 ఎంపీ)

డిస్కౌంట్లో ఇండెక్స్‌ ఫ్యూచర్లు

Monday 22nd October 2018

సోమవారం భారీగ్యాప్‌అప్‌తో మార్కెట్‌ ప్రారంభమైన కొద్ది నిముషాల్లోనే ఇండెక్స్‌ ఫ్యూచర్లు డిస్కౌంట్లోకి మళ్లిపోయాయి. దాంతో ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు సైతం ట్రేడింగ్‌ లాభాల్ని పోగొట్టుకున్నాయి. 10,410 పాయింట్ల గరిష్టస్థాయివరకూ పెరిగిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ వెనువెంటనే 10,289 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. ఉదయం 11 గంటల సమయానికి స్పాట్‌ నిఫ్టీ 20 పాయింట్ల లాభంతో 10,324 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ ఫ్యూచర్‌ 10 పాయింట్ల డిస్కౌంట్‌తో 10,314 పాయింట్ల

Most from this category