STOCKS

News


అత్యంత విలువైన బ్రాండ్‌గా మరోసారి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు

Friday 7th September 2018
news_main1536295551.png-20033

ముంబై: దేశంలో అత్యంత విలువైన టాప్‌ బ్రాండ్‌గా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మరోసారి గుర్తింపు దక్కించుకుంది. బ్రాండ్జ్‌ ఇండియా టాప్‌ 50లో మొదటి స్థానాన్ని వరుసగా ఐదో ఏడాది సొంతం చేసుకుంది. ‘డబ్ల్యూపీపీ అండ్‌ కంతర్‌ మిల్‌వర్డ్‌ బ్రౌన్స్‌’ బ్రాండ్జ్‌ నివేదిక ప్రకారం... హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు బ్రాండ్‌ విలువ 21 శాతం వృద్ధి చెంది 2018లో 21.7 బిలియన్‌ డాలర్లకు చేరింది. బ్యాంకు శాఖల ద్వారా 175 డాలర్ల చిన్న రుణాలను కూడా అందించడం ద్వారా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ప్రతిష్టను సంపాదించుకుంది. ఇక ఎల్‌ఐసీ 19.8 బిలియన్‌ డాలర్ల విలువతో ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. టీసీఎస్‌ (15 బిలియన్‌ డాలర్లు) మూడో స్థానంలో, ఫ్లిప్‌ కార్ట్‌ (4.1 బిలియన్‌ డాలర్లు) 11వ స్థానంలో, పేటీఎం (4.1 బిలియన్‌ డాలర్లు) 12వ స్థానంలో, జీటీవీ (3.8 బిలియన్‌ డాలర్లు) 15వ స్థానంలో టాప్‌ బ్రాండ్లుగా గుర్తింపు తెచ్చుకున్నాయి. 50 అగ్ర స్థాయి బ్రాండ్ల విలువ 2018లో 34 శాతం పెరిగి 146.1 బిలియన్‌ డాలర్లకు చేరింది.   



You may be interested

నెట్‌ఫ్లిక్స్‌తో చేతులు కలిపిన హాత్‌వే

Friday 7th September 2018

హైదరాబాద్‌: ప్రముఖ కేబుల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సంస్థ హాత్‌వే, నెట్‌ఫ్లిక్స్‌ చేతులు కలిపాయి. హాత్‌వే సెట్‌టాప్‌ బాక్స్‌ రిమోట్‌లో నెట్‌ఫ్లిక్స్‌ పేరుతో ప్రత్యేక బటన్‌ను ఏర్పాటు చేసినట్టు, ఈ ఒక్క బటన్‌ను ప్రెస్‌ చేయడం ద్వారా నెట్‌ఫ్లిక్స్‌ కార్యక్రమాలను వీక్షించే అవకాశం కలుగుతుందని కంపెనీ తెలిపింది. ఇందుకు సంబంధించిన చార్జీలను హాత్‌వే నెలవారీ కేబుల్‌ బిల్లుతో పాటు చెల్లించొచ్చు. ప్రారంభ ధరగా సెట్‌టాప్‌ బాక్స్‌ను రూ.2,999కే అందిస్తున్నట్టు హాత్‌వే తెలిపింది. హాత్‌వే

నిస్సాన్‌లో నియామకాలు

Friday 7th September 2018

న్యూఢిల్లీ: ఆటోమొబైల్‌ పరిశ్రమలో ఎప్పటికప్పుడు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా పరిశోధన, అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డీ)పై వ్యయం పెంచుతున్నట్లు జపనీస్‌ ఆటో దిగ్గజం నిస్సాన్‌ వెల్లడించింది. భారత్‌లోని తమ చెన్నై ప్లాంట్‌ను గ్లోబల్‌ హబ్‌గా తీర్చిదిద్దనున్నట్లు  సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మాన్యుఫాక్చరర్స్‌ (సియామ్‌) ఏర్పాటుచేసిన సమావేశంలో తెలిపింది. ఈ సందర్భంగా నిస్సాన్‌ ఇండియా, ఆఫ్రికా, మధ్యతూర్పు ప్రాంతాల చైర్మన్‌ పెయమన్‌ కార్గర్‌ మాట్లాడుతూ.. ‘మూవ్‌ 2022’ పేరిట రూపొందించిన

Most from this category