STOCKS

News


హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కస్టమ్‌ ఫిట్‌ కార్ల రుణాలు

Friday 21st December 2018
news_main1545368838.png-23125

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: బ్యాంకింగ్‌ రంగ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వినియోగదార్ల అవసరాలకు అనుగుణంగా రెండు రకాల కార్ల రుణ పథకాలను ప్రకటించింది. బెలూన్‌ ఈఎంఐ, స్టెప్‌ అప్‌ స్కీమ్‌ పేరుతో వీటిని ప్రవేశపెట్టింది. బెలూన్‌ ఈఎంఈ విధానంలో.. ఉదాహరణకు కస్టమర్‌ రూ.10 లక్షల రుణం 24 నెలల కాలానికి తీసుకుని ఉంటే.. 70 శాతం రుణాన్ని (రూ.7 లక్షలు) మొదటి 23 నెలల్లో తీర్చాలి. మిగిలిన రూ.3 లక్షలను 24వ నెల చెల్లించాలి. అంత మొత్తాన్ని చివరి నెల చెల్లించలేని పక్షంగా ఈ రుణాన్ని క్రమబద్దీకరిస్తారు. అంటే కొత్త రుణంగా పరిగణిస్తారు. ఇక స్టెప్‌ అప్‌ స్కీమ్‌లో ప్రతి ఏటా ఈఎంఐ మొత్తం పెరుగుతుంది. అంటే వినియోగదారు ఆదాయం ఏటా అధికం అవుతుందన్న అంచనాల నేపథ్యంలో ఈ విధంగా స్కీమ్‌ను డిజైన్‌ చేశారు. 
దేశంలో తొలిసారిగా..
నూతన రుణ పథకాలను భారత్‌లో తొలిసారిగా హైదరాబాద్‌లో అందుబాటులోకి తెచ్చామని ఆటో లోన్స్‌ సేల్స్‌ ఎస్‌వీపీ మయూర్‌ ములానీ గురువారమిక్కడ తెలిపారు. సౌత్‌ బ్రాంచ్‌ బ్యాంకింగ్‌ హెడ్‌ మధుసూధన్‌ హెగ్డేతో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘కస్టమర్‌ ఎటువంటి డౌన్‌ పేమెంట్‌ లేకుండా రుణం పొందవచ్చు. వడ్డీ రేటు వినియోగదారునిబట్టి 9-10 శాతముంటుంది. సిబిల్‌ స్కోర్‌ ఆధారంగా 10 నిముషాల్లో లోన్‌ మంజూరు అవుతుంది. కార్‌ లోన్స్‌ విభాగంలో దేశంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు 33 శాతం వాటా ఉంది. నెలకు 50-60 వేల మంది కస్టమర్లకు కార్ల రుణం ఇస్తున్నాం. నూతన ఈఎంఐ స్కీములతో వ్యాపారం 15 శాతం అధికమవుతుందని అంచనా వేస్తున్నాం’ అని వివరించారు.

 You may be interested

స్టాట్విగ్‌కు యునిసెఫ్‌ ఫండింగ్‌

Friday 21st December 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ రంగంలో ఉన్న హైదరాబాద్‌ స్టార్టప్‌ స్టాట్విగ్‌కు యునైటెడ్‌ నేషన్స్‌ ఇంటర్నేషనల్‌ చిల్డ్రన్స్‌ ఎమర్జెన్సీ ఫండ్‌ (యునిసెఫ్‌) నుంచి సుమారు రూ.70 లక్షల ఫండింగ్‌ లభించింది. యునిసెఫ్‌ ఇన్నోవేషన్‌ ఫండ్‌కు భారత్‌ నుంచి ఎంపికైన ఏకైక కంపెనీ ఇదే. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో యునిసెఫ్‌ మొత్తం ఆరు బ్లాక్‌చైన్‌ ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెడుతోంది. వీసీ ఫండ్‌ను దక్కించుకోవడం కోసం 100 దరఖాస్తులు వచ్చాయి. కాగా,

పార్లమెంట్‌ ముందుకు కంపెనీల చట్ట సవరణ బిల్లు

Friday 21st December 2018

న్యూఢిల్లీ: కంపెనీ యాక్ట్‌ను సవరించేందుకు ఉద్దేశించిన బిల్లును ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. వ్యాపారనుకూల వాతావరణం మెరుగుపరచేందుకు వీలుగా కంపెనీల చట్టాన్ని సవరించనున్నారు. ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే గత నవంబర్‌లో జారీ చేసిన కంపెనీల సవరణ ఆర్డినెన్స్‌కు కాలం చెల్లుతుంది. కొత్త సవరణలతో ప్రత్యేక కోర్టులపై అదనపు భారం తగ్గనుంది. తాజా సవరణల ప్రకారం 16 రకాల కార్పొరేట్‌ నేరాల విచారణ అధికారం ప్రత్యేక కోర్టుల నుంచి ఇన్‌-హౌస్‌ ఎడ్జుడికేషన్‌కు

Most from this category