హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ రూ.4,000 కోట్ల షేర్ల బైబ్యాక్
By Sakshi

ముంబై: హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కంపెనీ రూ.4,000 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్ చేయనున్నది. రూ.2 ముఖ విలువ గల ఒక్కో షేర్‌ను రూ.1,100 ధరకు మొత్తం 3.63 కోట్ల షేర్లను(మొత్తం షేర్లలో ఈ షేర్లు 2.61 శాతం వాటాకు సమానం) బైబ్యాక్ చేయడానికి తమ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తెలిపింది. గురువారం బీఎస్ఈలో ఈ షేర్ 1 శాతం లాభంతో రూ.1,005 వద్ద ముగిసింది. ఈ ధరతో పోల్చితే హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ బైబ్యాక్ ధర దాదాపు 10 శాతం అధికం. కాగా గత ఏడాది ఈ కంపెనీ రూ.3,500 కోట్ల షేర్లను బైబ్యాక్ చేసింది. అప్పుడు ఒక్కో షేర్‌ను రూ.1,000 ధరకు ఈ కంపెనీ బైబ్యాక్ చేసింది. నెల క్రితం టీసీఎస్ కంపెనీ రూ. 16,000 కోట్ల షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించింన విషయం తెలిసిందే.
You may be interested
పీఎస్‌యూ కన్నా.. ప్రైవేట్ మిన్న..
Thursday 12th July 2018ముంబై: ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థలతో పోలిస్తే ప్రైవేట్ బీమా సంస్థలు గణనీయ స్థాయిలో వృద్ధి సాధిస్తున్నాయి. 2017–18లో 22 శాతం మేర వృద్ధి నమోదు చేశాయి. అదే సమయంలో ప్రభుత్వ రంగ (పీఎస్‌యూ) సాధారణ బీమా సంస్థలు 13 శాతమే వృద్ధి సాధించాయి. రేటింగ్ ఏజెన్సీ ఇక్రా నివేదిక ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం సాధారణ బీమా రంగం 17 శాతం మేర వృద్ధి చెందింది.
సిప్లా చేతికి దక్షిణాఫ్రికా ఫార్మా కంపెనీ
Thursday 12th July 2018న్యూఢిల్లీ: ఫార్మా దిగ్గజం సిప్లా కంపెనీ దక్షిణాఫ్రికాకు చెందిన మిర్రెన్ లిమిటెడ్‌ను కొనుగోలు చేయనున్నది. ఓవర్ ద కౌంటర్ (ఓటీసీ) ఔషధాలను తయారు చేసే మిర్రెన్ కంపెనీని రూ.228 కోట్లకు (45 కోట్ల దక్షిణాఫ్రికా రాండ్లు) కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నామని సిప్లా తెలిపింది. మిర్రెన్ లిమిటెడ్‌ను తమ దక్షిణాఫ్రికా అనుబంధ కంపెనీ, సిప్లా మెడ్‌ప్రో సౌత్ ఆఫ్రికా కొనుగోలు చేయనున్నదని వివరించింది. ఈ లావాదేవీకి దక్షిణాఫ్రికా కాంపిటీషన్ కమిషన్