News


హెచ్‌సీఎట్‌ టెక్‌ లాభం రూ.2,550 కోట్లు

Friday 10th May 2019
news_main1557470849.png-25651

-ఒక్కో షేర్‌కు రూ.2 మధ్యంతర డివిడెండ్‌
-ఈ ఆర్థిక సంవత్సరంలో 1,000 కోట్ల ఆదాయం లక్ష్యం 
-హెచ్‌సీఎల్‌ టెక్‌ సీఈఓ విజయ్‌ కుమార్‌ 

న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌  గత ఆర్థిక సంవత్సరం(2018-19) మార్చి క్వార్టర్‌లో రూ.2,550 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్‌)సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017-18) ఇదే క్వార్టర్‌లో రూ.2,230 కోట్ల నికర లాభం వచ్చిందని హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ తెలిపింది. ఆదాయం రూ.13,178 కోట్ల నుంచి 21 శాతం వృద్ధితో రూ.15,990 కోట్లకు పెరిగిందని హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ప్రెసిడెంట్‌, సీఈఓ సి. విజయ్‌కుమార్‌ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 14-16 శాతం రేంజ్‌లో వృద్ధి చెందగలదన్న అంచనాలున్నాయని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 1,000 కోట్ల డాలర్ల(రూ.70,258 కోట్లు) ఆదాయం సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు. ఒక్కో షేర్‌కు రూ.2 మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు. 

డిమాండ్‌ జోరుగానే....
ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2018-19లో నికర లాభం 16 శాతం వృద్ధితో రూ.10,120 కోట్లకు, ఆదాయం 19 శాతం వృద్ధితో రూ.60,427 కోట్లకు పెరిగాయని విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. స్థిర కరెన్సీ ప్రాతిపదికగా చూస్తే, గత ఆర్థిక సంవత్సరంలో 12 శాతం ఆదాయ వృద్ధిని సాధించామని, అంచనాలను అందుకున్నామని వివరించారు. డాలర్ల పరంగా చూస్తే, నికర లాభం 6 శాతం వృద్ధితో 36.4 కోట్ల డాలర్లకు, ఆదాయం 12 శాతం వృద్ధితో 220 కోట్ల డాలర్లకు పెరిగాయని వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తమకే కాకుండా, ఐటీ పరిశ్రమకు కూడా ఉత్తమ సంవత్సరం కానున్నదని పేర్కొన్నారు. టెక్నాలజీ సర్వీసులు, ఉత్పత్తులకు డిమాండ్‌ జోరుగా ఉండనున్నదని పేర్కొన్నారు. ఇక గత క్యూ4లో స్థూలంగా 14,249 మందికి ఉద్యోగాలిచ్చామని, మొత్తం ఉద్యోగుల సంఖ్య ఈ ఏడాది మార్చినాటికి 1,37,965కు పెరిగిందని విజయకుమార్‌ వివరించారు. ఏడాది కాలంలో ఆట్రీషన్‌ రేటు(ఉద్యోగుల వలస) 17.7 శాతంగా ఉందని పేర్కొన్నారు. You may be interested

మెరవని ఏషియన్‌ పెయింట్స్‌

Friday 10th May 2019

ఒక్కో షేర్‌కు రూ.7.65 తుది డివిడెండ్‌  న్యూఢిల్లీ: ఏషియన్‌ పెయింట్స్‌  గత ఆర్థిక సంవత్సరం(2018-19) నాలుగో త్రైమాసికంలో రూ.487 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017-18) క్యూ4లో సాధించిన నికర లాభం(రూ.496 కోట్లు)తో పోల్చితే 2 శాతం క్షీణించిందని ఏషియన్‌ పెయింట్స్‌ తెలిపింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.4,532 కోట్ల​ నుంచి 12 శాతం వృద్ధితో రూ.5,075 కోట్లకు పెరిగిందని పేర్కొంది. మొత్తం వ్యయాలు రూ.3,753

ఎస్‌బీఐ ఫలితాలు ఎలా ఉండొచ్చు?

Friday 10th May 2019

మార్చి త్రైమాసిక ఫలితాలను ఎస్‌బీఐ శుక్రవారం ప్రకటించనుంది. నికర వడ్డీ ఆదాయంలో రెండంకెల వృద్ధి, ప్రొవిజన్లు తగ్గడంతో బ్యాంకు మంచి లాభాలను చూపవచ్చని నిపుణులు భావిస్తున్నారు. క్యు4లో బ్యాంకు రూ.5-7వేల కోట్ల లాభాలన్ని ‍ప్రకటించవచ్చని బ్రోకింగ్‌ సంస్థలు భావిస్తున్నాయి. అంతకుముందేడాది ఇదే కాలానికి బ్యాంకు రూ. 7718 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. బ్యాంకు ఫలితాలపై వివిధ సంస్థల అంచనాలు ఇలా ఉన్నాయి.. - నార్నోలియా సెక్యూరిటీస్‌: లాభం 53 శాతం పెరిగి

Most from this category