STOCKS

News


హెచ్‌సీఎల్‌ లాభం రయ్‌

Wednesday 30th January 2019
news_main1548823514.png-23890

  • రూ. 2 డివిడెండ్‌
  • క్యూ3లో లాభం 19 శాతం అప్‌; రూ. 2,611 కోట్లు

న్యూఢిల్లీ: సాఫ్ట్‌వేర్ సేవల దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ. 2,611 కోట్ల నికర లాభం ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో నమోదైన రూ. 2,194 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 19 శాతం అధికం. మరోవైపు, సంస్థ ఆదాయం సుమారు 23 శాతం వృద్ధితో రూ. 12,808 కోట్ల నుంచి రూ. 15,699 కోట్లకు చేరింది. 2019 ఆర్థిక సంవత్సరానికి గాను హెచ్‌సీఎల్‌ రూ. 2 మధ్యంతర డివిడెండ్‌ ప్రకటించింది. సీక్వెన్షియల్‌గా చూస్తే స్థిర కరెన్సీ ప్రాతిపదికన ఆదాయాలు 5.6 శాతం మేర పెరిగాయని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సీఈవో సి. విజయ కుమార్ తెలిపారు.
    డాలర్‌ మారకంలో చూస్తే డిసెంబర్‌ క్వార్టర్‌లో నికర లాభం 7 శాతం పెరిగి 364 మిలియన్ డాలర్లుగా నమోదు కాగా. ఆదాయం సుమారు 11 శాతం వృద్ధితో 2.2 బిలియన్ డాలర్లకు చేరింది. స్థిర కరెన్సీ ప్రాతిపదికన ఈ ఆర్థిక సంవత్సరంలో 9.5-11.5 శాతం మేర ఆదాయ వృద్ధి అంచనాలను కంపెనీ యథాతథంగా కొనసాగిస్తోంది. క్యూ3లో స్థూలంగా 13,191 మంది ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంది. డిసెంబర్ ఆఖరు నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,32,328కి చేరింది. ఐటీ సేవల వ్యాపార విభాగంలో అట్రిషన్ రేటు 17.8 శాతంగా ఉంది.



You may be interested

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ స్కామ్‌పై విచారణ జరిపించాలి

Wednesday 30th January 2019

-మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్‌ సిన్హా డిమాండ్‌ -ఇది దురుద్దేశపూరితం: డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ న్యూఢిల్లీ: డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ కంపెనీ రూ.31,000 కోట్ల కుంభకోణానికి పాల్పడిన విషయమై విచారణ జరిపించాలని మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్‌ సిన్హా డిమాండ్‌ చేశారు. తక్షణం ఈ విషయమై ప్రభుత్వం విచారణ జరపకపోతే  ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కోర్టు పర్యవేక్షణలో సిట్‌తో దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. వేలాది డొల్ల కంపెనీలను రద్దు చేశామని ప్రభుత్వం చెప్పుకుంటోందని,

యస్‌ బ్యాంక్‌ ప్రమోటర్ల సయోధ్య

Wednesday 30th January 2019

-చెరొక డైరెక్టర్‌ను నియమించడానికి అంగీకారం న్యూఢిల్లీ: యస్‌బ్యాంక్‌ ప్రమోటర్లు-రాణా కపూర్‌, మధు కపూర్‌ల మధ్య సయోధ్య కుదిరింది. ఈ సయోధ్యలో భాగంగా ఇరువురు ప్రమోటర్లు చెరో డైరెక్టర్‌ను నియమించడానికి అంగీకరించారు. తదుపరి బోర్డ్‌ సమావేశం జరిగే ఏప్రిల్‌ నెలలో ఈ డైరెక్టర్ల పేర్లను ప్రకటిస్తారని యస్‌బ్యాంక్‌ తెలిపింది. కాగా ఈ నెల 31తో ఎమ్‌డీ, సీఈఓగా రాణా కపూర్‌ పదవీ కాలం ముగుస్తోంది. రాణా కపూర్‌ వారసుడిగా రవ్‌నీత్‌ సింగ్‌ గిల్‌

Most from this category