STOCKS

News


త్వరలో హావెల్స్‌ స్మార్ట్‌ ఫ్యాన్‌

Thursday 15th November 2018
news_main1542258379.png-22023

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఎలక్ట్రికల్‌ ఉపకరణాల తయారీ కంపెనీ హావెల్స్‌ ఇండియా... దేశంలో తొలి స్మార్ట్‌ ఫ్యాన్‌ను బుధవారమిక్కడ ఆవిష్కరించింది. జనవరి నుంచి ఇది మార్కెట్లో అందుబాటులోకి రానుంది. రిమోట్‌, మొబైల్‌ యాప్‌, వైఫైతో ఇది పనిచేస్తుంది. అలాగే అలెక్సా, గూగుల్‌ హోమ్‌ ఉపకరణాల ద్వారా కూడా ఆపరేట్‌ చేయవచ్చు. గది ఉష్ణోగ్రతను బట్టి వేగాన్ని దానంతటదే మార్చుకుంటుంది. వచ్చే వేసవి కోసం కొత్తగా 8 రకాల ఫ్యాన్లను సిద్ధం చేశామని హావెల్స్‌ ఇండియా ప్రెసిడెంట్‌ సౌరభ్‌ గోయల్‌ ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. సాధారణ ఫ్యాన్లను స్మార్ట్‌గా మార్చే ఓ కిట్‌ను సైతం రూపొందించామన్నారు. రూ.7,000 కోట్ల వ్యవస్థీకృత రంగ ఫ్యాన్ల మార్కెట్లో తమ కంపెనీకి 17 శాతం వాటా ఉందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20-24 శాతం వృద్ధి ఆశిస్తున్నట్టు చెప్పారు.



You may be interested

47 శాతం పెరిగిన ఎంఎస్‌ఆర్‌ లాభం

Thursday 15th November 2018

సెప్టెంబరు క్వార్టరులో ఎంఎస్‌ఆర్‌ కాపర్‌ నికరలాభం క్రితంతో పోలిస్తే 47 శాతం పెరిగి రూ.84 లక్షలుగా నమోదైంది. టర్నోవరు రూ.47.5 కోట్ల నుంచి రూ.52 కోట్లకు చేరింది. ఏప్రిల్‌-సెప్టెంబరు పీరియడ్‌లో రూ.87 కోట్ల టర్నోవరుపై రూ.1.37 కోట్ల నికరలాభం సాధించింది. బుధవారం బీఎస్‌ఈలో కంపెనీ షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే 3.96 శాతం అధికమై రూ.15.50 వద్ద స్థిరపడింది.

హోమ్‌ థియేటర్‌.. ఎంటర్‌టైన్‌మెంట్‌ అడ్డా!

Thursday 15th November 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: అమెజాన్‌, హాట్‌స్టార్‌, జీ, ఈరోస్‌, సన్‌... ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి కంపెనీ తమకు ప్రత్యేక హక్కులున్న సినిమాలు, ఇతర వీడియో కంటెంట్‌తో ఆన్‌లైన్లోకి వచ్చేశాయ్‌!!. కొన్ని కంపెనీలు కాస్త ముందుకెళ్లి సొంత కంటెంట్‌నూ అభివృద్ధి చేస్తున్నాయి. ఇదంతా ఎందుకంటే.. స్మార్ట్‌ టీవీల సాయంతో ఇంట్లోనే సినిమాలు చూసే జనం పెరుగుతుండటం వల్లే!! కొందరైతే ఇంకాస్త ముందుకెళ్లి... ఇళ్లనే థియేటర్లుగా మార్చేసుకుంటున్నారు. ఇంటిల్లిపాదీ కలిసో... బంధువులతోనో

Most from this category