STOCKS

News


హాత్‌వే ఓటీటీ సెట్‌ టాప్‌ బాక్స్‌

Friday 5th October 2018
news_main1538713320.png-20871

ముంబై: కేబుల్‌, బ్రాడ్‌బ్యాండ్‌ సేవల్లో ఉన్న హాత్‌వే తాజాగా ఆండ్రాయిడ్‌ టీవీ ఆధారిత ఓవర్‌ ద టాప్‌ సెట్‌ టాప్‌ బాక్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఓవర్‌ ద టాప్‌ విభాగంలో టీవీ వీక్షణం సులభతరం చేసే లక్ష్యంగా కంపెనీ దీనిని రూపొందించింది. రిమోట్‌ కంట్రోల్‌కు యూట్యూబ్‌, నెట్‌ఫ్లిక్స్‌, గూగుల్‌ ప్లే కోసం ప్రత్యేక బటన్లు ఏర్పాటు చేశామని హాత్‌వే ఎండీ రాజన్‌ గుప్తా ఈ సందర్భంగా వెల్లడించారు. అంతర్జాతీయ, దేశీయ టీవీ సిసీస్‌, మూవీస్‌ వంటి కంటెంట్‌ను నేరుగా పొందేందుకు ఈ బాక్స్‌ తోడ్పడుతుంది. ఫోన్లో ఉన్న కంటెంట్‌ను టీవీలో వీక్షించొచ్చు. గూగుల్‌ ప్లే కంటెంట్‌ను పెద్ద స్క్రీన్‌పై చూడొచ్చు. అల్ట్రా స్మార్ట్‌ హబ్‌ పేరుతో కేబుల్‌ హైబ్రిడ్‌ బాక్స్‌ను సైతం హాత్‌వే ప్రవేశపెట్టింది. కార్యక్రమంలో సినీ నటి రాధిక ఆప్టే, ఆండ్రాయిడ్‌ టీవీ అపాక్‌ హెడ్‌ మార్క్‌ సీడెన్‌ఫెడ్‌ పాల్గొన్నారు.



You may be interested

ఫోర్బ్స్‌ జాబితాలో మనోళ్లు ముగ్గురు!

Friday 5th October 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: భారతదేశంలో ఈ ఏటి శ్రీమంతులంటూ ఫోర్బ్స్‌ వెలువరించిన జాబితాలో మళ్లీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీయే అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. దాదాపు రూ.3.4 లక్షల కోట్ల సంపదతో ఆయన నెంబర్‌-1 స్థానంలో నిలిచారు. నిజానికి లిస్టెడ్‌ కంపెనీ అయిన రిలయన్స్‌... గత కొద్ది రోజుల్లోనే ఏకంగా 20 శాతం వరకూ పతనమయింది. ఫోర్బ్స్‌ జాబితా గనక ఇప్పుడు వెలురించి ఉంటే ఆయన సంపద రూ.3 లక్షల

మ్యూచ్‌వల్‌ ఫండ్ల.. చలో ఫారిన్‌!

Friday 5th October 2018

న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో మన ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఆస్థిరతల మధ్య కదలాడుతూ, నష్టాలను పంచుతున్నాయి. ఇందుకు ఎక్కువగా అంతర్జాతీయ అంశాలే కారణం. దీంతో దేశీయ మ్యూచువల్‌ ఫండ్స్‌లో పేరొందిన పథకాల రాబడులు గత ఏడాది కాలంలో చూసుకుంటే మైనస్‌లోకి వెళ్లిపోయాయి. కానీ, ఇదే సమయంలో అమెరికా మార్కెట్లు మంచి ర్యాలీ చేస్తున్నాయి. మన మార్కెట్లలో ఇన్వెస్ట్‌ చేసిన వారికి నష్టాలు, అమెరికా మార్కెట్లలో ఇన్వెస్ట్‌ చేసిన వారికి లాభాలు

Most from this category