STOCKS

News


మేం పోటీలో ఉంటాం: వొడాఫోన్‌

Tuesday 10th July 2018
news_main1531241777.png-18188

న్యూఢిల్లీ: ఐడియా సెల్యులర్‌తో విలీనాంతరం భారత్‌ మార్కెట్‌లో పోటీలో ఉంటామని బ్రిటిష్‌ టెలికం దిగ్గజం వోడాఫోన్‌ గ్రూప్‌ సీఈవో, చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ నిక్‌ రీడ్‌ తెలిపారు. వొడాఫోన్‌ ఇండియా, ఐడియా సెల్యులర్‌ విలీనం ఆమోదం తర్వాత వొడాఫోన్‌ టాప్‌ మేనేజ్‌మెంట్‌ మంగళవారం కమ్యూనికేషన్స్‌ మంత్రి మనోజ్‌ సిన్హా, ఆ శాఖా కార్యదర్శి అరుణ సుందరరాజన్‌తో సమావేశమైంది. విలీన ఆమోదపు ఆర్డర్‌ చేతికి వచ్చిందని, ఆ పత్రాలను అందుకోవడం సంతోషంగా ఉందని రీడ్‌ తెలిపారు. అయితే చెల్లింపులు, బ్యాంక్‌ గ్యారంటీ వంటి అంశాలపై స్పందిచలేదు. విలీనం అనంతరం వొడాఫోన్‌ ఐడియా కంపెనీ ఏర్పాటు తర్వాత భవిష్యత్‌ ప్రణాళికలపై రీడ్‌ స్పందిస్తూ.. భారత్‌లో తాము ఇక ముందూ బలమైన ఇన్వెస్టర్‌గా ఉంటామని పేర్కొన్నారు. వొడాఫోన్‌, ఐడియా విలీనాంతరం ఏర్పాటు కానున్న సంస్థ భారత్‌లో అతిపెద్ద టెలికం కంపెనీగా అవతరించనుంది. కంపెనీ మార్కెట్‌ వాటా 35 శాతానికి, సబ్‌స్ర్కైబర్ల సంఖ్య 43 కోట్లకు చేరుతుంది. అలాగే అన్ని టెలికం సర్కిళ్లలోనూ 4జీ స్పెక్ట్రమ్‌ను కలిగి ఉంటుంది. మరోవైపు భారతీ ఎయిర్‌టెల్‌ దేశీ అతిపెద్ద టెలికం సంస్థ అనే పేరును కోల్పోతుంది. విలీనాంతరం ఏర్పడే సంస్థలో వొడాఫోన్‌కు 45.1 శాతం వాటా, ఆదిత్య బిర్లా గ్రూప్‌కు 26 శాతం వాటా, ఐడియా షేర్‌హోల్డర్లకు 28.9 శాతం వాటా ఉంటుంది. 



You may be interested

ట్రక్‌ ఈజీలో 26 శాతం వాటా కొనుగోలు చేసిన టాటా మోటార్స్‌

Tuesday 10th July 2018

న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌ తొలిసారిగా ఒక స్టార్టప్‌లో పెట్టుబడులు పెట్టింది. టెక్నాలజీ ఆధారిత ఫ్రైట్‌ అగ్రిగేటర్‌ ట్రక్‌ఈజీలో 26 శాతం వాటాను కొనుగోలు చేసింది.  టాటా మోటార్స్‌ పూర్తి అనుబంధ సంస్థ టాటా మోటార్స్‌ ఫైనాన్స్‌ హోల్డిం‍గ్స్‌ కంపెనీ ఈ వాటాను కొనుగోలు చేసిందని టాటా మోటార్స్‌ తెలిపింది. అయితే ఈ డీల్‌కు సంబంధించిన ఆర్థిక వివరాలను కంపెనీ వెల్లడించలేదు. ట్రక్కుల ద్వారా జీవనోపాధి పొందుతున్న వారి కోసం చేస్తున్న

విద్యా రుణం... పెరిగిన పరిమాణం..

Tuesday 10th July 2018

 రూ. 9.6 లక్షలకు సగటు రుణం   గతేడాది ఇది రూ. 6.8 లక్షలే  విద్యారుణాల్లో  పీఎస్‌బీలదే మెజారిటీ వాటా న్యూఢిల్లీ: ఉన్నత విద్య కోసం రుణాలు తీసుకునే విద్యార్థుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ..  చదువుల వ్యయాలు భారీగా పెరుగుతున్నాయనడానికి సూచనగా రుణ పరిమాణం పెరుగుతోంది. క్రెడిట్ బ్యూరో సీఆర్‌ఐఎఫ్ హైమార్క్ రూపొందించిన నివేదిక ప్రకారం గత సంవత్సరంలో విద్యా రుణం పరిమాణం సగటున రూ. 6.8 లక్షలే ఉండగా.. ఈసారి ఏకంగా రూ. 9.6 లక్షలకు

Most from this category